...
...
Next Story

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి.. ఇందు యుద్ధం.. రాజు సాయం.. రేఖకు షాక్ ఇచ్చిన ఐశ్వర్య.. కిడ్నాప్‌తో ట్విస్ట్

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 2 ఎపిసోడ్ లో ఇందు యుద్దానికి సిద్ధమవుతున్నా ఒంటిరిని అయిపోయానని కృష్ణయ్యకు మొరపెట్టుకుంటుంది. అయితే ఆ సాయం పరోక్షంగా కిడ్నాప్ రూపంలో రాజు చేయబోతన్నాడని తేలిపోయింది.

Published on: Apr 2, 2026, 07:56:05 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రేఖకు ఐశ్వర్య గట్టి షాకే ఇవ్వబోతున్నట్లు తేలింది. ఇందుని రాజు ద్వారా కిడ్నాప్ చేయించి తనకు కావాల్సిన డబ్బును సంపాదించాలని భావిస్తుంది. అటు రాజు, లక్కీ కూడా సాహు భయంతో దీనికి ఒప్పుకుంటారు.

సంతకం పెట్టొద్దని చెప్పిన అపర్ణ.. ధైర్యం చెప్పిన ఇందు

Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి.. ఇందు యుద్ధం.. రాజు సాయం.. రేఖకు షాక్ ఇచ్చిన ఐశ్వర్య.. కిడ్నాప్‌తో ట్విస్ట్
Brahmamudi April 2nd Episode: బ్రహ్మముడి.. ఇందు యుద్ధం.. రాజు సాయం.. రేఖకు షాక్ ఇచ్చిన ఐశ్వర్య.. కిడ్నాప్‌తో ట్విస్ట్

బ్రహ్మముడి సీరియల్ గురువారం (ఏప్రిల్ 2) ఎపిసోడ్ ఇందుకి అపర్ణ క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావ్.. ఆ రేఖ ఓ పాము.. రెండు మాటలు బాగా మాట్లాడి.. నాలుగు బట్టలు తెచ్చి తినిపిస్తే ఆమె గుణం మరచిపోయావా అని నిలదీస్తుంది. కానీ ఇందు మాత్రం రేఖ ఏం చేస్తుందో తనకు తెలుసు అని, తన పుట్టిన రోజు నాడు ఆస్తి పత్రాలపై సంతకం కోసమే ఇలా చేస్తోందని అంటుంది.

మరి సంతకం పెడతావా అని అపర్ణ అడుగుతుంది. మిమ్మల్ని కాపాడుకోవడమే తన లక్ష్యమని ఇందు చెబుతుంది. సంతకం పెట్టకుండా ఎలా కాపాడుకోవాలన్నదే ఆలోచిస్తున్నానని అంటుంది. ఎప్పుడో ప్రమాదంలో చనిపోవాల్సిన వాళ్లం.. ఇంకా బతికి ఉన్నామంటే ఏదో సాధించడానికే.. ఇంత వరకూ కోల్పోయిందే ఎక్కువ.. ఇక అంతా సాధించాల్సిందే అని స్పష్టం చేసి వెళ్లిపోతుంది. ఈ యుద్ధంలో ఇందు ఒంటరిగా మిగిలిపోయిందని సుభాష్, అపర్ణ బాధపడతారు.

రేఖను నిలదీసిన భ్రమరాంబ

అటు భ్రమరాంబ వెళ్లి రేఖను నిలదీస్తుంది. అసలు ఏం చేస్తున్నావ్.. ఆ ఆస్తి నీదని చెప్పే నా తమ్ముడిని పెళ్లి చేసుకున్నావ్.. తర్వాత ఇందు పేరు మీద ఉందని తెలిసింది.. సరే 20 ఏళ్లు ఆగిన తర్వాతైనా వస్తుంది కదా అని అనుకుంటే.. ఇప్పుడు దానిపై అంతలా ప్రేమ కురిపిస్తున్నావ్.. నీ తల్లి, అన్నలను చంపిన కావ్య కూతురు అది.. దానిపై అంత ప్రేమ ఎందుకు అని అడుగుతుంది.

మరోవైపు రాజు, లక్కీ నిండా మునిగామంటూ ఏడుస్తూ మందు తాగుతుంటారు. రూ.10 వేల కోసం వెళ్తే రూ.10 లక్షల కోసం ఇరుక్కున్నామని బాధపడతారు. అయితే ఆ ఇందు ఎప్పుడు కలిసినా తమకు ఇలాంటి బాధలే వస్తున్నాయని, అది మన పాలిట యమగండం అని, రాహువు అని రాజు తిడతాడు. అప్పుడే ఆమెకు ఫోన్ చేసి తిడతాడు. నీవల్లే తమకన్నీ కష్టాలు ఎదురవుతున్నాయని అంటాడు. దీంతో ఇందు కూడా అతనిపై మండిపడుతుంది.

రేఖను డబ్బులు అడిగిన ఐశ్వర్య

ఇటు రాకేష్ కు ఇవ్వాల్సిన డబ్బు కోసం ఐశ్వర్య టెన్షన్ పడుతుంది. నెక్లెస్ ప్లాన్ బెడసికొట్టడంతో నేరుగా రేఖను వెళ్లి డబ్బులు అడుగుతుంది. సరే ఇస్తాను కానీ కారణం ఏంటో చెప్పు అని ఆమె అడుగుతుంది. అసలు కారణం ఏంటో చెబితే తాను మరింత లోకువ అయిపోతానని ఐశ్యర్య చెప్పలేకపోతుంది. రేఖ డబ్బు ఇవ్వనని అంటుంది. మరోసారి ఆమె తండ్రి రాహుల్ తో పోలుస్తూ తిడుతుంది. దీంతో ఐశ్వర్య కోపంగా వెళ్లిపోతుంది.

కృష్ణయ్యకు మొరపెట్టుకున్న ఇందు

ధర్మయుద్ధం చేస్తున్నా తనకు సాయం చేసే వాళ్లు లేరని కృష్ణయ్యతో మొర పెట్టుకుంటుంది ఇందు. సంతకం పెట్టొద్దని నాన్నమ్మ అంటుంది.. పెట్టకపోతే వాళ్ల ప్రాణాలు పోతాయి.. ఏం చేయాలి.. నన్ను బతికించింది ఇలా ఓడిపోతూ తలదించుకోవడానికా.. ఈ యుద్ధంలో నాకు సాయం చేయు అని వేడుకుంటుంది.

అటు డబ్బు కోసం సాహు.. రాజు తమ్ముడు వెంకీకి యాక్సిడెంట్ చేయిస్తాడు. తర్వాత రాజును బెదిరిస్తాడు. ఈసారి మీ అమ్మానాన్నలపైకి బుల్డోజర్ వస్తుందని అంటాడు. దీంతో ఆ రూ.10 లక్షల కోసం ఐశ్వర్య ఇచ్చిన ఆఫర్ ను రాజు తీసుకుంటాడు. ఎవరిని కిడ్నాప్ చేయాలని అడిగితే.. ఇందు ఫొటో చూపిస్తుంది ఐశ్వర్య. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్న ఇందుకు పరోక్షంగా ఐశ్వర్య, రాజు ఇలా సాయం చేయబోతున్నట్లుగా ఓ ట్విస్ట్ ఎదురైంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగిసింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe