Brahmamudi April 24th Episode: బ్రహ్మముడి.. రేఖకు దిమ్మదిరిగే షాకిచ్చిన చక్రి.. రాజు ఇంట్లోనే సెటిలైపోనున్న ఇందు
Brahmamudi April 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో రాజు ఇంట్లో ఇందు సందడి మామూలుగా ఉండదు. రాజు అమ్మానాన్న పెళ్లి రోజును సెల్రబేట్ చేస్తుంది. ఇటు రేఖ, భూషణ్ లకు చక్రి దిమ్మదిరిగే షాకిస్తాడు.
Brahmamudi April 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఊహించని షాక్ తగులుతుంది. తీసుకున్న బంగారానికి డబ్బులు ఇవ్వనని చక్రి తేల్చి చెబుతాడు. దీంతో అటు ఇందు పర్మనెంట్ గా రాజు ఇంట్లోనే సెటిలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

బీరు తాగి రోడ్డుపై ఇందు హంగామా
బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 24) ఎపిసోడ్ బీరు తాగి రోడ్డుపై ఇందు చేసే హంగామాతో మొదలవుతుంది. ఆమెను కంట్రోల్ చేయడానికి రాజు నానా తంటాలు పడతాడు. తన జీవితంలో లేని స్వేచ్ఛను తొలిసారి అనుభవించిన ఇందు.. దానిని బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆమెను చూసి రాజు షాక్ తింటాడు. ఇద్దరూ ఆ తర్వాత ఓ పార్కులోకి వెళ్లి కింద కూర్చొంటారు.
ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న రాజు, ఇందు
మెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. రాజు తన ఫ్యామిలీ గురించి చెబుతాడు. కిడ్నాప్ కాకుండా ఇంకేం చేస్తావని అడిగితే.. ఏం చేయాలా అని ఆలోచిస్తాను.. ఈ రోజుల్లో చదివితే ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి అని అంటాడు. అటు ఇందు మాత్రం అసలు తాను చదువుకోవడానికి బయటకే వెళ్లలేదని, తన నాన్నమ్మే ఇంట్లో అన్నీ నేర్పించిందని చెబుతుంది.
ఇందు కోసం పాట పాడిన రాజు
ఆ తర్వాత తనకు నిద్ర వస్తోందని, ఓ పాట పాడమని ఇందు అంటుంది. మొదట్లో ఒఫ్పుకోని రాజు తర్వాత వెన్నెల అంటూ పాట పాడతాడు. ఇందు మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. రాజు ఒడిలోనే ఆమె నిద్రపోతుంది. ఇద్దరూ అలా పార్కులోనే ఆ రాత్రంతా గడిపేస్తారు.
రేఖకు షాకిచ్చిన చక్రి
మరోవైపు తన దగ్గర తీసుకున్న బంగారానికి డబ్బులు అడగటానికి చక్రి దగ్గరికి వెళ్తారు రేఖ, భూషణ్. కానీ అతడు ఎక్కడి డబ్బు అంటూ షాక్ ఇస్తాడు. నేను డబ్బిస్తానంటే ఎలా నమ్మారు.. అది మీ పాత బాకీ కింద జమ చేసుకున్నాను.. ఇన్నాళ్లూ నా దగ్గర డబ్బు అవసరం అయినప్పుడల్లా నా ఇంటికి వచ్చి బతిమాలారు.. ఆ తర్వాత మీ చుట్టూ తిప్పించుకున్నారు.. మరో వారం గడువు ఇస్తున్నాను.. మిగిలిన మొత్తం అప్పు కూడా తీర్చాల్సిందేనని రేఖ, భూషణ్ లకు చక్రి స్పష్టం చేస్తాడు. ఆ రూ.కోటి కిడ్నాపర్లకు ఇస్తేనే ఇందు వస్తుందని, ఆ తర్వాతే ఆస్తి తమ పేరిట అవుతుందని రేఖ చెప్పినా వినడు. దీంతో చేసేది లేక ఇద్దరూ వెనక్కి వెళ్లిపోతారు.
రాజు ఇంటికి ఇందు.. ఈవెంట్ ప్లానర్‌గా అమ్మానాన్నల పెళ్లి రోజు
అటు ఉదయాన్నే రాజుకి ఫోన్ చేస్తాడు వెంకీ. ఈరోజు అమ్మానాన్నల పెళ్లి రోజు అని అంటాడు. అర్థమైంది.. చికెన్ కావాలి అంతే కదా.. తెస్తాను అని పెట్టేస్తాడు. సింపుల్ గా చికెన్ తో సరిపెట్టేస్తావా.. అమ్మానాన్నల పెళ్లి రోజును డెకరేషన్ చేసి గ్రాండ్ గా చేయవా అని ఇందు అంటుంది. అంత సీన్ లేదని రాజు అంటాడు. తనను ఇంటికి తీసుకెళ్తే చేస్తానని ఇందు చెబుతుంది. డబ్బులు లేవని అనడంతో జీరో బడ్జెట్ తో తాను చేస్తానని హామీ ఇస్తుంది.
ఆ తర్వాత ఇందు.. రాజు ఇంటికి వెళ్తుంది. అక్కడ పరిస్థితి చూసి షాక్ తింటుంది. ఇందుని చూసి వాళ్లు కూడా షాక్ తింటారు. అయితే తాను చెప్పినట్లే రాజు అమ్మానాన్నల పెళ్లిరోజును తక్కువ బడ్జెట్ లో చాలా గ్రాండ్ గా చేస్తుంది ఇందు. దీంతో అందరూ చాలా సంతోషిస్తారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


