Brahmamudi March 27th Episode: బ్రహ్మముడి- సొంతింటికి స్వరాజ్, రేఖలో వణుకు- బయటపడిన ఐశ్వర్య దొంగతనం- ఇందుదే ప్లాన్!
Brahmamudi Serial March 27th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 27వ తేది ఎపిసోడ్‌లో రెండు నెక్లెస్‌ల దొంగతనం గురించి ఇందును నిలదీస్తుంది రేఖ. ఇంతలో లక్కీతోపాటు స్వరాజ్ సొంతింటికి వస్తాడు. రాజ్‌ను చూసి ఉలిక్కిపడుతుంది రేఖ. రాజ్ బావలా ఉన్నాడేంటని వణికిపోతుంది. ఐశ్వర్య నెక్లెస్ తీసి ఇస్తాడు లక్కీ.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో అందరూ ఇందు కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలో ఇందు వస్తుంది. ఎందుకు చేశావ్ ఈ పని అని రేఖ అడిగితే.. దేని గురించి అడుగుతున్నారు అని ఇందు అంటుంది.

ఇందును నిలదీసిన రేఖ
రెండు నెక్లెస్‌ల దొంగతనం ఎందుకు చేశావ్. నా వస్తువులను తాకే ధైర్యం ఎలా వచ్చిందని రేఖ అంటుంది. నేను ఏ దొంగతనం చేయలేదు. వంట చేసి ఇప్పుడే వస్తున్నా అని ఇందు అంటుంది. ఇలా నార్మల్‌గా అడిగితే ఎలా చెబుతుంది అని భ్రమరాంబ, ఐశ్వర్య అంటారు. ఇద్దరు కలిసి పాపం ఇందును బలి పశువును చేస్తున్నారుగా అని తిట్టుకుంటాడు శేషు.
తాతయ్య ఆపరేషన్ కోసం చేసి ఉంటావని ఐశ్వర్య అంటే.. అది నిజమే కానీ, దానికోసం ఇంతలా దిగజారతానా, నా గురించి మీకు తెలియదా నా గురించి అని ఇందు అంటుంది. అయినా రేఖ నమ్మదు. నువ్వు చేసిన ఈ పనికి వాళ్లకు శిక్ష వేస్తాను, ఆ ముసలోడు లేచి నడుస్తాడనే నీ కలను ఇప్పుడే తొక్కేస్తాను అని రేఖ అంటుంది. నెక్లెస్‌ను ఐశ్వర్య తీసిందని తెలిసినా ఆధారం లేకుండా చెప్పలేను అని బాధపడుతుంది స్వాతి.
ఒకేసారి ఇద్దరి పంపిస్తే మరింత భయం పుడుతుందని భూషణ్ అంటాడు. నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, నిజం చెప్పి నగలు ఇస్తే వాళ్లను కాపాడినదానివి అవుతావ్ అని రేఖ అంటుంది. దాంతో ఇందు కంగారుపడుతుంది. మరోవైపు ఇందు ఇంటర్వ్యూ గురించి చెప్పిన అపర్ణ అన్ని బాగుంటే మన రాజ్ మేనల్లుడుని ఇచ్చి పెళ్లి చేసేవాళ్లం అని చెబుతుంది.
స్వరాజ్ బతికే ఉంటాడు
వ్యాన్ కాలిపోయిన రోజు అందరు కనిపించారు. కానీ, ఆ పిల్లాడి బాడీ మాత్రం కనిపించలేదు. వాడు ఇంకా బతికే ఉంటాడనిపిస్తుందండి, ఎక్కడో చోట ప్రాణాలతో ఉండే ఉంటాడని అపర్ణ అంటుంది. వాడు బతికి ఉంటే మన ఇంటికి ఎప్పుడో వచ్చేవాడు కదా అని సుభాష్ అంటాడు. ఏదో ఒక రోజు మన ఇంటికి వెతుక్కుంటూ తప్పకుండా వస్తాడనిపిస్తుందని అపర్ణ అంటుంది.
