Brahmamudi March 20th Episode: బ్రహ్మముడి- అపర్ణను మోసం చేసిన లాయర్- రాజ్ 5 లక్షల స్కామ్- తాత కోసం తల్లడిల్లిన ఇందు!

Brahmamudi Serial March 20th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 20వ తేది ఎపిసోడ్‌లో గుడిలో లాయర్‌ను కలిసి రేఖపై కేసు వేయాలని డాక్యుమెంట్స్, బంగారం ఇస్తుంది అపర్ణ. ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందుకు ఆలస్యం కావడం వల్ల జాబ్ రాదు. 2 వేలకు ల్యాప్‌ట్యాప్ కొని 20 వేలకు అమ్మేందుకు రాజ్ స్కామ్ చేస్తాడు.

Published on: Mar 20, 2026, 07:51:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో గుడిలో లాయర్‌ను కలిసిన అపర్ణ మా ఆస్తి పవర్ ఆఫ్ అటార్నీ రేఖ తన నుంచి బలవంతంగా రాయించుకుందని చెబుతుంది. అది ఇల్లీగల్ అని లాయర్ చెబుతాడు. ప్రతి సంవత్సరం వచ్చే డబ్బు తనే తీసుకుంటుంది అని అపర్ణ అంటుంది.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 20వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 20వ ఎపిసోడ్

లాయర్‌ను కలిసిన అపర్ణ

అది ఇంకా పెద్ద క్రైమ్. మీరు కేసు వేస్తే ఇప్పటివరకు వాళ్లు ఖర్చు చేసింది అంతా మీకు కోర్టు ఇప్పిస్తుందని లాయర్ అంటాడు. ఆ డబ్బు తిరిగి రాకపోయినా పర్వాలేదు. కానీ ఇందు మేజర్ కాబట్టి ఆస్తి మొత్తం తన పేరు మీదకు వచ్చేదాకా పవర్ ఆఫ్ అటార్నీ కూడా తనకు వచ్చేలా చేయండి, నా మనవరాలికి న్యాయం కావాలి అని అపర్ణ అంటుంది.

ఇవాళే రేఖపై కేసు వేస్తాను. మీకు వచ్చేలా చేస్తాను అని లాయర్ అంటాడు. కానీ, కోర్టులో కేసు గెలిచే వరకు ఈ విషయం రేఖకు తెలియకూడదు అని అపర్ణ అంటుంది. వాళ్లకు తెలిస్తే జాగ్రత్త పడతారు. ఎవరికి తెలియను అని లాయర్ అంటాడు. ఆరోజు ఎలా రేఖ నాతో సంతకం పెట్టించుకుందో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇందులో ఉన్నాయి అని లాయర్‌కు ఇస్తుంది అపర్ణ.

ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను డబ్బు ఇవ్వలేను అని లాయర్‌కు బంగారం ఇస్తుంది అపర్ణ. అంతా నేను చూసుకుంటాను అని లాయర్ డాక్యుమెంట్స్, బంగారం తీసుకెళ్లిపోతాడు. మరోవైపు ఇంటర్వ్యూకి వెళ్లిన ఇందు అడిగితే.. ఇంటర్వ్యూ అయిపోయిందని, ఇలా లేట్ వస్తే మా హెచ్ఆర్ కలవరు అని వాచ్‌మెన్ చెబుతాడు. ఇందు బితిమిలాడడంతో నన్ను కలవలేదని, స్ట్రయిట్‌గా హెచ్ఆర్ రూమ్‌లో కూర్చున్నట్లు చెప్పమంటాడు.

ఇందుకు పోయిన జాబ్

ఇందు అలాగే చేస్తుంది. హెచ్ఆర్ దగ్గరికి ఇందు వెళ్తుంది. అతను మాత్రం లేట్ అయిందని టైమ్ గురించి క్లాస్ పీకుతాడు. ఇంతలో అతని భార్య కాల్ చేసి టైమ్‌కు గ్యాస్ బుక్ చేయడం రాదని తిడుతుంది. గ్యాస్ రాకుంటే ఇంట్లో మొదలవుతుంది యుద్ధం అని అంటుంది. నేను టైమ్‌కు గ్యాస్ బుక్ చేసిన అది రాలేదు. అది పొరపాటు, కానీ నీది తప్పు అని హెచ్ఆర్ చెబుతాడు.

ఇందు తనకు అయిన లేట్ గురించి చెబుతుంది. హెచ్ఆర్ నమ్మడు. నేను టాలెంట్‌ను కాదు టైమింగ్‌ను నమ్మను. జాబ్ ఉంది కానీ, నీలాంటి వాళ్లకు ఇవ్వను అంటున్నాను అని హెచ్ఆర్ అంటాడు. దాంతో సైలెంట్‌గా బాధగా వెళ్లిపోతుంది ఇందు. ఛ.. ఆ ఎధవ వల్ల జాబ్ పోయింది. ఇంకోసారి వాడు కనపడను చెబుతాను అని రాజ్ గురించి తిట్టుకుంటుంది ఇందు.

మరోవైపు రాజ్ డీల్ గురించి మాట్లాడుకుంటారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో పాడైపోయిన 25 ల్యాప్‌ట్యాప్స్ కొన్నాను. వాటిని రిపేర్ చేయిద్దామని చూస్తే అవి కాలేదు. కానీ, మీరు అయితే మంచి ధరకు అమ్మగలరు అందుకే మీతో డీల్ ఫిక్స్ చేసుకుందామని వచ్చానని అతను అంటాడు. ఒక్కో ల్యాప్‌టాప్‌కు 2 వేల చొప్పున రాజ్ డీల్ కుదుర్చుకుంటాడు.

రాజ్ ల్యాప్‌టాప్ స్కామ్

అతను ల్యాప్‌ట్యాప్ ఇస్తాడు. అది చూసిన రాజ్ అన్ని ల్యాప్‌ట్యాప్స్ ఒకేసారి వర్క్ చేయాలి అని రాజ్ అంటాడు. సరేనని డీల్ కుదుర్చుకున్న వ్యక్తి వెళ్లిపోతాడు. ఒక్కో ల్యాప్‌టాప్ సేల్‌కి పెట్టి అమ్మాలంటే చాలా లేట్ అవుతుంది అని రాజ్ ఫ్రెండ్ లక్కీ అంటాడు. ఇవన్నీ అమ్మాలంటే చీట్ కాదు స్కామ్ చేయాలి, ప్లాన్ చేసి అమ్మాలని రాజ్ అంటాడు.

ఇంట్లో ఉంటూ నెలకు 50 వేలు సంపాదించొచ్చు అని సోషల్ మీడియాలో పెడతాం. వారికి ల్యాప్‌ట్యాప్ ఇస్తాం. కానీ, వాటిని సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ. 20 వేలు కట్టాలంటాం. 25 ల్యాప్‌ట్యాప్స్‌కి రూ. 5 లక్షలు వస్తుంది. ల్యాప్‌ట్యాప్ ఇస్తున్నాం కాబట్టి ఇస్తారు అని రాజ్ ఐడియా చెబుతాడు. మరోవైపు ఆటోలో నుంచి ఇందు ఇంటికి వెళ్తుంది. అప్పుడే అపర్ణ కూడా వస్తుంది.

ఇంటర్వ్యూ ఒకడి వల్ల పోయింది, వాడి పేరు అని ఇందు చెప్పాలని చూస్తుంది. కానీ, గుర్తు రాదు. తర్వాత ఇద్దరు ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఓ డాక్టర్ సుభాష్‌కు ఇంజక్షన్ వేశాను అని చెప్పి వెళ్లిపోతాడు. ఇందు శివరాం ఇంటికి వెళ్లింది, నువ్వెక్కడికి వెళ్లావ్ అని అపర్ణను రేఖ అడుగుతుంది. గుడికి వెళ్లానని అపర్ణ అంటుంది.

5 సెకన్లలో తెలుస్తుంది

ఇద్దరు అలా వెళ్లిపోతే అంకుల్‌ను ఎవరు చూసుకుంటారు. అంకుల్‌కి బ్రీతింగ్ ప్రాబ్లమ్ వచ్చింది, వెంటనే డాక్టర్‌ను పిలిచి ట్రీట్‌మెంట్ ఇచ్చానని రేఖ అంటుంది. దాంతో కంగారుగా సుభాష్‌ దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతారు ఇందు, అపర్ణ. తనకేం కాలేదని సుభాష్ చెబుతాడు. రేఖ చెప్పింది చెబుతుంది ఇందు.

డాక్టర్ వచ్చి బీపీ చూసి డీ విటమిన్ తక్కువగా ఉందని ఇంజక్షన్ ఇచ్చి వెళ్లాడని సుభాష్ అంటాడు. దాంతో ఇందు, అపర్ణకు ఏం అర్థం కాకుండా ఆలోచిస్తారు. సడెన్‌గా వాళ్లమీద ప్రేమ పుట్టుకొచ్చిందేంటీ అని రేఖను అడుగుతుంది భ్రమరాంబ. సరిగ్గా ఐదు సెకన్లలో తెలుస్తుందని రేఖ అంటుంది. సుభాష్ చెమటలు పడుతు శ్వాస ఆడకా ఇబ్బంది పడతాడు.

ఇందు, అపర్ణ కంగారు పడి రేఖ దగ్గరికి వచ్చి తాతయ్యకు ఊపిరి ఆడట్లేదు, డాక్టర్‌ను పిలవమంటుంది ఇందు. డాక్టర్ ఇప్పుడే వెళ్లాడుగా మళ్లీ రావడం ఇబ్బంది అవుతుందని రేఖ అంటుంది. మేము హాస్పిటల్‌కు తీసుకెళ్తామని అపర్ణ అంటుంది. సరే, కారు, డ్రైవర్‌ను ఇస్తాను. కానీ ఒక్క నిమిషం అంకుల్‌కు బ్రీతింగ్ ప్రాబ్లమ్ రావడానికి కారణం ఏంటీ అని అడిగితే ఏం చెబుతారు అని రేఖ అంటుంది.

కోర్టులో నా మీదే కేసు వేస్తావా

నువ్వే ఏదో ఇంజక్షన్ ఇచ్చావని చెబుతాను అని అపర్ణ అంటుంది. సరిగ్గా చెప్పావ్. కిటుకు అంతా అక్కడే ఉంది. కానీ, నేను ఏ ఇంజక్షన్ ఇప్పించానో దానికి సరైన యాంటీడోట్ వేయించాలి. లేకుంటే ఏ డాక్టర్ కూడా అంకుల్ ప్రాణాలు కాపాడలేరు, ఊపిరి ఆగి పైకి పోతారో కూడా గ్యారెంటీ ఇవ్వలేరు అని రేఖ చెబుతుంది.

నాకు తెలియకుండా నా మీద కోర్టులో కేసు వేయాలని చూస్తావా. నా పేరు మీదున్న పవర్ ఆఫ్ అటార్నీ ఇందు పేరు మీదకు మార్చాలనుకుంటావా అని రేఖ అంటుంది. దాంతో అపర్ణకు తన లాయర్ మోసం చేశాడని అర్థమవుతుంది. యాంటీ డోట్ ఇవ్వమని రేఖను ఇందు వేడుకుంటుంది.

నాకే వెన్నుపోటు పొడుస్తారా, దీనికి శిక్ష పడాలిగా అని రేఖ అంటుంది. మరోవైపు సుభాష్ ఊపిరి ఆడక కొట్టుమిట్టాడుతాడు. తాత కోసం ఇందు తల్లడిల్లుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More