Brahmamudi March 9 Episode: రేఖ శాడిజం.. ఐశ్వర్య పార్టీకి లక్షలు.. సుభాష్ సర్జరీకి డబ్బుల్లేవంటూ.. మోసంలో ఆరితేరిన రాజు

బ్రహ్మముడి సీరియల్ మార్చి 9 ఎపిసోడ్ లో రేఖ తన శాడిజం చూపిస్తుంది. తన అన్న కూతురు ఐశ్వర్య పార్టీకి లక్షలు ఇచ్చేసి.. సుభాష్ సర్జరీకి మాత్రం డబ్బుల్లేవంటుంది. అంతేకాదు మరికొన్ని రోజుల్లో ఇందు ఆస్తి తనదే అంటూ అటు చక్రిని బోల్తా కొట్టిస్తుంది.

Published on: Mar 9, 2026, 07:15:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ మార్చి 9 ఎపిసోడ్ లో ఐశ్వర్య చీటింగ్ చేస్తూ పట్టుబడటం, ఎగ్జామ్ రాసొచ్చి రేఖకు ఇందు దొరికిపోవడం, అటు నకిలీ ల్యాప్‌టాప్ ను రాజు అమ్మేయడం, చివరికి ఇందు ఆస్తి మొత్తం కాజేయాలని చూసే రేఖ.. సుభాష్ సర్జరీకి మాత్రం డబ్బుల్లేవంటూ ఇందుపై అరవడంలాంటివి చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi March 9 Episode: రేఖ శాడిజం.. ఐశ్వర్య పార్టీకి లక్షలు.. సుభాష్ సర్జరీకి డబ్బుల్లేవంటూ.. మోసంలో ఆరితేరిన రాజు
Brahmamudi March 9 Episode: రేఖ శాడిజం.. ఐశ్వర్య పార్టీకి లక్షలు.. సుభాష్ సర్జరీకి డబ్బుల్లేవంటూ.. మోసంలో ఆరితేరిన రాజు

చీటింగ్ చేస్తూ పట్టుబడ్డ ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ ఎగ్జామ్ హాల్లో చీటింగ్ చేస్తూ ఐశ్వర్య పట్టుబడే సీన్ తో మొదలవుతుంది. చిట్టీ చూస్తూ రాస్తుండగా ఇన్విజిలేటర్ ఆమెను పట్టుకుంటాడు. అయినా కూడా ఐశ్వర్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. మీరు ఎగ్జామ్ రాసివ్వకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.. బయట ఎన్నో సర్టిఫికెట్లు దొరుకుతాయి అని అంటుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చిట్టీలు ఉన్నాయంటూ వాళ్లనూ ఇరికించి తనతోపాటు తీసుకెళ్తుంది.

కంపెనీ రాసివ్వమన్న చక్రి.. రేఖ రివర్స్ ప్లాన్

మరోవైపు చక్రి దగ్గర రూ.10 కోట్లు అప్పు చేసిన భూషణ్ పూర్తిగా ఇరుక్కుంటాడు. డబ్బు ఇవ్వకపోతే తన కంపెనీ రాసివ్వమంటాడు. సంతకం పెట్టాలంటాడు. దీంతో రేఖ రివర్స్ గేమ్ ఆడుతుంది. సంతకం పెట్టమని భూషణ్ కు చెబుతుంది. అది విని చక్రి షాకవ్వగా.. అతని కంపెనీ నష్టాల్లో ఉందని చెబుతుంది. అలాంటి కంపెనీ తీసుకొని ఏం చేస్తావని అడుగుతుంది.

మరికొన్ని రోజుల్లో ఇందు తన ఆస్తిని మొత్తం తనకు రాసివ్వబోతోందని, ఆ తర్వాత ఎన్నో కాంట్రాక్టులు నీ సొంతమవుతాయని చక్రికి ఆశ చూపిస్తుంది. దాంతో పోలిస్తే ఈ రూ.10 కోట్లు ఎంత? భూషణ్ కంపెనీ తీసుకుంటానంటే తీసుకో అంటుంది. దీంతో చక్రి వద్దంటాడు. రేఖ మాటలను నమ్ముతాడు. ఆ ఆస్తి తన సొంతం కావాలంటే మరో రూ.2 కోట్లు కావాలంటూ ఆ డబ్బును కూడా చక్రి దగ్గరే వసూలు చేయడం విశేషం.

నకిలీ ల్యాప్‌టాప్ అమ్మేసిన రాజు

ఇటు రాజు తన తెలివితేటలను ఉపయోగించి నకిలీ ల్యాప్‌టాప్ ను జాన్సన్ అనే వ్యక్తికి అంటగట్టాలని ప్లాన్ చేస్తాడు. అతన్ని ఖరీదైన హోటల్ కు పిలుస్తాడు. అప్పటికే అతని ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. కనీసం వాళ్ల దగ్గర హోటల్లో తాగిన టీకి కూడా కట్టడానికి డబ్బులు ఉండవు. అయితే జాన్సన్ రాగానే అతని చేతుల్లో ల్యాప్‌టాప్ పెడతాడు. అతడు దాని గురించి ప్రశ్నలు అడుగుతుంటే.. నువ్వు కొనేలా లేవని, మా డాడీ రెండు నెలల కిందటే అమెరికా నుంచి పంపించిన ఈ రూ.2 లక్షల ల్యాప్‌టాప్ ను రూ.50 వేలకే ఇస్తుంటే ఏవేవో అడుగుతున్నావని రాజు అంటాడు. లే

చి వెళ్లిపోతుంటే.. తనకు ల్యాప్‌టాప్ కావాలంటూ ఆ వ్యక్తి అప్పటికప్పుడు రూ.50 వేలు ఇచ్చేస్తాడు. చివరికి హోటల్ బిల్లు కూడా అతనితోనే కట్టించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత చూస్తే ల్యాప్‌టాప్ ఆన్ కూడా కాదు. తాను మోసపోయానని తెలుసుకొని రాజుకు ఫోన్ చేస్తే అతడు మరింత వెటకారంగా మాట్లాడతాడు.

రేఖ దగ్గర దొరికిపోయిన ఇందు

మరోవైపు ఇందును రోడ్డుపై చూస్తుంది రేఖ. అక్కడే నిలదీద్దామనుకొని తర్వాత ఇంటికి రానీ అని అనుకుంటుంది. ఆమె ఇంటికి రాగానే ఎక్కడికెళ్లావని అడుగుతుంది. స్వాతి తన డ్రెస్సు కుట్టించుకొని రమ్మంటే టైలర్ దగ్గరికి వెళ్లానని చెబుతుంది. భ్రమరాంబ కూడా అదే నిజమని అంటుంది. అయినా రేఖ మాత్రం నమ్మదు. ఇందుపై అనుమానంతో టైలర్ కు కూడా ఫోన్ చేస్తుంది.

ఇటు సుభాష్ ను చూసిన డాక్టర్ సర్జరీ చేయాల్సిందే అని, రూ.15 లక్షలు అవసరమవుతాయని చెబుతాడు. ఆ డబ్బు ఇవ్వమని రేఖను అడుగుతుంది ఇందు. ఆమె కళ్ల ముందే ఐశ్వర్య పార్టీ కోసం రూ.లక్ష ఇచ్చే రేఖ.. సుభాష్ సర్జరీకి డబ్బుల్లేవని, అయినా ఆ ముసలోడు ఇప్పుడు లేచి నడిచి ఎవరిని ఉద్దరిస్తాడంటూ మాట్లాడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More