నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారు.. నేను ఓ సైనికుడి కూతురిని.. పోరాడుతూనే ఉంటాను: భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన విడాకుల వార్తలపై స్పందించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ సుదీర్ఘ పోస్టు చేసిన ఆమె.. తాను సైనికుడి కూతురిని అని, తాను పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేసింది. నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారని బాధపడింది.

Published on: Nov 25, 2025 4:24 PM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు నమోదు చేసినట్లు వార్తలు వచ్చిన కొన్ని గంటల తర్వాత మాజీ నటి సెలీనా జైట్లీ స్పందించింది. తన రాబోయే విడాకుల ప్రక్రియపై కూడా మాట్లాడింది. తన అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో సుదీర్ఘ నోట్‌ను పంచుకున్న సెలీనా.. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన తన న్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపింది.

నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారు.. నేను ఓ సైనికుడి కూతురిని.. పోరాడుతూనే ఉంటాను: భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్
నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారు.. నేను ఓ సైనికుడి కూతురిని.. పోరాడుతూనే ఉంటాను: భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్

విడాకులు, గృహ హింస కేసుపై సెలీనా ప్రకటన

బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ మంగళవారం (నవంబర్ 25) మధ్యాహ్నం తన ఫేస్‌బుక్ పేజీలో ఒక గ్రీన్ చీరలో కిటికీ దగ్గర కూర్చున్న థ్రోబ్యాక్ ఫొటో షేర్ చేస్తూ ఒక నోట్‌ను పంచుకుంది. "నా జీవితంలో అత్యంత బలమైన, అత్యంత అల్లకల్లోలమైన తుఫాను మధ్యలో నేను ఒంటరిగా పోరాడుతానని ఎప్పుడూ ఊహించలేదు. తల్లిదండ్రులు, ఎటువంటి సపోర్ట్ సిస్టమ్ లేకుండా, ఒకప్పుడు ఆధారపడిన నా తల్లిదండ్రులు, నా సోదరుడు, నా పిల్లలు, నాకు అండగా నిలుస్తానని, నన్ను ప్రేమిస్తానని, నన్ను జాగ్రత్తగా చూసుకుంటానని, ప్రతి కష్టాన్ని నాతో పంచుకుంటానని వాగ్దానం చేసిన వ్యక్తి.. వీరెవరూ లేని రోజు వస్తుందని నేను అనుకోలేదు" అని సెలీనా బాధపడింది.

అన్నింటినీ దూరం చేసింది

సెలీనా కవితాత్మకంగా తాను పడుతున్న బాధలను వర్ణించింది. "జీవితం ప్రతిదీ దూరం చేసింది. నేను నమ్మిన వ్యక్తులు దూరమయ్యారు. నేను నమ్మిన వాగ్దానాలు కల్లలయ్యాయి. కానీ ఈ తుఫాను నన్ను ముంచివేయలేదు.. ఎందుకంటే నేను సైనికుడి కూతురిని. ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల, ఫైర్, విశ్వాసంతో పెరిగాను. ప్రపంచం నన్ను పడగొట్టాలనుకున్నప్పుడు లేచి నిలబడాలని, నా గుండె ముక్కలవుతున్నా పోరాడాలని, నాకు అన్యాయం జరిగినప్పుడు కనికరం చూపకూడదని, అసాధ్యమనిపించినా బతికి ఉండాలని నాకు నేర్పించారు" అని సెలీనా చెప్పింది.

న్యాయ పోరాటంపై దృష్టి

దాదాపు ఒక సంవత్సరం పాటు యూఏఈలో నిర్బంధంలో ఉన్న తన సోదరుడిని తిరిగి తీసుకురావడంపైనే తాను ప్రస్తుతం దృష్టి సారిస్తున్నానని ఆమె తెలిపింది. "నా సైనిక సోదరుడి కోసం పోరాడటం, నా పిల్లల ప్రేమ కోసం పోరాడటం, నా గౌరవం కోసం పోరాడటమే నా ప్రాధాన్యతగా మిగిలింది" అని సెలీనా చెప్పింది.

సెలీనా తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస, క్రూరత్వం, మోసం ఆరోపణల కింద డొమెస్టిక్ వయొలెన్స్ చట్టం ప్రకారం కేసు దాఖలు చేసింది. ఆమె తన ఆదాయం, ఆస్తుల నష్టానికి బదులుగా రూ.50 కోట్ల నష్టపరిహారాన్ని కోరింది.

సెలీనా 2011లో ఆస్ట్రియన్ ఫౌండర్, హోటలియర్ అయిన పీటర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ముగ్గురు కుమారులు (విన్‌స్టన్, విరాజ్, ఆర్థర్) ఉన్నారు. వారి కవల కుమారులలో ఒకరైన శంషేర్ గుండె సమస్యతో మరణించాడు.

News/Entertainment/నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారు.. నేను ఓ సైనికుడి కూతురిని.. పోరాడుతూనే ఉంటాను: భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్
News/Entertainment/నమ్మిన వాళ్లందరూ దూరమయ్యారు.. నేను ఓ సైనికుడి కూతురిని.. పోరాడుతూనే ఉంటాను: భర్తతో విడాకుల వార్తలపై స్పందించిన హీరోయిన్