Brahmamudi April 6 Episode: బ్రహ్మముడి- కావ్య కథను పుస్తకంగా రాసిన కల్యాణ్- ధైర్యం తెచ్చుకున్న ఇందు- తనకు తానే కిడ్నాప్!
Brahmamudi Serial April 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 6వ ఎపిసోడ్‌లో కావ్య కథను పుస్తకంలా రాసి వదినకు అంకితం ఇస్తాడు కల్యాణ్. ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న అపర్ణ ఆ బుక్ తీసుకెళ్లి ఇందుకు ఇస్తుంది. ఆ బుక్ చదివిన ఇందు తల్లి గొప్పదనం, ధైర్యం తెలుసుకుంటుంది. కూతురుకు కావ్య ధైర్యం నూరిపోస్తుంది.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో మనకోసం ఇందు ఆస్తిని వదులుకోవాలనుకుంటుంది అని అపర్ణ కంగారుగా చెబుతుంది. ఇందు సేమ్ తన తల్లిలాగే చేస్తుంది. మనం తనను ఒప్పించలేం అని సుభాష్ అంటాడు. మనం ఒప్పించలేం కానీ తన తల్లి ఉందిగా. కావ్య జ్ఞాపకం ఉందిగా అని వెళ్లి ఓ బుక్ తీసుకుని వస్తుంది అపర్ణ.

కథలా కావ్య జీవితం
నేను నా విజయం అనే పేరుతో కావ్య బయోగ్రఫీని బుక్‌గా రాసినట్లు కల్యాణ్ చెప్పింది, కావ్య జీవితాన్ని పుస్తకంగా రాసి ఇచ్చింది అపర్ణ, సుభాష్ గుర్తు చేసుకుంటారు. మధ్య తరగతి కుటుంబంలో పుట్టి దుగ్గిరాల ఇంట్లోకి అడుగుపెట్టి సాధించిన విజయం గురించి కల్యాణ్ చెబుతాడు. వదిన వల్లే తన కలానికి గుర్తింపు వచ్చిందని, ఈ బుక్ రాబోయే తరాలకు ధైర్యం కావాలని, ఇది చరిత్ర కాదు రాబోయే తరానికి భవిష్యత్తు అని కల్యాణ్ అంటాడు.
కావ్య జీవితాన్ని కల్యాణ్ కథలా రాశాడు. ఈ కథను ఇప్పుడు ఇందు తెలుసుకోవాలి ఇందు దగ్గరికి వెళ్తుంది అపర్ణ. తన తల్లి కథను ఇందు తెలుసుకోవాలని బుక్ ఇస్తుంది అపర్ణ. ఇది నీ అమ్మ జీవితం, ఇందులో మీ అమ్మ మనసు, ధైర్యం, ఆవేశం, కన్నీళ్లు, ఆశయం అన్ని ఉన్నాయి. మీ బాబాయ్ మీ అమ్మ జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని మహాకావ్యంలా రాసి అంకితం ఇచ్చాడు. ఇది చదివి అయిన నీ నిర్ణయాన్ని మార్చుకుంటావని అనుకుంటున్నాను అని బుక్ ఇచ్చి వెళ్లిపోతుంది అపర్ణ.
అది తీసుకుని మురిసిపోతుంది ఇందు. మరోవైపు నువ్వు ఏదైతే జరగాలని ఆశించావే అదే జరగబోతుంది అమ్మా. కానీ నువ్వు లేవు అని రుద్రాణి ఫొటో చూస్తూ రేఖ అంటుంది. కానీ, నాకు ఆ ఇందు ఏమైనా చేస్తుందేమో అని భయంగా ఉంది. అంతమంది జనాల ముందు ఇందు అడ్డం తిరిగితే చేసేది ఏంటీ, ఇందు సింపుల్‌గా ఎలా ఒప్పుకుందా అనే నా డౌట్ అని భ్రమరాంబ అంటుంది.
కావ్య అండగా నిలబడాలి
ఇందు తన అమ్మలా బంధాలకే విలువ ఇస్తుంది. తోక జాడించదు. ఇందు ఏమైనా కావ్యలా ధైర్యవంతురాలు అనుకున్నావా కాదు. ఇందులో అంత ధైర్యం రావాలంటే మళ్లీ కావ్య రావాలి. తనకు అండగా నిలబడాలి అప్పుడు కానీ ఇందులో ధైర్యం పుట్టదు అని రేఖ అంటుంది. అది జరగదు కదా. హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉందని భ్రమరాంబ వెళ్లిపోతుంది.
మరోవైపు కావ్య జీవితాన్ని చదువుతుంది ఇందు. తన జీవితాన్ని కావ్య చెబుతున్నట్లుగా ఉంటుంది. పుట్టింటి నుంచి అత్తింటి వరకు రావడం, పెళ్లి, అవమానాలు, మౌన పోరాటం కావ్య జీవితం, కావ్యను అంతా ప్రేమించడం, ఆస్తి గొడవలు, కావ్యపై ఆస్తి రాయడం వంటి అన్ని విషయాలు చదువుతుంది ఇందు. నీకు ఇంద్రాదేవి అని పెట్టినందుకు తిట్టుకోవచ్చు. అది మా అమ్మమ్మ పేరు. మా గతానికి గుర్తు మా అమ్మమ్మ మా భవిష్యత్తుకు గుర్తు నువ్వు. రెండు తరాలను కలిపే వారధిగా ఆ పేరు నీకు పెట్టామని కావ్య చెబుతుంది.
రేపే నీ నామకరణం. మీ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితాలు బాగుండాలని శ్రైశైలం వెళ్తున్నాం. నువ్వు పుట్టాక నాకు ఏ బాధలు లేవు. మనసంతా ఆనందంగా ఉంది. నీ వల్లే వచ్చిన ఈ ఆనందం నీకు జీవితాంతం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇందు అని కావ్య అంటుంది. దాంతో బుక్ చదవడం అయిపోతుంది. అమ్మా అంటూ ఏడుస్తూ పుస్తకాన్ని హత్తుకుంటుంది ఇందు. అలాగే పడుకుంటుంది.
ధైర్యం నింపిన తల్లి
ఇంతలో ఎవరో తట్టినట్లు అనిపిస్తే ఇందు లేచి చూస్తుంది. పక్కనే అమ్మ కావ్య ఉంటుంది. చూసి షాక్ అవుతుంది. ఆస్తి కోసం తాతయ్య, నానమ్మని రేఖ చంపేస్తానంది అని భయంగా చెబుతుంది ఇందు. నువ్వు నా రక్తానివి అని కావ్య ధైర్యం నూరిపోస్తుంది. తల్లి ఇచ్చిన ధైర్యంతో రేఖను ఎదుర్కుంటుంది ఇందు.
ఉదయం రేఖ నుంచి తప్పించుకునేందుకు తనను తానే కిడ్నాప్ చేయించుకుంటానని అపర్ణతో చెబుతుంది ఇందు. తనను నువ్వు కిడ్నాప్ చేయాలని స్వాతికి చెబుతుంది ఇందు. దాంతో స్వాతి అలాగే చేస్తుంది. రేఖకు ఆస్తి సొంతం కాకుండా ఉండేందుకు ఇందు, రూ. 10 లక్షల కోసం ఐశ్వర్య, రాజు ముగ్గురు ఇందు కిడ్నాప్ ప్లాన్ చేస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