ఇంతలోనే స్వరాజ్ దుగ్గిరాల ఇంటికి లక్కీతో వస్తాడు. అంటే సొంతింటికి స్వరాజ్ వస్తాడు. మరోవైపు పాపం ఇంతమంది రాక్షసుల మధ్యలో పోరాడుతున్న ఇందుకు తోడు దొరుకుతుందని సుభాష్ అంటాడు. దుగ్గిరాల ఇల్లు చూసి రాజ్‍కు గతం ఫ్లాష్‌లా గుర్తుకు వస్తుంటుంది. ఈ ఇంటిని ఇంతకుముందు ఎక్కడో చూశాను అని రాజ్ అంటాడు. నీకు వచ్చే ముష్టి కలలో చూసి ఉంటావ్ అని లక్కీ అంటాడు.
ఆ ముసలోడి నడుం ఇరగ్గొడితే కానీ దీనికి బుద్ధి రాదని భ్రమరాంబ అంటుంది. వాళ్ల జోలికి వెళ్తే ఊరుకోను అని ఇందు అంటుంది. ఇంతలో రాజ్, లక్కీ వస్తారు. స్వరాజ్‌ను చూసి రాజ్ బావల ఉన్నాడని రేఖ నిర్ఘాంతపోతుంది. ఇందును చూసి ఇదేంట్రా ఇక్కడుందనుకుంటారు. రాజ్ అని రేఖ పిలుస్తుంది. నా పేరు భలే గెస్ చేశారే. కానీ, రాజ్ కాదు రాజు, రాజ్ కూడా బాగానే ఉందని రాజ్ అంటాడు.
నెక్లెస్ తీసి ఇచ్చిన లక్కీ
ఐశ్వర్య కోసం వచ్చామని లక్కీ అంటే భ్రమరాంబ అవమానిస్తుంది. ఇంతలో ఐశ్వర్య వీళ్లు నా ఫ్రెండ్స్, రండి బయటకు వెళ్లి మాట్లాడుకుందామని అంటుంది. రాజ్ సరే అంటే.. ఇక్కడే అందరిముందు ఇంప్రెస్ చేద్దామని లక్కీ అంటాడు. నువ్వు దేని గురించి కంగారుపడుతున్నావో అది ఇవ్వబోతున్నా అని నెక్లెస్ తీసి చూపిస్తాడు లక్కీ.
అది చూసి రేఖ ఆశ్చర్యపోతుంది. ఈ నెక్లెస్ నీకు ఎక్కడిది అని భ్రమరాంబ అడుగుతుంది. అప్పుడు ఐశ్వర్య కారు ఎక్కింది, కారులో నెక్లెస్ పడిపోయింది, అది ఇద్దామని వచ్చామని లక్కీ అంటాడు. అలా ఐశ్వర్య దొంగతనాన్ని రాజ్, లక్కీ బయటపెడతారు. అది తీసింది నువ్వా. పాపం ఇందాకటి నుంచి ఇందును అంటే చెప్పవేంటీ అని భ్రమరాంబ నటించేస్తుంది.
మరి ఇంకో నెక్లెస్ ఎక్కడ అని రేఖ కోపంగా అడుగుతుంది. నేను చెబుతాను అని స్వాతి అంటుంది. ఆ ఇంకో నెక్లెస్ స్వాతి తీసుకొచ్చి చూపిస్తుంది. తల్లి భ్రమరాంబ నెక్లెస్ కొట్టేసింది తాను చూసింది గుర్తు చేసుకుంటుంది స్వాతి. అది చూసి భ్రమరాంబ స్పృహ తప్పుతుంది. ఈ నెక్లెస్ నీ రూమ్ ముందే పడిపోయి ఉందని స్వాతి తల్లిని కాపాడుతుంది.
వణికిపోయిన రేఖ
ఇంతలో అపర్ణ అక్కడ ఉంటే రాజ్ చూస్తాడు. వెళ్లిపోయే రాజ్ అపర్ణను చూసి ఆగిపోతాడు. తర్వాత రాజ్ అక్కడికి వచ్చేలా చేసిందే తాను అని ఇందు చెబుతుంది. ఐశ్వర్య దొంగతనం బయటపడేలా తనే ప్లాన్ చేసినట్లుగా చెబుతుంది ఇందు. అసలు ఈ రాజు ఎవరు, వాడు ఎక్కడ ఉంటాడు. ఇప్పటివరకు ఏం చేశాడో తెలుసుకోవాలి. లేకుంటే ఇందుకు తోడుగా వచ్చి నిలబడతాడు అని రేఖలో వణుకు మొదలవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


