Sign in

Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. రాజును గుర్తు పట్టిన అపర్ణ.. ఇందుకి నందు హగ్.. భ్రమరాంబను చితకబాది..

Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 8) ఎపిసోడ్ లో రాజును అపర్ణ చూసేస్తుంది. అటు ఇందుని నందు అక్క అంటూ హగ్ చేసుకుంటుంది. ఇందు బర్త్‌డే రోజే కిడ్నాప్ ప్లాన్ రక్తి కడుతుంది.

Published on: Apr 8, 2026, 08:29:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో మళ్లీ దుగ్గిరాల ఫ్యామిలీలో మిగిలిన వాళ్లందరూ ఒకే చోట కలుస్తారు. అటు ఇందును కిడ్నాప్ చేయడానికి వచ్చిన రాజును అపర్ణ చూస్తుంది. ఇటు అది తన ఫ్యామిలీ అని తెలుసుకున్న నందు.. ఇందుని ప్రేమగా అక్క అని పిలుస్తూ హగ్ చేసుకుంటుంది.

Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. రాజును గుర్తు పట్టిన అపర్ణ.. ఇందుకి నందు హగ్.. భ్రమరాంబను చితకబాది..
Brahmamudi April 8th Episode: బ్రహ్మముడి.. రాజును గుర్తు పట్టిన అపర్ణ.. ఇందుకి నందు హగ్.. భ్రమరాంబను చితకబాది..

ఫామ్‌హౌజ్‌లో ఇందు కిడ్నాప్‌కు రాజు రెడీ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 8) ఎపిసోడ్ ఫామ్ హౌజ్ లో ఇందుని కిడ్నాప్ చేయడానికి రాజు, లక్కీ రెడీ కావడం చూడొచ్చు. కేటరింగ్ వాళ్ల ముసుగులో మాస్కులు వేసుకొని వాళ్లు వస్తారు. తాను చెప్పినప్పుడు లోనికి రావాలని ఐశ్వర్య వాళ్లతో చెబుతుంది. వాళ్లు సరే అంటాడు. మాస్కులు వేసుకొని వాళ్లు మెల్లగా లోని వస్తారు.

పూలు తీసుకొచ్చిన నందు.. చూసి భయపడిన రాజు, లక్కీ

అటు ఇందు బర్త్ డే కోసం డెకరేషన్ జరుగుతుంటుంది. అయితే పూలు ఇంకా రాలేదని వాళ్లు చెప్పడంతో భ్రమరాంబ వాళ్లపై కోప్పడుతుంది. వెంటనే ఫోన్ చేయడమంటుంది. ఆ పూలు తెచ్చింది నందుయే కావడం విశేషం. బయట తన బాబాయ్ తో కలిసి నందు పూలు తీసుకొస్తుంది. ఆమెను రాజు, లక్కీ చూస్తారు. డ్రగ్స్ మన దగ్గర ఉన్నప్పుడు వెంటపడింది ఆమెనే కదా.. ఇక్కడికి వచ్చిందేంటి అని అనుకుంటారు. ఇప్పుడు కిడ్నాప్ చేయడానికి వచ్చామని తెలిస్తే రెండు కేసులు వేస్తుందని భయపడతారు.

అపర్ణను చూసిన నందు.. ఇందు తన అక్క అని తెలుసుకొని..

అప్పుడే ఇందు చాలా గ్రాండ్‌గా రెడీ అయి ఫామ్ హౌజ్ కి వస్తుంది. ఆమెను చూసిన అపర్ణ కోపంతో ఊగిపోతుంది. అప్పుడే అపర్ణను దూరం నుంచి నందు చూసి నాన్నమ్మ అని అంటుంది. అక్క ఎలా రెడీ అయింది అని అపర్ణను స్వాతి అడుగుతుంది. అది విని ఇందు తన అక్క అని తెలుసుకుంటుంది నందు. అప్పుడే తన గతం కళ్ల ముందు కదలాడుతుంది. ఇన్ని రోజులుగా తాను తన అక్క వెంటే తిరుగుతున్నానా అని అనుకుంటుంది.

