Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి.. రాజు కిడ్నాప్ చేశాడని తెలుసుకున్న ఇందు.. సొంతింటికి నందు..రేఖకు తెలిసిన నిజం
Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 13 ఎపిసోడ్ లో తనను కిడ్నాప్ చేసింది రాజు అని ఇందు తెలుసుకుంటుంది. అటు ఆమెను వెతుక్కుంటూ సొంతింటికి నందు తిరిగి వస్తుంది. దీంతో రేఖలో టెన్షన్ మొదలవుతుంది.
Brahmamudi April 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో తనను కిడ్నాప్ చేసింది తాను సెట్ చేసిన వాళ్లు కాదని, రాజు, లక్కీ అని ఇందు తెలుసుకుంటుంది. ఇటు ఇందు కిడ్నాప్ విషయం తెలుసుకున్న నందు.. ఆమెను కనిపెట్టే పని మొదలుపెడుతుంది. ఇందులో భాగంగా తన సొంతింటికి తిరిగి వస్తుంది.

ఇందు కిడ్నాప్‌పై పోలీసుల విచారణ
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (ఏప్రిల్ 13) ఎపిసోడ్ ఇందు కిడ్నాప్ గురించి పోలీసులు విచారించే సీన్ తో మొదలవుతుంది. ఇందుని ఎవరో తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేసి ఉంటాడని ఎస్సై అనుమానిస్తాడు. దీంతో ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. ఫామ్ హౌజ్ లో బర్త్ డే జరుపుతున్నామని కేవలం 24 గంటల ముందే డిసైడైనా ఆ విషయం కిడ్నాపర్లకు ఎలా తెలిసిందని ఎస్సై అడుగుతాడు. దీంతో రేఖలోనూ అనుమానం మొదలవుతుంది.
అఫీషియల్ గా కంప్లైంట్ ఇస్తే తాము విచారణ చేపడతామని అంటాడు. కానీ రేఖ మాత్రం అందుకు ఒప్పుకోదు. అలా చేస్తే తమ కంపెనీకి నష్టం వస్తుందని అంటుంది. అనధికారికంగానే ఇందును వెతికే పని మొదలుపెట్టాలని పోలీసులకు చెప్పడంతో వాళ్లు సరే అంటారు. అక్కడే నందు బాబాయి కూడా ఉండటంతో ఇందు కిడ్నాప్ గురించి తెలుసుకుంటాడు.
రాజు, లక్కీలకు షాకిచ్చిన ఇందు.. కిడ్నాప్ ప్లాన్ తనదేనంటూ..
ఇటు రాజు తనకు రూ.కోటి రాబోతున్నాయంటూ ఎంతో ఆనందంగా ఉంటాడు. ఇంతలో తండ్రి ఫోన్ చేసి ఎందుకు ఇంటికి రావడం లేదని అడిగితే సాహు బిజినెస్ పని మీద ఉన్నానని చెబుతాడు. అతడు ఇంటికి వచ్చాడా అని అడుగుతాడు.
మరోవైపు లక్కీ కంగారుగా వచ్చి ఇందు కనిపించడం లేదని చెప్పడంతో ఇద్దరూ వెళ్లి చూస్తే కట్లు విప్పి ఉంటాయి. ఆమె తప్పించుకుందని అనుకుంటుండగానే బాత్రూమ్ లో నుంచి బయటకు వస్తుంది. దీంతో ఇద్దరూ మాస్కులు వేసుకుంటారు. తాను చెప్పినట్లే కిడ్నాప్ చాలా బాగా చేశారని ఇందు అనడంతో వాళ్లు కంగారు పడతారు. కిడ్నాప్ ప్లాన్ తనదే అని ఆమె అంటుంది.
కిడ్నాప్ చేసింది బంటీ, బబ్లూ కాదని తెలుసుకున్న ఇందు
దీంతో రాజు, లక్కీ.. కిడ్నాప్ చేసింది తామని, డబ్బు కోసం ఇలా చేశామని అంటారు. కానీ ఇందు నమ్మదు. మీకు కావాల్సిన డబ్బు మీకు వచ్చే ఉంటుంది కదా.. ఇక నేను వెళ్తానని అంటుండగా రాజు ఆమెను అడ్డుకొని మళ్లీ కట్టేస్తాడు. దీంతో తనను కిడ్నాప్ చేసింది బంటీ, బబ్లూ కాదని ఇందు తెలుసుకుంటుంది. అయితే వాళ్లు ఎవరో తెలియక కంగారు పడుతుంది.
ఇందు కిడ్నాప్ గురించి నందుకి చెప్పిన బాబాయ్
ఇటు నందు బాబాయ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇందు కిడ్నాప్ గురించి ఆమెతో చెబుతాడు. దీంతో నందు ఆందోళన చెందుతుంది. అక్కతో ఉదయమే మాట్లాడాను కదా.. ఎవరు కిడ్నాప్ చేశారని అడుగుతుంది. వాళ్లు అఫీషియల్ గా కంప్లైంట్ ఇవ్వడం లేదని, అందుకే ఎస్సై అనధికారికంగా ఆ కేసు విచారణ చేస్తున్నారని అంటాడు. తాను కనిపెడతానని, ఎస్సై దగ్గర అనుమతి తీసుకోమని బాబాయ్ తో చెబుతుంది. అతడు సరే అంటూ ఎస్సైకి ఫోన్ చేస్తాడు.
ఇందు కిడ్నాప్ అపర్ణ, సుభాష్ ప్లాన్ అంటూ..
మరోవైపు ఇంట్లో బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియోను రేఖ చూస్తూ ఉంటుంది. అందులో ఆమెకు ఓ క్లూ దొరుకుతుంది. అసలు ఇందు కిడ్నాప్ అపర్ణ, సుభాష్ కలిసి కావాలనే చేశారని అనుమానిస్తుంది. వాళ్లను తీసుకురావాలని భూషణ్ కు చెబుతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక అపర్ణ, సుభాష్ కంగారు పడతారు. ఇందును తాము కిడ్నాప్ చేయించడమేంటని వాళ్లు అంటారు. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది. ఆ విషయం తాను చెబుతానని అనడంతో రేఖ షాక్ తింటుంది.
అటు ఇందుకి రాజు, లక్కీ భోజనం పెడతారు. ఆ సాకుతూ చేతులకు కట్లు విప్పడంతో ఆమె లక్కీ మాస్క్ తొలగించి అతన్ని చూస్తుంది. కిడ్నాప్ చేసింది రాజు, లక్కీ అని తెలుసుకుంటుంది. తాము డబ్బు కోసమే చేశామని, అది రాగానే వదిలేస్తామని అంటారు. తనను ఎవరు కిడ్నాప్ చేయించి ఉంటారని ఇందులో ఆలోచనలో పడుతుంది. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


