Brahmamudi March 17 Episode: కంటతడి పెట్టించిన స్వాతి డ్రామా.. ఇందు జీవితం తలకిందులు.. సర్టిఫికెట్లతో రేఖకు దొరికిపోయి..
Brahmamudi March 17 Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 17 ఎపిసోడ్ లో స్వాతి ఆడిన హైడ్రామా రక్తి కడుతుంది. రేఖ బారి నుంచి ఇందుని కాపాడుతుంది. అదే సమయంలో రేఖ ఆధీనంలో ఉన్న ఆస్తిని తిరిగి ఇందుకి అప్పగించేలా అపర్ణ ప్లాన్ చేస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో పోలీస్ స్టేషన్ నుంచి ఐశ్వర్యను ఇందు, స్వాతి తీసుకొస్తారు. ఇంట్లో నిలదీసిన రేఖ దగ్గర స్వాతి డ్రామా మొదలుపెట్టడంతో ఇందు బతికిపోతుంది. అయితే చివరికి తన సర్టిఫికెట్లతో సహా ఆమె రేఖకు దొరికిపోవడంతో ఆమె జీవితం తలకిందులయ్యే పరిస్థితి కనిపిస్తుంది.

లక్కీని విడిపించిన రాజు
బ్రహ్మముడి సీరియల్ మంళవారం (మార్చి 17) ఎపిసోడ్ పోలీస్ స్టేషన్ లో లక్కీని ఎస్సై కొట్టే సీన్ తో మొదలవుతుంది. మత్తులో ఉన్న ఐశ్వర్య.. లక్కీ తనకు లిఫ్ట్ ఇచ్చాడని కాకుండా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించాడని చెబుతుంది. దీంతో ఎస్సై అతన్ని కొడతాడు.
అయితే అదే సమయంలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన రాజు.. జరిగిన విషయాన్ని చెబుతాడు. బస్తీలో ఉంటామంటూ తన ఐడీ ప్రూఫ్ కూడా చూపిస్తాడు. దీంతో లక్కీని తీసుకెళ్లడానికి ఓకే చెప్పిన ఎస్సై.. బండిని మాత్రం కోర్టులో ఫైన్ కట్టి తీసుకెళ్లాలని, డ్రంకెన్ డ్రైవ్ కేసు అని చెబుతాడు. చేసేది లేక రాజు, లక్కీ వెళ్లిపోతారు.
ఐశ్వర్యను తీసుకెళ్లిన ఇందు, స్వాతి
అదే సమయానికి ఇందు, స్వాతి పోలీస్ స్టేషన్ కు వస్తారు. అప్పటికే ఐశ్వర్య పోలీసులను నానా తిప్పలు పెడుతుంది. తన పేరెంట్స్, అడ్రెస్, చివరికి ఫోన్ లాక్ కూడా మరచిపోతుంది. తన ఎవరైనా కిడ్నాప్ చేయండంటూ గోలగోల చేస్తూ ఉంటుంది. ఇందు, స్వాతి వచ్చి ఆమె గురించి చెబుతారు. అసలు పోలీసులు ఎవరో, దొంగలు ఎవరో గుర్తుపట్టలేనంతగా తాగింది అని ఎస్సై అంటాడు. ఆమెను చూసిన నందు.. దీనికి పొగరు బాగా ఎక్కువని, పబ్ లోనే నాలుగు ఇద్దామనుకున్నానని తన పెంచిన తండ్రితో అంటుంది.
