...
...
Next Story

Heroine Bikini: వేలంలో బికినీ కొని.. ఇంటికి వచ్చి.. రక్తంతో ప్రేమ లేఖలు రాసి.. స్టార్ హీరోయిన్‌కు అభిమాని వేధింపులు

Heroine Bikini: తన గ్లామర్, బోల్డ్ నటనతో కుర్రకారును ఉర్రూతలూగించిన బాలీవుడ్ నటి పూజా బేడీ జీవితంలో జరిగిన ఒక వింత, షాకింగ్ సంఘటన మళ్లీ చర్చనీయాంశమైంది. ఓ వీరాభిమాని వల్ల తాను ఎదుర్కొన్న సమస్యల గురించి ఆమె కపిల్ శర్మ షోలో వివరించారు. ఈ ఘటన 1993లో ఆమె నటించిన 'లూటేరే' మూవీ రిలీజ్ తర్వాత జరిగింది.

Published on: Nov 24, 2026, 09:41:02 IST
Advertisement

Heroine Bikini: సినీ తారల పట్ల అభిమానులకు ఉండే పిచ్చి ఒక్కోసారి హద్దులు దాటుతుంటుంది. 1990వ దశకంలో బాలీవుడ్‌లో తన బోల్డ్ అందాలతో, గ్లామర్‌తో కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ప్రముఖ నటి పూజా బేడీ (Pooja Bedi) విషయంలోనూ సరిగ్గా ఇలాంటి ఒక వింత, భయానక సంఘటన జరిగింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా బేడీ
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా బేడీ

1993లో ఆమె నటించిన 'లూటేరే' (Lootere) సినిమాలో ధరించిన బికినీని వేలం వేయగా, దానిని దక్కించుకున్న ఒక వీరాభిమాని చేసిన పనులు పూజా బేడీని తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. గతంలో 'ది కపిల్ శర్మ షో' వేదికగా పూజా బేడీ స్వయంగా ఈ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు.

రూ.1,500లకు అమ్ముడుపోయిన పూజా బేడీ బికినీ

1993 మే నెలలో ముంబైలోని క్రాస్‌వర్డ్ వేదికగా 'ఫరెవర్ యువర్స్' (Forever Yours) పేరుతో సినీ తారలు ధరించిన దుస్తులు, వస్తువుల ప్రత్యేక వేలం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ నటి అర్చనా పూరన్ సింగ్ ఈ వేలానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు.

ఆ సమయంలో 'లూటేరే' సినిమాలో పూజా బేడీ ధరించిన బికినీని వేలానికి ఉంచగా, అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి రూ.1,500లకు పాట పాడి దానిని సొంతం చేసుకున్నాడు. అప్పట్లో రూ.1,500 అంటే పెద్ద మొత్తమే. అయితే ఆ అభిమాని కేవలం బికినీ కొనడంతోనే ఆగిపోకుండా, పూజా బేడీని విపరీతంగా వేధించడం మొదలుపెట్టాడు.

రక్తంతో ప్రేమలేఖలు.. వేలంలో కొన్న బికినీతో ఇంటికే!

ఆ వ్యక్తి తనను ఎలా ఇబ్బంది పెట్టాడో పూజా బేడీ వివరిస్తూ.. “ఆ అభిమాని నాకు ఇష్టమైన 'అనైస్-అనైస్' (Anais-Anais) అనే పెర్ఫ్యూమ్ పేరును తన పేరుగా మార్చుకున్నాడు. పదేపదే నాకు ఫోన్లు చేస్తూ, తన రక్తంతో రాసిన ప్రేమలేఖలను ఇంటికి పంపేవాడు” అని తెలిపారు.

మూడున్నరేళ్ల ప్రేమ తర్వాత ఫర్హాన్ ఫర్నిచర్‌వాలాను పెళ్లి చేసుకున్న పూజా బేడీకి అలయా ఎఫ్ (Alaya F), ఒమర్ ఫర్నిచర్‌వాలా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అలయా ప్రస్తుతం బాలీవుడ్ లో హీరోయిన్ గా ఉన్న విషయం తెలిసిందే. 12 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత 2003లో వీరు విడాకులు తీసుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, పూజా బేడీ చివరిసారిగా జీ5 (ZEE5) ఓటీటీలో విడుదలైన 'కామెడీ కపుల్' (Comedy Couple) చిత్రంలో తల్లి పాత్రలో నటించి మెప్పించారు.

 

ABOUT THE AUTHOR

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks