బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోబోతున్న బాలీవుడ్ బ్యూటీ.. ఇది నాకూ న్యూసే అంటున్న ఆమె బ్రదర్
బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆమె సోదరుడు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇది తనకు కూడా వార్తే అవుతుందని అతడు అనడం విశేషం.
కుర్రకారు హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి ఇప్పుడు నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. ఆమె తన ప్రియుడు, రైటర్ రాహుల్ మోడీతో త్వరలోనే ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోందంటూ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ వార్తలపై శ్రద్ధా సోదరుడు, నటుడు సిద్ధాంత్ కపూర్ ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

నాకు కూడా ఇప్పుడే తెలిసింది: సిద్ధాంత్
ఈ వారంలో పలు వెబ్ సైట్ల లో శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి కథనాలు వచ్చాయి. "అధికారిక ప్రకటన లేకపోయినా, శ్రద్ధా కపూర్ తన చిరకాల ప్రియుడిని ఉదయపూర్‌లో ఒక హెరిటేజ్ వెడ్డింగ్ స్టైల్లో పెళ్లాడబోతోంది. శ్రద్ధా పెళ్లి వార్త విన్న ఫ్యాన్స్ ఆనందంతో పాటు, హార్ట్ బ్రేక్ ఎమోషన్స్ వ్యక్తం చేస్తున్నారు" అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో రాసుకొచ్చారు.
దీన్ని చూసిన సిద్ధాంత్ కపూర్ ఆశ్చర్యపోతూ.. నవ్వుతూ కామెంట్ సెక్షన్‌లో స్పందించాడు. "ఇది నాకు కూడా కొత్త న్యూసే" అంటూ చమత్కరించాడు. ఇంకేముంది.. సిద్ధాంత్ కామెంట్ చూశాక ఇవన్నీ కేవలం వదంతులేనని తేలిపోయింది. "హమ్మయ్య.. క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్.. ఇకనైనా రూమర్స్ ఆగుతాయని ఆశిస్తున్నాం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
నేను పెళ్లి చేసుకుంటా..
గత వారం శక్తి కపూర్ కూతురు శ్రద్ధ కూడా తన పెళ్లి విషయంపై పరోక్షంగా స్పందించారు. ఒక అభిమాని "శ్రద్ధా గారూ.. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?" అని అడగ్గా, ఆమె తనదైన శైలిలో చమత్కారంగా బదులిచ్చింది. "నేను చేసుకుంటా.. పెళ్లి చేసుకుంటా" అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది తప్ప ఎప్పుడు ఎక్కడ అనే విషయాలను బయటపెట్టలేదు.
వడాపావ్ డేట్..
శ్రద్ధా కపూర్, రాహుల్ మోడీ డేటింగ్‌లో ఉన్నారంటూ 2024 ఆరంభం నుంచి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ముంబైలో డిన్నర్ డేట్‌లకు వెళ్తూ కెమెరా కంటికి చిక్కారు. మధ్యలో వీరిద్దరూ విడిపోయారంటూ పుకార్లు వచ్చినప్పటికీ.. డిసెంబర్ 2024లో రాహుల్‌తో కలిసి వడాపావ్ తింటున్న ఫోటోను షేర్ చేసి శ్రద్ధా ఆ రూమర్లకు చెక్ పెట్టారు. పబ్లిక్‌గా తమ బంధాన్ని ప్రకటించకపోయినా, తరచుగా వీరిద్దరూ జంటగా కనిపిస్తూనే ఉన్నారు.
శ్రద్ధా కపూర్ విషయానికి వస్తే ఆమె ప్రభాస్ తో సాహో మూవీలో నటించి తెలుగు వారికి కూడా దగ్గరైంది. హిందీలో ఆషిఖీ 2 ద్వారా ఆమె మంచి పేరు సంపాదించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