ఇందుని కాపాడిన నందు
స్వాతి, ఇందు ఐశ్వర్యను బయటకు తీసుకెళ్తారు. ఇందును చూసిన ఐశ్వర్య నువ్వంటే నాకు అసహ్యం.. నన్ను పట్టుకోకు అంటూ తోసేస్తుంది. ఇందు కింద పడిపోతుండగా నందు వచ్చి పట్టుకుంటుంది. ఐశ్వర్యను నానా మాటలు అంటుంది. అయితే ఇందు జోక్యం చేసుకొని తెలియని వ్యక్తి గురించి అలా మాట్లాడటం సరి కాదని చెబుతుంది. మరీ ఇంత మంచితనం పనికి రాదని చెప్పి నందు అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
ఇందుని నిలదీసిన రేఖ.. అడ్డుకున్న అపర్ణ
ఇందు, స్వాతి కలిసి ఐశ్వర్యను ఇంటికి తీసుకొస్తారు. సైలెంట్ గా వెళ్దామనుకున్న వాళ్లకు షాక్ తగులుతుంది. హాల్లో లైట్ వేసిన రేఖ, భ్రమరాంబ వాళ్లను చూస్తారు. ఎక్కడికెళ్లావ్ అంటూ ఇందుని రేఖ నిలదీస్తుంది. ఎవరికి కలవడానికి వెళ్లావ్.. తన మాట కాదని ఎందుకెళ్లావ్ అని అడుగుతుంది.
దీంతో అపర్ణ జోక్యం చేసుకుంటూ తప్పు చేసింది నీ మేడకోడలు ఐశ్వర్య.. అది వదిలేసి ఏ తప్పూ చేయని ఇందుని ఎందుకు నిలదీస్తున్నావ్ అని అడుగుతుంది. అలాంటప్పుడు నువ్వు కూడా ఎందుకు ఇందు ఇంట్లోనే ఉందని అబద్ధం చెప్పావని రేఖ.. అపర్ణను అడుగుతుంది.
ఇందుని కాపాడిన స్వాతి.. రక్తి కట్టిన డ్రామా
దీంతో స్వాతి రంగంలోకి దిగుతుంది. పబ్ లో ఐశ్వర్య ఎవరి బైక్ మీదనో వెళ్లి పోలీసులకు చిక్కిందని తన ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పాడని, అందుకే తాను ఇందు అక్కను సాయం కోసం తీసుకెళ్లాలని అంటుంది. కావాలంటే సంతోష్ అనే వ్యక్తి పబ్ కి వచ్చాడో లేదో కనుక్కోండని చెబుతుంది. మరి తనకెందుకు ఆ విషయం చెప్పలేదని రేఖ అడుగుతుంది.
భయం ఆంటీ అంటూ స్వాతి డ్రామా మొదలుపెడుతుంది. నువ్వు ఎప్పుడూ సీరియస్ గా ఉంటావు.. మాతో ప్రేమగా మాట్లాడవు.. నీకు ఏం చెప్పాలన్నా భయం అంటూ తన తల్లిదండ్రుల ముందే స్వాతి డ్రామాను రక్తి కట్టిస్తుంది. దీంతో రేఖ మనసు కరిగి సరే అంటూ అక్కడితో వదిలేస్తుంది. తన కూతురు స్వాతిని చూసి భ్రమరాంబ కంటతడి పెడుతుంది. ఆమె ప్రేమ కోసం ఇంతలా పరితపిస్తోందా అని అంటుంది.
సర్టిఫికెట్లతో దొరికిపోయి..
మరోవైపు ఆస్తికి పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న రేఖ చేతుల్లో నుంచి ఆస్తిని తిరిగి ఇందుకి దక్కేలా చేయాలని సుభాష్ తో అంటుంది అపర్ణ. అందుకు ఏం చేయాలో ఆలోచిస్తుంది. అదే సమయంలో తనకు ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఇందు బయలుదేరుతుంది.
అప్పుడే భ్రమరాంబ అడ్డుకొని బ్యాగులో ఏముందని అడుగుతుంది. బ్యాగు తెరవొద్దని ఇందు అడిగినా బలవంతంగా లాక్కోవడంతో అది కింద పడుతుంది. అందులోని సర్టిఫికెట్లు రేఖ కంట పడతాయి. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


