Brahmamudi March 18th Episode: బ్రహ్మముడి- ఐశ్వర్యకు ఎదురుతిరిగిన ఇందు- తమ్ముడితో బైక్ ఫైన్ కట్టించిన రాజ్- ఇందు ఎస్కేప్

Brahmamudi Serial March 18th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 18వ తేది ఎపిసోడ్‌లో స్వాతి తన ల్యాప్‌ట్యాప్ తీసుకొచ్చి మూడు చోట్ల జాబ్ వెకెన్సీ ఉందని, వాటికి ఇందుకోసం అప్లై చేసినట్లు చెబుతుంది. ఐశ్వర్య మరో పార్టీ గురించి మాట్లాడుతుంటే స్వాతి విని తిడుతుంది. దాంతో స్వాతిని కొట్టబోతుంది ఐశ్వర్య.

Published on: Mar 18, 2026, 07:34:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రేఖ వాళ్ల ముందు స్వాతి చేసిన పర్ఫామెన్స్ గురించి ఇందు, స్వాతి నవ్వుకుంటారు. మాములు యాక్టింగ్ కాదంటూ స్వాతిని మెచ్చుకుంటుంది ఇందు. వెళ్లిన ఇంటర్వ్యూ ఏమైందని స్వాతి అడిగితే.. ఇదివరకు డబ్బులు గుంజుదామని చూసినవాడి వల్ల చివరిలో మిస్ అయిందని ఇందు చెబుతుంది.

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 18వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 18వ ఎపిసోడ్

మూడు కంపెనీల్లో జాబ్స్

ఇప్పుడేం చేస్తావని స్వాతి అడిగితే.. నీ ల్యాప్‌ట్యాప్ ఇస్తే ఆన్‌లైన్‌లో ఇంటర్వ్యూస్ ఏ కంపెనీలో ఉన్నాయో చూసి అప్లై చేద్దాం. అవసరం ఉన్న వాళ్లు కాల్ చేస్తారుగా అని ఇందు అంటుంది. దాంతో ల్యాప్‌ట్యాప్ తీసుకొచ్చిన స్వాతి మూడు కంపెనీల్లో జాబ్స్ ఉన్నాయని, అప్లై చేశానని చెబుతుంది స్వాతి.

మరుసటి రోజు ఉదయం ఇంట్లో బైక్ కనిపించట్లేదని రాజ్‌ను లేపి తిడతాడు తండ్రి. బైక్ ఏం చేశావని తిడతాడు. రోజు రోజు జైలర్‌లా తయారవుతున్నావ్ అని రాజ్ అంటాడు. ఇంతలో రాజ్ ఫ్రెండ్ వస్తాడు. రాజ్ తండ్రి తిట్లు చూసి అక్కడే ఆగిపోతాడు. రాజ్ తమ్ముడు వెంకీ నవ్వుతాడు. బైక్ గురించి నాకు కాదు వాడికి తెలుసు. వాడి ఫ్రెండ్‌కు కావాలని అడిగి ఇప్పించాడు అని ఫోన్ చూపిస్తూ రాజ్ బ్లాక్ మెయిల్ చేస్తాడు.

సెల్ఫీ చూపిస్తానని బెదిరించి బాగా ఇరికించాడని రాజ్ ఫ్రెండ్ అనుకుంటాడు. జరిగింది మొత్తం చెప్పేసేయ్‌రా, భయపడకు అని రాజ్ అంటాడు. వెంకీ కాదనలేక ఫ్రెండ్‌కు బైక్ ఇస్తే.. వాడు తాగి రోడ్డెక్కాడు. అది కాస్తా పోలీస్ స్టేషన్‌లో ఉందని రాజ్ అంటాడు. అలాంటి వాళ్లతో ఫ్రెండ్షిప్ చేయకని తండ్రి అంటాడు.

తమ్ముడితో ఫైన్

నాన్నకు చిన్నోడు అంటేనే ప్రేమ నాలాంటి పెద్దోడి సంగతి అంతే అని డ్రామా చేస్తాడు రాజ్. దాంతో రాజ్ కోసం చేసిన పనులు చెబుతాడు తండ్రి. ఇంతలో ఫ్రెండ్ వచ్చి బైక్ త్వరగా తీసుకురావాలని అంటాడు. బైక్ ఫైన్ కట్టేందుకు వెయ్యి రూపాయలు ఇవ్వు అని తమ్ముడు వెంకీని అడుగుతాడు. దాంతో చేసేదిలేక వెయ్యి పంపుతాడు వెంకీ.

