Pallaburusu Movie: పళ్లబురుసు మూవీకి 5 స్టార్ రేటింగ్.. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్ మూవీ: బాలీవుడ్ డైరెక్టర్

Pallaburusu Movie: తెలుగు మూవీ పళ్లబురుసుపై బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ మూవీకి 5 స్టార్ రేటింగ్ ఇస్తూ.. పెద్ద యాక్షన్ కమర్షియల్ సినిమాలకు ఇదో దెబ్బ అని అనడం విశేషం.

Published on: Aug 17, 2026, 19:55:42 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Pallaburusu Movie: బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ చిన్న తెలుగు సినిమా 'పళ్లబురుసు' చూసి కళ్లు తేలేశారు. బాక్సాఫీస్ వద్ద రొటీన్ యాక్షన్, ధమాకా సినిమాల రచ్చ నడుస్తున్న టైమ్‌లో వచ్చిన ఈ రూరల్ ఎమోషనల్ డ్రామాకి ఏకంగా 5 స్టార్ రేటింగ్ ఇచ్చి నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు.

Pallaburusu Movie: పళ్లబురుసు మూవీకి 5 స్టార్ రేటింగ్.. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్ మూవీ: బాలీవుడ్ డైరెక్టర్
Pallaburusu Movie: పళ్లబురుసు మూవీకి 5 స్టార్ రేటింగ్.. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్ మూవీ: బాలీవుడ్ డైరెక్టర్

డెబ్యూ డైరెక్టర్ ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చి ఆడియన్స్ మనసు గెలుచుకుంది. సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చూసిన అనురాగ్ కశ్యప్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ లెటర్‌బాక్స్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అద్భుతమైన రివ్యూస్ ఇచ్చారు.

'వెంకటేష్ మహా' తర్వాత ఆ రేంజ్ టాలెంట్

పళ్లబురుసు సినిమాపై లెటర్‌బాక్స్‌లో రివ్యూ రాస్తూ అనురాగ్ కశ్యప్ చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "ఒకేలా ఉండే నాన్‌స్టాప్ యాక్షన్ సినిమాల రొటీన్ ఫార్మాట్ నుంచి 'పళ్లుబురుసు' చాలా రిఫ్రెషింగ్ ఛేంజ్ ఇచ్చింది. ముఖంపై నిరంతరం చిరునవ్వులు పూయించేంత అందమైన సినిమా ఇది. 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్ట్ చేసిన వెంకటేష్ మహా తర్వాత నేను అంతగా ఆసక్తిగా వెయిట్ చేసే డైరెక్టర్ ఉదయ్ చౌహానే" అని ప్రశంసించారు.

అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేస్తూ.. "పళ్లబురుసు అంటే టూత్ బ్రష్ అని నా అనుమానం. తెలుగు సినిమా నుంచి వచ్చిన మోస్ట్ ఫన్, ఫాసినేటింగ్ డ్రామా ఇది. తన కొడుకు పళ్లు తోముకునే బ్రష్ కొనివ్వలేదని పోలీస్ స్టేషన్, కోర్టు మెట్లు ఎక్కే తండ్రి కథ. పెద్ద నటులు లేరు, చెవులు చిల్లులు పడే మ్యూజిక్ లేదు. జస్ట్ ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్" అని కొనియాడారు.

పళ్లు తోముకునే బ్రష్ చుట్టూ తిరిగే లీగల్ డ్రామా

తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా కథ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. వయసు మళ్లిన తండ్రి (సుధాకర్ రెడ్డి) తన కొడుకు (మురళీధర్ గౌడ్)పై పోలీస్ స్టేషన్‌లో కేసు పెడతాడు. కారణం ఏంటంటే.. తనకు కావలసిన పళ్ల బురుసు కొనివ్వలేదని. మొదట్లో ఇది చాలా చిన్న ఈగో గొడవలా కనిపించినా, ఆ తర్వాత తండ్రీ కొడుకుల మధ్య ఏళ్ల తరబడి దాగి ఉన్న ఒంటరితనం, ఆవేదన, ప్రేమ, బంధాల అసలు రంగు బయటపడుతుంది.

ఈ కథ వెనుక ఉన్న రియల్ ఇన్‌స్పిరేషన్ గురించి డైరెక్టర్ ఉదయ్ చెబుతూ.. "పొలాల్లోని ఒక శ్మశానం మధ్యలో 70 ఏళ్ల వృద్ధుడు వెక్కి వెక్కి ఏడవడం చూశాను. అంతపెద్ద మనిషిని అంతగా కుంగదీసిన బాధ ఏంటని ఆలోచించడం నుంచే ఈ 'పళ్లబురుసు' ఐడియా పుట్టింది" అని తెలిపారు.

అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ సపోర్ట్

ఈ చిన్న చిత్రాన్ని అక్కినేని నాగార్జునకు చెందిన ప్రఖ్యాత అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. సినిమా అవుట్‌పుట్ చూసి ఇంప్రెస్ అయిన నాగార్జున, నాగ చైతన్యలు ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి సపోర్ట్ అందించారు.

పెద్ద స్టార్ డమ్, భారీ బడ్జెట్ హంగులు లేకపోయినా.. వినూత్నమైన కథనం, నేచురల్ యాక్టింగ్‌తో వచ్చిన 'పళ్లబురుసు' థియేటర్లలో సక్సెస్‌ఫుల్ రన్ సాధించడమే కాకుండా, అనురాగ్ కశ్యప్ లాంటి నేషనల్ ఫిల్మ్‌మేకర్స్ ప్రశంసలు అందుకోవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More