బ్రహ్మముడి మార్చి 6 ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌కు రాజు, ఇందు.. స్వాతి అదిరిపోయే ప్లాన్.. రేఖ, భ్రమరాంబను బోల్తా కొట్టించి..

బ్రహ్మముడి సీరియల్ మార్చి 6 ఎపిసోడ్ లో రేఖ, భ్రమరాంబను బోల్తా కొట్టించి పరీక్ష రాయడానికి వెళ్తుంది ఇందు. అయితే మధ్యలో రాజుతో యాక్సిడెంట్ కావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగి అది కాస్తా పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది.

Mar 6, 2026, 07:52:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు మార్చి 6 ఎపిసోడ్ లో ఇందుతోపాటు పెద్దయిన తర్వాత రాహుల్ కూతురు ఐశ్వర్య, భ్రమరాంబ కూతురు స్వాతిలను కూడా పరిచయం చేశారు. అయితే ఇందుకి స్వాతి సపోర్ట్ గా ఉండటం చూడొచ్చు. ఐశ్వర్య మాత్రం తన తండ్రిలాగే అవతలి వాళ్లను మోసం చేసే బుద్దులే వస్తాయి.

బ్రహ్మముడి మార్చి 6 ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌కు రాజు, ఇందు.. స్వాతి అదిరిపోయే ప్లాన్.. రేఖ, భ్రమరాంబను బోల్తా కొట్టించి..
బ్రహ్మముడి మార్చి 6 ఎపిసోడ్: పోలీస్ స్టేషన్‌కు రాజు, ఇందు.. స్వాతి అదిరిపోయే ప్లాన్.. రేఖ, భ్రమరాంబను బోల్తా కొట్టించి..

రాజుకు క్లాస్ పీకిన తండ్రి

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మార్చి 6) ఎపిసోడ్ రాజుకి అతని తండ్రి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. షార్ట్ కట్ లో కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఆలోచనతో ఉంటాడు రాజు. మరోవైపు అతని తమ్ముడు మాత్రం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. తమ్ముడిని చూపించి రాజును తండ్రి తిడతాడు.

నీకంటే వయసులో చిన్నవాడైనా ఉద్యోగం చేస్తూ తనకు తోడుగా ఉంటున్నాడని అంటాడు. కానీ రాజు మాత్రం మీలాంటి మిడిల్ క్లాస్ జీవితం తనకొద్దని, ఏదో రోజు బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదిస్తానని చెబుతాడు. రాజుకు తోడుగా అతని ఫ్రెండ్ కూడా అలాగే బలాదూర్ తిరుగుతుండటంతో ఇద్దరినీ కలిపి రాజు తండ్రి తిడతాడు.

భూషణ్‌కు రేఖ క్లాస్.. ఇందులో ఎగ్జామ్ టెన్షన్

మరోవైపు ఇంట్లో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తూ ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది. రేఖ ఆంటీ ఇంకా ఆఫీసుకు వెళ్లడం లేదు.. తనకు ఎగ్జామ్ టైమ్ అవుతుందని అనుకుంటుంది. అప్పుడే రేఖ టిఫిన్ చేయడానికి వస్తుంది. ఆమె వెంటే భూషణ్ కూడా వస్తాడు. ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటని అతనికి రేఖ క్లాస్ పీకుతుంది.

ఆ అప్పు ఇచ్చిన చక్రి దగ్గరికి వెళ్లి మేనేజ్ చేయమని చెప్పాను కదా.. నువ్వు చేసిన అప్పులే ఇవన్నీ.. ఆ క్లబ్ కి వెళ్లి పేకాట ఆడి మొత్తం పోగొట్టుకుంటున్నానవని తిడుతుంది. తన ఎగ్జామ్ టైమ్ అవుతుండటంతో రాహుల్ కూతురు ఐశ్వర్యకు ఎగ్జామ్ ఉన్న విషయం గుర్తు చేస్తే రేఖ తొందర పెడుతుంది కదా అనుకొని ఇందు ఆమెకు చెబుతుంది.