డీల్ గురించి రాజ్ ఫ్రెండ్ చెప్పడంతో సరేనంటాడు. మరోవైపు కిచెన్‌లో ఇందు ఫోన్ రింగ్ అవుతుంది. కానీ, దొరకదు. ఇంతలో శేషు వచ్చి మొబైల్ రింగ్ అవుతుందని అంటాడు. అప్పుడే శేషు ఫోన్ రింగ్ కావడంతో మీదేనని ఇందు చెబుతుంది. శేషు వెళ్లిపోతాడు. అలా ఇందు ఎస్కేప్ అవుతుంది. తర్వాత ఇందు తన ఫోన్ తీసుకుని రిటర్న్ కాల్ చేస్తే జాబ్ కోసం ఇంటర్వ్యూ ఉందని చెబుతారు.

వస్తానని ఇందు చెబుతుంది. ఇంతలో ఇందు భుజంపై చేయి పడుతుంది. ఇందు దడుసుకుని తెగ వణికిపోతుంది. తీరా చూస్తే అది అపర్ణ. అపర్ణ దేవి తెగ భయపెట్టావ్ అన అంటుంది. ఏమైందని అపర్ణ అంటే.. ఆఫీస్‌లో ఇంటర్వ్యూ ఉందని ఇందు చెబుతుంది. మరోవైపు రాత్రి మరో పార్టీ గురించి ఫోన్‌లో ఐశ్వర్య మాట్లాడుతుంది. అది విన్న స్వాతి తిడుతుంది.

ఎదురు తిరిగిన ఇందు

రాత్రి చేసిన దాని గురించి చెబుతుంది స్వాతి. నీ హద్దుల్లో ఉండు అని ఐశ్వర్య అంటే.. నేను హద్దుల్లోనే ఉన్నా. నిన్న పోలీస్ స్టేషన్‌లో నీ బిహేవియర్ ఎంత చీప్‌గా ఉందో తెలుసా అని స్వాతి అంటుంది. దాంతో కోపంగా స్వాతిని ఐశ్వర్య కొట్టబోతుంటే ఇందు వచ్చి చేయి పట్టుకుని ఆపుతుంది. ఐశ్వర్యకు ఎదురుతిరుగుతుంది ఇందు. అది రేఖ చూస్తుంది.

రేఖను చూసి మళ్లీ ఆగిపోతుంది ఇందు. అది చిన్న పిల్ల దాన్ని కొడతావేంటీ అని ఇందు అంటే.. నీలాగే నీతులు చెబుతుందని ఐశ్వర్య అంటే.. దారి తప్పుతుంది నువ్వు. ఒక తల్లికి పుట్టకపోయిన మనం తోడబుట్టినవాళ్లం అని ఇందు అంటుంది. చాలు ఆపు మా నాన్నను, నానమ్మను మీ అమ్మనాన్నే చంపారు. నిన్ను చూసినప్పుడుల్లా అదే గుర్తుకు వస్తుంది. నువ్వు నేను సమానం కాదు. నేను ఇంటి మహారాణి నువ్వు పని మనిషివి అని ఐశ్వర్య అంటుంది.

దాంతో అపర్ణ వచ్చి తిడుతుంది. పొగరుగా మాట్లాడటం కరెక్ట్ కాదని అంటుంది. మర్యాదగా మాట్లాడను, ఏం చేస్తావ్ అని ఐశ్వర్య అంటుంది. నానమ్మతో గౌరవంగా మాట్లాడమని అంటుంది ఇందు. ఛీ కొట్టిన కలుపుకుపోదామని వస్తారేంటీ అని ఐశ్వర్య అంటే.. వాళ్లు అంతేనని భ్రమరాంబ అంటుంది. ఐశ్వర్యకు సపోర్ట్ చేస్తావేంటీ అని స్వాతి అంటుంది.

ఐశ్వర్యను మార్చలేవు

తన మాటలతో స్వాతిని పాడు చేసిందని ఐశ్వర్య అంటుంది. వీళ్లను ఇంట్లో పెట్టుకోవడం కూడా తప్పే అని ఐశ్వర్య అంటే.. కరెక్టుగా చెప్పావ్ అని రేఖ ఎంట్రీ ఇస్తుంది. బతకమని వదిలేసిన బుద్ధి మాత్రం రాలేదు. నేను మాట్లాడతను నువ్వు వెళ్లు అని రేఖ అనడంతో ఐశ్వర్య వెళ్లిపోతుంది. శివరాం ఇంటికి వంట చేయడానికి వెళ్లాలిగా అని ఇందుకు గుర్తు చేసి పంపిస్తుంది రేఖ.

దాని అక్కే దాన్ని తిడుతుంటే చూడలేకపోతున్నావా. ఐశ్వర్యను మార్చలేవు. దానిలో ఉంది మా అన్న రక్తం అని అపర్ణతో రేఖ అంటుంది. గదిలోకి వెళ్లిన అపర్ణ కావ్య, స్వప్న, అప్పు ఎలా ఉండేవారో గుర్తు చేసుకుంటుంది. ఏమైందని సుభాష్ అడిగితే అదే చెబుతుంది. వాళ్ల పిల్లలు మాత్రం ఇలా ఉన్నారని బాధపడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More