Brahmamudi April 11 Episode: బ్రహ్మముడి- 20 లక్షలు కాదు రేఖను కోటి అడుగుదామన్న రాజ్- లక్కీని చూసేసిన ఇందు- ఐశ్వర్యలో భయం

Brahmamudi Serial April 11th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 11వ ఎపిసోడ్‌లో స్మోక్ మేషిన్ పెట్టి ఇందును కిడ్నాప్ చేస్తారు రాజ్, లక్కీ. వాళ్లకు ఇందు బాగా కోపరేట్ చేస్తుంది. రాజ్‌కు కాల్ చేసిన ఐశ్వర్య రేఖ ఆంటీని రూ. 20 లక్షలు అడుగుదామని చెబుతుంది. కాదు కోటి రూపాయలు అడుగుదామని రాజ్ చెబుతాడు.

Published on: Apr 11, 2026, 08:41:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కేక్ కటింగ్ తర్వాత రాజ్ వచ్చి కేక్ తీసుకెళ్తాడు. మీరు నా ప్లాన్‌ను ఫెయిల్ చేస్తున్నారని స్టేజీపైన రాజుతో అంటుంది ఐశ్వర్య. ఇందు సంతకం పెట్టదు అని చెప్పేసి వెళ్లిపోతాడు రాజ్. ఇందు టెన్షన్ పడుతూ తను అరెంజ్ చేసిన కిడ్నాపర్స్ వైపు చూస్తుంది.

బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 11 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 11 ఎపిసోడ్

చదువు అబ్బలేదు

వాళ్లు అంతా సెట్ చేశామన్నట్లుగా అభయహస్తం ఇస్తారు. లాయర్లు ఆస్తి పేపర్స్ తీసుకొచ్చి సంతకం పెట్టమంటారు. తనకు సంతకం రాదు వేలి ముద్ర వేయడమే అని భ్రమరాంబ అంటుంది. ఇంత ఆస్తి పెట్టుకుని చదువుకోకపోవడం ఏంటని అంతా అంటే.. తనకు చదువు అబ్బలేదని భూషణ్ అంటాడు. ఇందుతో రేఖ వేలి ముద్ర వేయించబోతుంది.

అప్పటివరకు పనిచేయని స్మోక్ మెషిన్ పనిచేస్తుంది. దాంతో అందరివైపు స్మోక్ పంపిస్తాడు రాజ్, లక్కీ. దాంతో ఇందు పురమాయించిన కిడ్నాపర్స్‌తో సహా అంతా స్పృహ తప్పుతారు. ఐశ్వర్య మాత్రం స్మోక్‌కు దూరంగా ఉంటుంది. ఇందు చేయి పట్టుకుని రాజ్ తీసుకెళ్లిపోతాడు. బయట వాళ్లను ఆగమని వెళ్లి లగేజ్ తెచ్చుకుంటుంది. మనకు కోపరేట్ చేస్తుందేంటీ మావ అని లక్కీ డౌట్ పడతాడు. స్మోక్ దెబ్బకు బ్రెయిన్ పనిచేయట్లేదనుకుంటా అని రాజ్ అంటాడు.

అందరూ వచ్చేస్తారు త్వరగా రమ్మని ఇందు అనడంతో రాజ్, లక్కీ కారు ఎక్కుతారు. నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇలాంటి అడ్వెంచర్ చేయడం, ఈరోజు నాకు స్వేచ్ఛ దొరికినట్లు ఉందని ఇందు అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా అని లక్కీ అడిగితే.. తెలుసు కిడ్నాపే కదా. చూడటానికి ఎధవల్లా ఉన్నారు, కానీ బాగా కిడ్నాప్ చేశారని మెచ్చుకుంటుంది ఇందు. దాంతో కర్చీఫ్‌పై మత్తు స్ప్రే చల్లి ఇందుకు పెడతాడు రాజ్.

అందరిని లేపిన శేషు

దాంతో ఇందు స్పృహ కోల్పోతుంది. ఇందును కిడ్నాప్ చేసి రాజ్, లక్కీ తీసుకెళ్లిపోతారు. శేషు స్పృహలోకి వచ్చి అందరూ పడిపోవడం చూసి షాక్ అవుతాడు. అందరిపైన నీళ్లు కొట్టి లేపుతాడు శేషు. బంటీ, బబ్లూ లేచి ఇందు కనిపించడం లేదురా. మనమే కిడ్నాప్ చేశామనుకుంటార్రా, పాదిపోదాంరా అని పారిపోతారు ఇద్దరు. ఇక వెళ్లి నా పర్ఫామెన్స్ స్టార్ట్ చేస్తా అని ఐశ్వర్య అంటుంది.

