Brahmamudi April 9th Episode: బ్రహ్మముడి.. ఆస్తి పత్రాలపై ఇందు వేలి ముద్ర.. కిడ్నాప్ ప్లాన్ ఫెయిల్.. రంగంలోకి మీడియా
Brahmamudi April 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 9 ఎపిసోడ్ లో ఇందు బర్త్ డే కిడ్నాప్ చుట్టూ ఎంతో డ్రామా నడిచినా.. చివరికి ఆమె ఆస్తి పత్రాలపై వేలి ముద్ర వేసే సమయం వచ్చేస్తుంది. ఆమె కిడ్నాప్ ప్లాన్ ఫెయిలైనట్లు ఈ ఎపిసోడ్ చూస్తే అర్థమవుతోంది.
Brahmamudi April 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇటు ఇందు, అటు ఐశ్వర్య వేసిన కిడ్నాప్ ప్లాన్స్ పెద్దగా వర్కౌట్ అయినట్లు కనిపించదు. దీంతో ఆస్తి పత్రాలపై ఇందు వేలి ముద్ర వేయడానికి సిద్ధమవుతుంది. అయితే చివర్లో మీడియా రంగంలోకి దిగడమే కాస్త ట్విస్ట్ అని చెప్పొచ్చు.

రాజును గుర్తు పట్టి మాస్క్ తీయమన్న అపర్ణ
బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఏప్రిల్ 9) ఎపిసోడ్ రాజును అపర్ణ చూసే సీన్ తో మొదలవుతుంది. ఇందును ఎలా కిడ్నాప్ చేయాలా అని లక్కీతో రాజు ప్లాన్ చేస్తుండగా అనుకోకుండా అపర్ణ వచ్చి అతన్ని ఢీకొడుతుంది. అప్పుడే అతడు మాస్క్ వేసుకోవడంతో అతన్ని సరిగా చూడదు.
కానీ అతని కళ్లు చూస్తుంటే ఎవరో తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నారని, ఒకసారి మాస్కు తీయాలని అతన్ని అడుగుతుంది. దీంతో రాజు షాక్ తింటాడు. ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో.. నేను ఆ వ్యక్తిని కాను అని రాజు కవర్ చేసుకుంటాడు. అప్పుడే ఫోన్ రావడంతో రాజు అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
అక్కని హగ్ చేసుకున్న నందు.. పారిపోయిన చెల్లి గురించి చెప్పి..
మరోవైపు అక్క ఇందుని నందు హగ్ చేసుకుంటుంది. ఆమెను చూసి ఇందు ఆశ్చర్యపోతుంది. మీరేంటి ఇక్కడా అని అడుగుతుంది. మిమ్మల్ని చూస్తే తన చెల్లి గుర్తుకు వస్తోందని అంటుంది. అది విని నందు ఎమోషనల్ అవుతుంది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది అని అడిగితే.. చిన్నప్పుడే పారిపోయింది.. కానీ నేనంటే ఆమెకు చాలా ప్రేమ.. నీలాగే మాట కటువుగా ఉన్నా లోపల ఎంతో ప్రేమ ఉంటుంది.. అని అంటుంది.
అది విని నందు మరింత బాధపడుతుంది. అయితే నన్ను చాలా మిస్ అవుతున్నావన్న మాట అని అనడంతో ఇందు షాక్ తింటుంది. అదే తనని మిస్ అవుతున్నావన్నావా అని నందు కవర్ చేసుకుంటుంది. సరే ఈ దేవుడిచ్చిన చెల్లిని మరచిపోకు.. నీ చెల్లిని నాలో చూసుకో అని చెబుతుంది. తాను ఇక్కడికి పూల డెకరేషన్ చేయడానికి వచ్చినట్లు చెప్పి వెళ్లిపోతుంది.
రాజు, లక్కీలను చూసిన ఇందు
ఇటు కిడ్నాప్ కోసం ప్లాన్ చేస్తున్న రాజు, లక్కీలను ఇందు చూస్తుంది. కిడ్నాప్ కోసం లక్కీ ఏదో డివైజ్ తీసుకొని కిచెన్ లో పెడతాడు. దానిని చెక్ చేస్తుండగా ఇందు వస్తుంది. ఇద్దరికీ మాస్కులు ఉండటంతో అనుమానంగా చూస్తుంది. వాళ్ల మాటలు విని మీ గొంతు ఎక్కడో విన్నట్లుందే అని అంటుంది. తాము ఏ ఫంక్షన్ జరిగినా కేటరింగ్ చేస్తామని, ఎక్కడో వినే ఉంటారని రాజు, లక్కీ కవర్ చేసుకుంటారు. తర్వాత ఇందు వెళ్లిపోతుంది. ఎప్పుడూ నీతోనే గొడవ పడుతోందేంటిరా అని రాజుతో అంటాడు లక్కీ.
కూల్ డ్రింక్స్‌లో మత్తు మందు కలిపిన బంటీ, బబ్లీ
మరోవైపు తన కిడ్నాప్ కోసం ఇందునే ఏర్పాటు చేసిన బంటీ, బబ్లీ కూల్ డ్రింక్స్ లో మత్తు మందు కలుపుతుంటారు. అప్పుడే అక్కడికి ఇందు వస్తుంది. రెడీగా ఉన్నారా అని అడిగితే.. ఈ డ్రింక్స్ అందుకోసమే అంటూ అందులో మత్తు మందు ఉన్న విషయం చెబుతారు. వీటిని అందరికీ ఇస్తే మూడు గంటల వరకూ లేవరని, ఆ తర్వాత మిమ్మల్ని కిడ్నాప్ చేస్తామని అంటారు.
సంతకం పెట్టబోనని ఐశ్వర్యతో అన్న ఇందు
అప్పుడే ఐశ్వర్య అక్కడికి వస్తుంది. ఆమె తమ మాటలు వినేసిందా అని ఇందు టెన్షన్ పడుతుండగా.. సంతకం పెట్టడానికి రెడీగా ఉన్నావా అని ఐశ్వర్య అడుగుతుంది. ఇందు మాత్రం తాను సంతకం పెట్టనని నమ్మకంగా మాట్లాడుతుంది. అంతా అయిపోయాక ఇంకేం చేస్తావని ఆమె అంటే.. నేను సిద్ధంగా ఉన్నా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు కదా అని ఇందు అంటుంది. సరే అదీ చూద్దామని ఐశ్వర్య వెళ్లిపోతుంది.
రంగంలోకి మీడియా
మరోవైపు ఇందుతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటుందంటూ తమకు సమాచారం అందిందని ఓ మీడియా వ్యక్తి రేఖకు ఫోన్ చేసి చెబుతాడు. తాము అక్కడికి వస్తున్నామని అంటాడు. అది ఇందు, అపర్ణలే చేసి ఉంటారని రేఖ వాళ్లను మరోసారి బెదిరిస్తుంది. దీంతో తాను సంతకం పెట్టడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నానని ఇందు అంటుంది. అప్పుడే ఆస్తి పత్రాలు తీసుకొచ్చి ఆమెతో వేలిముద్ర వేయించడానికి రేఖ చూస్తుంది. ఆమెను కిడ్నాప్ చేసే ప్రయత్నాలు సక్సెస్ కావు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


