Actress: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఉండే కఠినమైన బ్యూటీ స్టాండర్డ్స్, నటీనటులు ఎదుర్కొనే బాడీ షేమింగ్ విమర్శలపై ప్రముఖ నటి నేహా ధూపియా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కెరీర్ ప్రారంభంలో ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ చేసిన దారుణమైన వ్యాఖ్య తన ఆత్మవిశ్వాసాన్ని ఎలా దెబ్బతీసిందో, దానివల్ల దాదాపు పదేళ్ల పాటు తను ఫోటోలకు నవ్వడమే మానేశానని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఆ ఒక్క మాటతో 10 ఏళ్లు నవ్వడమే మానేశాను

నేహా ధూపియా, ఆమె భర్త అంగద్ బేడీ కలిసి హోస్ట్ చేస్తున్న ‘డబుల్ డేట్’ (Double Date) టాక్ షోకి నటి హుమా ఖురేషి, ఆమె సోదరుడు సాఖిబ్ సలీమ్ అతిథులుగా వచ్చారు. ఈ ఎపిసోడ్ లో నేహా తన కెరీర్ తొలినాళ్లలోని చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
ఆడిషన్ చేదు అనుభవం: నేహా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చినప్పుడు ఒక టీవీ షో ఆడిషన్ కోసం వెళ్లారు. అప్పుడు ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ కారులో కూర్చుని ఆమెను చూసి నవ్వమనగా.. నేహా నవ్వింది.
క్యాస్టింగ్ డైరెక్టర్ వ్యాఖ్య: "నువ్వు అస్సలు నవ్వకు.. నవ్వితే చాలా దారుణంగా ఉంటావు. నీ ముఖంలో నవ్వనప్పుడే పవర్ ఉంటుంది. నీ నవ్వు నీకు అస్సలు సెట్ అవ్వదు" అని అతను ముఖం మీదే చెప్పేశాడు.
ఈ మాట నేహా మనసును తీవ్రంగా గాయపరిచింది. ఆ తర్వాత ఆమె ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలుచుకున్నప్పటికీ, ఆ సమయంలోని ఆమె ఫోటోలను గమనిస్తే ఎక్కడా నవ్వుతూ కనిపించరు. ఈ కామెంట్ నుండి బయటపడటానికి ఆమెకు దాదాపు 8 నుండి 10 ఏళ్లు పట్టిందట. అలాగే మిస్ యూనివర్స్ పోటీల్లో ఓడిపోవడం కూడా ఆమెను మానసికంగా కుంగదీసిందని, కోలుకోవడానికి 10 నెలలు పట్టిందని తెలిపారు.
ట్రోలింగ్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లిన హుమా ఖురేషి
ఇదే షోలో నటి హుమా ఖురేషి కూడా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. తన రెండో సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన విపరీతమైన ట్రోలింగ్ వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పారు.
{{/usCountry}}ఇదే షోలో నటి హుమా ఖురేషి కూడా తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఇబ్బందులను పంచుకున్నారు. తన రెండో సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన విపరీతమైన ట్రోలింగ్ వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురయ్యానని చెప్పారు.
{{/usCountry}}ఆ నెగిటివిటీని తట్టుకోలేక ఎవరితోనూ మాట్లాడకుండా ఒంటరిగా ఉండిపోయానని, ఆ తర్వాత థెరపీ తీసుకోవడం, జర్నలింగ్ అలవాటు చేసుకోవడం ద్వారానే ఆ ఒంటిరితనం, మానసిక ఒత్తిడి నుండి బయటపడగలిగానని హుమా వెల్లడించారు.