ఇందు ఎక్కడ అని రేఖ అడుగుతుంది. బబ్లూ వాళ్లు కనిపించట్లేదు అంటే ఇందు అక్క కిడ్నాప్ ప్లాన్ సక్సెస్ అయిందన్నమాట అని స్వాతి అనుకుంటుంది. ఐశ్వర్య వచ్చి ఇందును ఎవరో ఇద్దరు కిడ్నాప్ చేశారని చెబుతుంది. అమ్మో ఆస్తి గల్లంతు అయిపోయింది, నోటి కాడి కూడు లాక్కున్నాడు వాడెవడో అని భ్రమరాంబ గోల పెడుతుంది. ఈ విషయం బయటకు రాకముందే దీన్ని హ్యాండిల్ చేయాలని, పోలీసులకు ఫోన్ చేయమని భూషణ్‌కు రేఖ చెబుతుంది.

ఇందును కుర్చీకి తాళ్లతో కట్టేస్తారు రాజ్, లక్కీ. తర్వాత ఇద్దరు నవ్వుకుంటారు. అసలైన రిస్క్ ఇక్కడే మొదలైంది. ఈ మహాతల్లి మనల్ని చూడనంతవరకే చూసిందా మన పని అయినట్లే, జాగ్రత్తగా ఉండు అని రాజ్, లక్కీ ఒకరికొకరు చెప్పుకుంటారు. నీకు అయితే చుక్కలు చూపిస్తుందిరా అని రాజ్‌ని అంటూ నవ్వుతాడు లక్కీ. నేను ఎవరో తెలిసినప్పుడు కదా. తెలిసేలోపు పని ముగిద్దామని రాజ్ అంటాడు.

కోటి రూపాయలకు డీల్

ఇందు ఉన్న రూమ్‌కు లాక్ వేసి తినడానికి వెళ్తుంటారు రాజ్, లక్కీ. ఐశ్వర్య కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు అడగమంటుంది. వెంటనే చేస్తే డ్రామాలు అనుకుంటారు. కిడ్నాప్ అంటే భయం పెరగాలి. భయం ఎంత పెరిగితే అంత క్యాష్ చేసుకోవచ్చు అని రాజ్ అంటాడు. 20 లక్షలు అడుగుదామని ఐశ్వర్య అంటుంది. ఎవరో పిక్ పాకెట్ గాళ్లు అనుకుంటుంది. కోటి రూపాయలు అడుగుదామని రాజ్ అంటాడు.

దాంతో ఐశ్వర్య, లక్కీ ఇద్దరు షాక్ అవుతారు. రాజ్, ఐశ్వర్య వాటాల గురించి బేరాలు మాట్లాడుకుంటారు. ఇద్దరు 50-50 అనుకుంటారు. మా ఆంటీ ఇందుకోసం కాకపోయినా సంతకం కోసం అయిన ఎలాగైనా పట్టుకొస్తుందని ఐశ్వర్య అంటుంది. మరి ఎక్కడ దాచిపెట్టారని ఐశ్వర్య అడిగితే.. అది తెలియకపోవడమే మంచిది అని కాల్ కట్ చేస్తాడు రాజ్.

ఇంటి ఓనర్ గురించి రాజ్ అడిగితే కేవలం వింటర్‌లోనే వస్తాడని, వేసవిలో ఫారెన్‌లో గడుపుతాడని లక్కీ చెబుతాడు. మరోవైపు ఇందు కిడ్నాప్‌పై పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. మాటల మధ్యలో శేషు సంతకం పెట్టలేదని బాధపడుతున్నావా అని భ్రమరాంబను అంటాడు. సంతకం ఏంటీ అని పోలీస్ అడుగుతాడు.

లక్కీ, రాజును చూసేసిన ఇందు

అది మా ఫ్యామిలీ మ్యాటర్ ఎస్సై గారు, పెద్ద ఇంపార్టెంట్ కాదు అని రేఖ కవర్ చేస్తుంది. శత్రువులు లేరు, అనుమానించేవాళ్లు లేరు, కేవలం డబ్బు గురించే చేస్తే మీ ఇంట్లో సంగతులు వాళ్లకు ఎలా తెలుస్తుంది. మీకు తెలిసిన వాళ్లే కిడ్నాప్ చేయించి ఉంటారు. ఇందుకు ఆస్తి వస్తుందని మీ ఇంట్లోవాళ్లకు మాత్రమే తెలుసు కదా అని ఎస్సై అంటాడు.

అమ్మో కరెక్ట్ పాయింట్‌కు వచ్చేశాడు. నేనే కిడ్నాప్ చేయించానని తెలిసిపోతుందా ఏంటీ అని ఐశ్వర్యలో వణుకు మొదలవుతుంది. మరోవైపు ఇందుకు లక్కీ నీళ్లు తాగిస్తుంటాడు. ఇంతలో మాస్క్ తీసి లక్కీని చూస్తుంది ఇందు. ఒరేయ్ లక్కీ నువ్వా అని తిడుతుంది. మేము కేవలం డబ్బు కోసమే కిడ్నాప్ చేశామని రాజ్ చెబుతాడు.

డబ్బుల కోసం నన్ను కిడ్నాప్ చేయించాల్సిన అవసరం ఎవరికి ఉందని ఇందు అనుమానిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More