నిజం చెప్పని నందు

వాళ్లే తన కుటుంబం అని ఇన్నాళ్లూ తనను పెంచిన బాబాయికి నందు చెబుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. వాళ్లను కలిసి అసలు నిజం చెప్పు అని అతడు అంటాడు. కానీ తాను నందుని అని వాళ్లతో చెప్పడానికి మాత్రం ఆమె ఇష్టపడదు. ఇప్పుడే తాను నిజం చెప్పనని తన బాబాయితో అంటుంది. ఆ రేఖ ఎలాంటిదో అతనికి చెబుతుంది. సమయం చూసుకొని తానే నిజం చెబుతానంటుంది.

కిడ్నాప్‌కు రెడీ అయిపోయిన ఇందు

మరోవైపు ఇందు కిడ్నాప్ కు రెడీ అయిపోతుంది. ఆమెను కిడ్నాప్ చేయడానికి స్వాతి ఇద్దరు వ్యక్తులను రెడీ చేస్తుంది. వాళ్లకు ఫోన్ చేస్తుంది. వాళ్లు కూడా రాజు, లక్కీలాగే కేటరర్ల రూపంలో కనిపిస్తారు. తాము ఫామ్ హౌజ్ లోనే ఉన్నామని, సమయానికి ఇందుని కిడ్నాప్ చేస్తామని హామీ ఇస్తారు. దీంతో ఇందు, స్వాతి ఊపిరి పీల్చుకుంటారు.

ఒకరికొకరు ఎదురుపడిన కిడ్నాపర్లు

అదే సమయంలో కేటరర్ల రూపంలో ఉన్న నలుగురు కిడ్నాపర్లు ఒకరికొకరు ఎదురుపడతారు. రాజు, లక్కీ వాళ్లను చూసి వాళ్లు అసలు కేటరర్లేమో అని అనుకుంటే.. వాళ్లు కూడా వీళ్లను చూసి అసలు కేటరర్లేమో అనుకుంటారు. కానీ ఇద్దరూ నకిలీ వాళ్లే అన్న విషయం వాళ్లకు తెలియదు. దీంతో రాజుయే ధైర్యం చేసి వాళ్లను బెదిరించేలా మాట్లాడతాడు. అప్పుడే మేనేజర్ వచ్చి పని చూసుకోండని చెప్పడంతో ఎవరికి వాళ్లు వెళ్లిపోతారు.

భ్రమరాంబను ముసుగేసి చితకబాదిన నందు

ఇటు అపర్ణ వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమెను దూరం నుంచి చూసి నందు ఎమోషనల్ అవుతుంది. అప్పుడే భ్రమరాంబ అక్కడికి వచ్చి అపర్ణను నానా మాటలు అంటుంది. అది నందు వింటుంది. దీంతో ఆమె ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. భ్రమరాంబను ఫాలో అవుతుంది. ఆమె తన రూమ్ లోకి వెళ్లగానే వెనుక నుంచి వెళ్లి ముసుగేసి చితకబాది వెళ్లిపోతుంది. తనను కొట్టింది ఎవరో అర్థం కాక ఆమె లబోదిబోమంటుంది.

రాజును గుర్తు పట్టిన అపర్ణ

ఇటు ఇందుని అక్క అని పిలుస్తూ నందు హగ్ చేసుకుంది. వాళ్లను రాజు దూరం నుంచి చూస్తాడు. అప్పుడే అనుకోకుండా అపర్ణను ఢీకొడతాడు. మాస్క్ తొలగిపోవడంతో అపర్ణ అతన్ని చూస్తుంది. వెంటనే రాజు మాస్క్ సరి చేసుకుంటాడు. నిన్ను ఎక్కడో చూసినట్లుంది బాబు.. ఒకసారి మాస్కు తీయమని అపర్ణ అంటుంది. దీంతో రాజు షాక్ తింటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More