Brahmamudi March 7th Episode: ఇందు,రాజు మధ్య బ్రహ్మముడి.. రోడ్డుపైనే చేతిలో చేయేసి.. చీటింగ్ చేస్తూ పట్టుబడ్డ ఐశ్వర్య
Brahmamudi March 7th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 7 ఎపిసోడ్ లో ఇందు దెబ్బకు రాజు పారిపోతాడు. ఈ క్రమంలో ఇద్దరూ చేతిలో చేయేసి ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటారు. అటు ఎగ్జామ్ హాల్లో ఐశ్వర్య చీటింగ్ చేస్తూ దొరికిపోతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు ఎలాగాలో ఎగ్జామ్ రాస్తుంది. ఈ క్రమంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా అన్నింటినీ దాటుతుంది. చివరికి ఇంట్లో రేఖకు దొరికిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

తల్లిని రెచ్చగొట్టి బోల్తా కొట్టించిన స్వాతి
బ్రహ్మముడి సీరియల్ మార్చి 7 ఎపిసోడ్ ఇందు కోసం తల్లితో స్వాతి నాటకమాడే సీన్ తో మొదలవుతుంది. ఎగ్జామ్ టెన్షన్ లో ఉన్న ఇందును బయటకు పంపించడానికి తన డ్రెస్సు కుట్టించుకొని రావాలని స్వాతి ఆర్డర్ వేస్తుంది. తన తల్లిలాగే మాట్లాడుతూ ఇందును డామినేట్ చేయాలని చూస్తుంది. అది చూసి భ్రమరాంబ షాక్ తింటుంది.
ఓ దశలో ఒసెయ్ ఇందు అంటూ పూర్తిగా తల్లిని నమ్మించే ప్రయత్నం చేస్తుంది. డ్రెస్సును టేలర్ దగ్గరికి తీసుకెళ్లే క్రమంలో ఎగ్జామ్ రాసి వచ్చేయొచ్చన్నది ఇద్దరి ప్లాన్. రేఖ ఆంటీ బయటకు వెళ్లొద్దని చెప్పింది కదా అని ఇందు అంటున్నా.. స్వాతి రెచ్చగొట్టడంతో భ్రమరాంబ ఆమెను పంపిస్తుంది. దీంతో ఇందు, స్వాతి ప్లాన్ వర్కౌట్ అవుతుంది.
రాజు, ఇందు గొడవ..
ఎగ్జామ్ కోసం కారులో వెళ్తున్న ఇందుకు రాజు అడ్డు పడతాడు. బైకుపై వచ్చి కారును కావాలని ఢీకొట్టి రూ.20 వేలు వసూలు చేయడానికి ప్లాన్ చేస్తాడు. కారును ఢీకొట్టి పడిపోగానే కాలు విరిగింది.. ఎమ్మారై స్కాన్ కావాలి.. అంటూ హడావిడి చేస్తాడు. డ్రైవర్ ను బెదిరిస్తాడు. చుట్టూ ఉన్న వాళ్లు కూడా అతనికి సపోర్ట్ చేస్తారు.
పోలీసులంటూ భయపెట్టిన ఇందు
దీంతో ఇందు బయటకు దిగుతుంది. నువ్వే రాంగ్ రూట్ లో వచ్చి ఢీకొట్టావని రాజును బెదిరిస్తుంది. నువ్వే రూ.20 వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుంది. కారులో ఉన్న డాష్ బోర్డు కెమెరాను చూపించి అందులో మొత్తం రికార్డయింది.. పోలీసులకు చూపిస్తాను.. వాళ్లే ఎవరిది తప్పో చెబుతారని అనగానే అందరూ పారిపోతారు. రాజు డిఫెన్స్ లో పడిపోతాడు.
అతని ప్లాన్ బెడిసి కొడుతుంది. ఈ క్రమంలో రాజు కింద పడిపోతుండగా ఇందు పట్టుకుంటుంది. రోడ్డుపైనే ఇద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకుంటారు. బావమరదళ్లు భవిష్యత్తులో ఒక్కటి కావడానికి ఇప్పుడు పునాది పడినట్లుగా బ్యాక్‌గ్రౌండ్ లో బ్రహ్మముడి సాంగ్ వస్తుంది. ఆ తర్వాత రాజు అక్కడి నుంచి పారిపోతాడు.
ఐశ్వర్య ఎగ్జామ్ రాసే గదిలోనే ఇందు
ఆ తర్వాత ఇందు ఎగ్జామ్ సెంటర్ కు వెళ్తుంది. డ్రైవర్ ను బోల్తా కొట్టించి అతన్ని పంపించి సెంటర్లోకి అడుగుపెడుతుంది. అప్పటికే ఐశ్వర్య అక్కడ తన షర్ట్ లో చిట్టీలను దాచుకొని వస్తుంది. ఆమె ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తారు. అయితే ఐశ్వర్య ఉన్న గదిలోనే ఇందు కూడా ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది.
దీంతో మాస్క్ తో ఆమె లోనికి వెళ్తుంది. అయితే ఇన్విజిలేటర్ ఇందును మాస్క్ తీయాల్సిందిగా చెప్పడంతో భయపడుతుంది. వైరల్ ఫీవర్ అని చెబుతుంది. హాల్ టికెట్ చెక్ చేయాలని అంటే.. ఐశ్వర్యకు కనిపించకుండా మాస్క్ తీసి ఇన్విజిలేటర్ కు ముఖం చూపిస్తుంది.
చీటింగ్ చేస్తూ దొరికిపోయిన ఐశ్వర్య
ఎగ్జామ్ మొదలవుతుంది. ముందుగానే చిట్టీలు తెచ్చుకున్న ఐశ్వర్య వెంటనే తన పని మొదలుపెడుతుంది. అయితే ఆ చిట్టీలు మైక్రో జిరాక్స్ కావడంతో అందులో ఏముందో సరిగా కనిపించదు. నేనేమైనా సాయం చేయాలా అంటూ ఇన్విజిలేటర్ అడగడంతో ఆమె షాక్ తింటుంది. చీటింగ్ చేస్తూ దొరికిపోతుంది.
మరోవైపు ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన ఇందును రేఖ నిలదీస్తుంది. ఎక్కడికెళ్లావ్.. ఆఫీసు నుంచి వస్తుంటే రోడ్డుపై కనిపించావని అంటుంది. తాను టేలర్ దగ్గరికి వెళ్లానని చెబితే.. ఆ షాపు పేరేంటి? నంబర్ ఏంటి అని అడుగుతుంది. ఇందు దొరికిపోతుందేమో అని టెన్షన్ ఉండగా బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