రేఖ దగ్గర కవర్ చేసిన ఐశ్వర్య

అయితే ఐశ్వర్య ఇంకా నిద్ర లేవలేదని ఇందు అంటుంది. దీంతో రేఖ పరుగెత్తుకొని వెళ్తుంది. అప్పుడే నిద్ర లేచిన ఐశ్వర్య పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రేఖ రావడం గమనించి వెంటనే బుక్స్ తీసుకొని చదువుతుంది. కానీ ఆరోజు ఉన్న ఎగ్జామ్ ఒకటైతే ఆమె మరో సబ్జెక్ట్ చదువుతూ దొరికిపోతుంది. రాత్రి పార్టీ నుంచి 3 గంటలకు వచ్చానని రేఖకు చెబుతుంది. మరి ఎగ్జామ్ ఎలా రాస్తావని అడిగితే.. ఏదో ఒకటి చేస్తానని అంటుంది. దీనికి అన్నీ తన అన్నయ్య రాహుల్ బుద్ధులే వచ్చాయని రేఖ అంటుంది.

షార్ట్ కట్‌లో రాజు డబ్బు సంపాదన

ఇటు షార్ట్ కట్ లో డబ్బు సంపాదించి గొప్పవాడిని కావాలని అనుకునే రాజు ఓ పాత ల్యాప్‌టాప్ ను రిపేర్ చేయించి రూ.50 వేలకు అమ్ముతున్నట్లు జెడ్‌ఎల్ఎక్స్ లో పెడతాడు. అందుకు తగినట్లే కస్టమర్లతోనూ ఫోన్లలో మాట్లాడుతూ బోల్తా కొట్టిస్తుంటాడు. ఓ కస్టమర్ కాల్ చేస్తే ఓ ఖరీదైన హోటల్ పేరు చెప్పి అక్కడికి రావాలని, అక్కడే ల్యాప్ టాప్ ఇస్తానని అంటాడు. అది విని అతని ఫ్రెండ్ కంగారు పడితే.. ఇలా చేస్తేనే వాళ్లు మనల్ని నమ్ముతారని రాజు చెబుతాడు. రాజు దగ్గర ఉన్న ఈజీగా డబ్బు సంపాదించే తెలివితేటలు చూసి అతని ఫ్రెండ్ షాక్ తింటాడు.

కృష్ణుడికి ఇందు కంప్లైంట్.. స్వాతి అదిరిపోయే ప్లాన్

ఇంట్లో కృష్ణయ్య దగ్గరికి వచ్చి ఇందు బాధపడుతుంటుంది. అసలు నీకు మానవత్వం ఉందా.. ఎంత పని ఉన్నా ముందుగా నీకే పూజ చేస్తాను.. కానీ ఇవాళ ఎగ్జామ్ ఉంటే నాకు ఏమాత్రం సాయం చేయడం లేదని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడే నీకు అభయం ఇస్తున్నానంటూ కృష్ణుడు మాట్లాడినట్లుగా భ్రమరాంబ కూతురు స్వాతి మాట్లాడుతుంది.

దీంతో ఇందు ఆమె చెవి పట్టుకొని నన్నే ఆట పట్టిస్తావా అని అంటుంది. నిన్ను ఎగ్జామ్ కు పంపే బాధ్యత తనదని స్వాతి చెబుతుంది. మీ అమ్మ అక్కడే ఉందిగా అంటూ అపర్ణ వస్తుంది. ఆమెనే పంపించేలా తాను ప్లాన్ చేస్తానని, తన బట్టలు నీకు ఇచ్చి బయటకు పంపిస్తానని అంటుంది. ఇద్దరూ హాల్లోకి వెళ్లి నాటకం మొదలుపెడతారు.

రాజు, ఇందు గొడవ

ఎగ్జామ్ కని కారులో బయలుదేరుతుంది ఇందు. అప్పుడే రాజు తన బైకుపై వస్తుంటాడు. రాంగ్ రూట్ లో వచ్చి ఇందు కారును ఢీకొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తన కాలు విరిగిందని రాజు నాటకం ఆడుతుంటే.. తప్పంతా నీదే పోలీస్ స్టేషన్ కు వెళ్దామని ఇందు అంటుంది. దీంతో రాజు కంగారు పడతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More