Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి.. ఇందు ప్రేమలో పడిన రాజు.. బైకుపై షికార్లు, దొంగతనం.. వెంకీ ఇంటికి నందు

Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 22 ఎపిసోడ్ లో మెల్లగా ఇందులో ప్రేమలో పడిపోతుంటాడు రాజు. ఆమెను బైకుపై షికారుకు తీసుకెళ్లడమే కాదు.. దొంగతనానికీ రెడీ అవుతాడు. కిడ్నాప్ కథ కాస్తా ప్రేమ కథగా మారేలా కనిపిస్తోంది.

Published on: Apr 22, 2026, 08:33:29 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన తనకు నచ్చిన పనులు చేయించుకుంటుంది ఇందు. అంతేకాదు అతన్ని హగ్ కూడా చేసుకుంటుంది. దీంతో రాజు కూడా మెల్లగా ఇందు ప్రేమలో పడిపోతుంటాడు. అటు వెంకీ మరో ప్రేమ కోసం నందుని వాడుకోవాలని డిసైడవుతాడు.

Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి.. ఇందు ప్రేమలో పడిన రాజు.. బైకుపై షికార్లు, దొంగతనం.. వెంకీ ఇంటికి నందు
Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి.. ఇందు ప్రేమలో పడిన రాజు.. బైకుపై షికార్లు, దొంగతనం.. వెంకీ ఇంటికి నందు

ఓనర్‌ను బోల్తా కొట్టించిన లక్కీ, రాజు.. లాగి పెట్టి కొట్టిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) ఎపిసోడ్ ఇంటి ఓనర్ ను రాజు, ఇందు, లక్కీ బోల్తా కొట్టించే సీన్ తో మొదలువుతుంది. ఇందుని చూసి ఆమె ఎవరు అని అడుగుతాడు ఓనర్. కానీ అక్కడ అమ్మాయి లేదని, అది తానే అని లక్కీ అంటాడు. బాగా తాగి ఉండటంతో ఓనర్ కళ్లు మసకగా మారతాయి. ఇంతకుముందు ఎవరితో మాట్లాడారు అని అడిగితే తన భార్యతో అని అతడు అంటాడు.

అందుకే అలా కనిపిస్తున్నానని లక్కీ అంటాడు. నా భార్య చెండాలంగా ఉంటుంది.. కానీ ఈ అమ్మాయి కత్తిలా ఉంది అని ఓనర్ అంటాడు. దీంతో ఇందు అతన్ని లాగిపెట్టి కొడుతుంది. అతడు కింద పడతాడు. ఆలోపు ఇందు బయటకు వెళ్లిపోగా.. లక్కీ చీర కట్టుకొని వస్తాడు. అలా ముగ్గురూ కలిసి ఓనర్ ను బోల్తా కొట్టిస్తారు.

ఇందుకి గోలీ సోడా తెచ్చిన రాజు

ఇటు ఇందు తనకు గోలీ సోడా తెచ్చావా అని రాజుని అడుగుతుంది. తీసుకురాలేదని అతడు అనడంతో నానా మాటలు అంటుంది. తనతో వంట చేయించుకొని మోసం చేస్తావా అని తిడుతుంది. ఇంతలో తన వెనుక నుంచి రెండు గోలీ సోడాలు తీసి ఇందు చేతుల్లో పెడతాడు రాజు.

అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. గోలీ కొట్టి సోడా తాగుతుంది. అది తాగుతూ ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది. అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. నీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉంది.. నువ్వేంటి ఇలా ఉన్నావు.. అసలు నీ స్టోరీ ఏంటని అడుగుతాడు. గోలీ సోడా ఇచ్చి స్టోరీ తెలుసుకుందామని అనుకుంటున్నావా అస్సలు చెప్పను అని ఇందు అంటుంది.

బయటకు తీసుకెళ్లాలని రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన ఇందు

సరే కానీ.. నాకో సాయం చేయాలి.. పొద్దున కూడా ఆ డల్లాస్ గాడికి బ్రేక్ ఫాస్ట్ చేయాలని ఇందుని రాజు అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోని ఇందు.. తర్వాత సరే అంటుంది. అయితే తనను బయటకు తీసుకెళ్లాలని అడుగుతుంది. రాజు ఒప్పుకోడు. దీంతో అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓనర్ కు చెప్పేస్తా అంటూ అరుస్తుంది. దీంతో రాజు ఆమె నోటిని మూస్తూ.. సరే తీసుకెళ్తాను అరవకు అని అంటాడు.

వెంకీ కోసం రాజు ఇంటికి నందు

మరోవైపు వెంకీని వెతుకుతూ రాజు ఇంటికి వస్తుంది నందు. ఆమెను చూసి చలపతి, లక్ష్మీ షాకవుతారు. వెంకీ ఉన్నాడా.. మొన్న నన్ను కలిసినప్పుడు మొబైల్ వదిలేసి వెళ్లాడు అని అంటుంది. పైన ఉన్నాడని చెప్పడంతో మొబైల్ ఇచ్చి అతన్ని కలవడానికి వెళ్తుంది నందు. ఆమె వెళ్లగానే వెంకీతో ఏమైనా ప్రేమలో ఉందా అని మాట్లాడుకుంటారు. ఆమె తిరిగి వచ్చి తాను కేవలం ఫ్రెండ్ అని, అంత సీన్ లేదని అంటుంది. తర్వాత వెంకీ దగ్గరికి వెళ్తే అతడు మేడ మీద దేవదాసు టైపులో బాధతో కూర్చొంటాడు. రోజా హ్యాండివ్వడంతో ఇక కొత్త ప్రేమ కోసం చూస్తున్నానని, సాయం కావాలని అడుగుతాడు. నీ ప్రేమ నా చావుకు వచ్చింది అని నందు అనుకుంటుంది.

రాజును హగ్ చేసుకున్న ఇందు

ఇటు ఇందుని బైకుపై బయటకు తీసుకెళ్తాడు రాజు. రోడ్డుపై ఐస్ క్రీమ్ చూసి తనకు కావాలని అంటుంది. సరే అని రాజు కొనడానికి వెళ్తుంటే దొంగతనం చేయాలని ఉందని ఇందు అంటుంది. రాజు వద్దని వారిస్తున్నా ఆమె వినదు. ఐస్ క్రీమ్ తోపాటు బెలూన్లు కూడా ఆమె దొంగతనం చేస్తుంది.

తొలిసారి తనకు దొరికిన ఈ స్వేచ్ఛను ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకు ఈ ఫ్రీడమ్ వచ్చేందుకు కారణమైన రాజుని ఆమె హగ్ చేసుకుంటుంది. దీంతో అతడు మొదట షాక్ తింటాడు. ఆ తర్వాత తాను కూడా ఆమె ప్రేమలో పడుతున్నట్లుగా మెల్లగా ఇందుని హగ్ చేసుకుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More