Disha Patani Tiger Shroff: ఫొటోగ్రాఫ‌ర్ల‌నూ ప‌ట్టించుకోని దిశా ప‌టానీ.. ప‌రుగు ప‌రుగున టైగ‌ర్ ష్రాఫ్ ఇంట్లోకి.. టెన్షన్!

Disha Patani Tiger Shroff: బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ దిశా పటానీ తెగ టెన్షన్ పడింది. కనీసం పాపరాజీలను పట్టించుకోకుండా పరుగు పరుగున టైగర్ ష్రాఫ్ ఇంట్లోకి వెళ్లింది. టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన నేపథ్యంలో అతణ్ని కలిసేందుకు దిశా పటానీ వెళ్లింది. గతంలో వీళ్లు డేటింగ్ చేశారనే టాక్ ఉంది. 

Published on: Oct 19, 2026, 08:45:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Disha Patani Tiger Shroff: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్‌పై ముంబైలో కాల్పులు జరగడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఆదివారం (అక్టోబర్ 18) జుహు ప్రాంతంలో కొందరు గుర్తుతెలియని దుండగులు ఆయన కారుపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ప్రమాద వార్త తెలియగానే బాలీవుడ్ నటి, టైగర్ మాజీ గర్ల్‌ఫ్రెండ్ దిశా పటానీ తీవ్ర ఆందోళనకు గురైంది. కంగారుతో ఆమె పరుగు పరుగున టైగర్ ఇంటికి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఫొటోగ్రాఫ‌ర్ల‌నూ ప‌ట్టించుకోని దిశా ప‌టానీ.. ప‌రుగు ప‌రుగున టైగ‌ర్ ష్రాఫ్ ఇంట్లోకి.. టెన్షన్!
ఫొటోగ్రాఫ‌ర్ల‌నూ ప‌ట్టించుకోని దిశా ప‌టానీ.. ప‌రుగు ప‌రుగున టైగ‌ర్ ష్రాఫ్ ఇంట్లోకి.. టెన్షన్!

దిశా పటానీ టెన్షన్

టైగర్‌ ష్రాఫ్ పై దాడి జరిగిందన్న షాకింగ్ న్యూస్ వినగానే దిశా పటానీ తన పనులన్నీ పక్కనబెట్టి టైగర్ నివాసానికి హుటాహుటిన చేరుకుంది. కారు దిగే సమయంలో ఆమె ముఖంలో భయం, కంగారు స్పష్టంగా కనిపించాయి. అక్కడ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం వేచి ఉన్న పాపరాజీలను (మీడియా ఫోటోగ్రాఫర్స్) సైతం ఆమె పట్టించుకోలేదు.

కారు దిగిన వెంటనే నేరుగా టైగర్ ఇంటి లోపలికి దిశా పటానీ పరుగెత్తింది. ఈ కష్ట సమయంలో టైగర్ పక్కన ఉండి ధైర్యం చెప్పేందుకు ఆమె వచ్చిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆరేళ్ల బంధం

టైగర్, దిశా పటానీ దాదాపు ఆరేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. 'బాఘీ 2' సినిమా, 'బేఫిక్రా' మ్యూజిక్ వీడియోలలో వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే జూలై 2022లో వీరిద్దరూ విడిపోయినట్లు ప్రచారం జరిగింది. విడిపోయినప్పటికీ వీరిద్దరి మధ్య ఇప్పటికీ మంచి స్నేహం ఉందని తాజా సంఘటన నిరూపించింది. టైగర్ ఆపదలో ఉన్నాడని తెలియగానే దిశా పరిగెత్తుకు రావడం వీరి బంధం ఎంత బలమైనదో చూపిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

అసలు ఏం జరిగిందంటే?

ఆదివారం జుహులోని పుష్ప పార్క్‌లో ఉన్న ఒక క్లబ్‌లో ఫుట్‌బాల్ ఆడి టైగర్ ష్రాఫ్ తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగింది. బైక్‌పై వచ్చిన ముగ్గురు దుండగులు ఆయన కారును లక్ష్యంగా చేసుకుని దాదాపు ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో టైగర్ డ్రైవర్‌తో పాటు ఒక ఆటోరిక్షా డ్రైవర్ గాయపడ్డారు. డ్రైవర్‌కు బుల్లెట్ గాయం కావడంతో, టైగర్ స్వయంగా స్టీరింగ్ చేతిలోకి తీసుకుని కారును నడిపారు.

టైగర్ ఆరోగ్యం సురక్షితం

ఈ దాడిలో టైగర్ ష్రాఫ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను ముంబైలోని నానావతి హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. "టైగర్ డ్రైవర్ ఎడమ చేతికి బుల్లెట్ గాయమైంది, సర్జరీ అవసరం కావచ్చు. టైగర్‌కు మాత్రం చిన్న చిన్న గీతలు పడ్డాయి. పరీక్షల అనంతరం ఆయనను డిశ్చార్జ్ చేశాం" అని హాస్పిటల్ వర్గాలు తెలిపాయి. కాగా, ఈ ఘటన తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, ఉప ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే వెంటనే టైగర్ నివాసానికి చేరుకుని పరామర్శించారు.

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హెచ్చరిక

ఈ కాల్పుల ఘటన జరిగిన కొద్దిసేపటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన అనిల్ పండిట్, హర్మాన్ సంధు సోషల్ మీడియా వేదికగా ఈ దాడికి బాధ్యత వహించారు. "ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీలో మా మాట వినని వారు, అలాగే సల్మాన్ ఖాన్‌తో కలిసి పనిచేసే వారు మా టార్గెట్ అవుతారు. టైగర్ ష్రాఫ్‌కు ముందే చెప్పాం, వినలేదు కాబట్టే ఈరోజు గట్టిగా బుద్ధి చెప్పాం. ఇక ముందు ఏం జరుగుతుందో చూడండి" అంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More