Brahmamudi April 3rd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో డబ్బు కోసం ఇటు ఐశ్వర్య.. అటు రాజు, లక్కీ ఓ సాహసం చేయడానికి సిద్ధమవుతారు. అటు రేఖ అడిగినట్లు సంతకం పెట్టాలా వద్దా అని తేల్చుకోలేక ఇందు మథనపడుతుంది. అయితే ఇందుని కిడ్నాప్ చేయాలన్న ఐశ్వర్య నిర్ణయం, దానికి రాజు ఓకే చెప్పడం పరోక్షంగా ఇందుకి సాయం చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
ఐశ్వర్యకు ఫోన్ చేసి బెదిరించిన రాకేష్

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (ఏప్రిల్ 3) ఎపిసోడ్ ఐశ్వర్యకు రాకేష్ ఫోన్ చేసి డబ్బు కోసం బెదిరించే సీన్ తో మొదలవుతుంది. ఒక్క రోజే టైమ్ ఇస్తున్నాను.. డబ్బు ఇవ్వకపోతే ఇంటికి వచ్చి మీ ఆంటీతోనే మాట్లాడతా అని అంటాడు. కిడ్నాప్ చేసుకుంటావో, ఇంకేం చేసుకుంటావో నీ ఇష్టం.. నాకు డబ్బు కావాలని ఫోన్ పెట్టేస్తాడు. దీంతో ఐశ్వర్య కంగారు పడుతుంది.
ఇందు కిడ్నాప్ కోసం ఐశ్వర్య ప్లాన్.. లక్కీకి ఫోన్
అప్పుడే స్వాతితో కలిసి ఇందు బయట కూర్చొని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక్క రోజే టైమ్ ఉండటంతో రేఖ అడిగినట్లు సంతకం పెట్టాలా వద్దా అని ఇందు ఆలోచిస్తుంటే స్వాతి ఆమెకు ధైర్యం చెబుతుంది. అదే సమయంలో అటు రాజు, లక్కీ కూడా డబ్బు గురించి ఆలోచిస్తుంటారు.
అప్పుడే ఐశ్వర్యకు లక్కీ మెసేజ్ పెడతాడు. తన ముందే కూర్చొన్న ఇందును చూసిన ఐశ్వర్యకు లక్కీ మెసేజ్ తో ఓ ఆలోచన వస్తుంది. ఆమెను కిడ్నాప్ చేయించాలని, దానికి లక్కీ సాయం తీసుకోవాలని అనుకుంటుంది. వెంటనే లక్కీ ఫోన్ చేసి కలవాలని చెబుతుంది.
వెంకీకి యాక్సిడెంట్.. నందు సేవలు
మరోవైపు తన ప్రేయసి రోజాతో కలపాలని నందును అడుగుతుంటాడు వెంకీ. ఈ క్రమంలో ఆమెతో గొడవ జరుగుతుంది. ఇద్దరినీ కలపను ఏం చేసుకుంటావో చేసుకో పో అని నందు అంటుంది. దీంతో వెంకీ కోపంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే ఓ కారు వచ్చి అతన్ని ఢీకొడుతుంది. అతడు కిందపడి గాయాలవుతాయి. దీంతో నందు అతనికి సేవలు చేస్తుంది. ప్రేమకు సాయం చేయనంటే ఇలా చేస్తావా అని తిడుతుంది. వాడెవడో కావాలనే అలా ఢీకొట్టి వెళ్లిపోయాడని వెంకీ అంటాడు.
ఇందు కిడ్నాప్ గురించి చెప్పిన ఐశ్వర్య
{{/usCountry}}మరోవైపు తన ప్రేయసి రోజాతో కలపాలని నందును అడుగుతుంటాడు వెంకీ. ఈ క్రమంలో ఆమెతో గొడవ జరుగుతుంది. ఇద్దరినీ కలపను ఏం చేసుకుంటావో చేసుకో పో అని నందు అంటుంది. దీంతో వెంకీ కోపంతో వెనక్కి తిరిగి వెళ్లిపోతుంటే ఓ కారు వచ్చి అతన్ని ఢీకొడుతుంది. అతడు కిందపడి గాయాలవుతాయి. దీంతో నందు అతనికి సేవలు చేస్తుంది. ప్రేమకు సాయం చేయనంటే ఇలా చేస్తావా అని తిడుతుంది. వాడెవడో కావాలనే అలా ఢీకొట్టి వెళ్లిపోయాడని వెంకీ అంటాడు.
ఇందు కిడ్నాప్ గురించి చెప్పిన ఐశ్వర్య
{{/usCountry}}ఇటు ఐశ్వర్యను రాజు, లక్కీ కలుస్తారు. లక్కీ ఆమెను ఫ్లర్ట్ చేస్తుంటే.. రాజు మాత్రం అసలు విషయం ఏంటో చెప్పు అని అడుగుతాడు. కానీ అసలు విషయం చెప్పిన తర్వాత వీళ్లు చేయకపోతే తన పరిస్థితి ఏంటో అని ఆందోళన చెందుతుంది. ముందు విషయం చెప్పు అని రాజు గట్టిగా అడగడంతో ఒకరిని కిడ్నాప్ చేయాలని అంటుంది.
చాలా డబ్బు వస్తుందని, వచ్చినదాంట్లో సగం సగం పంచుకుందామని చెబుతుంది. దీంతో రాజు, లక్కీ కంగారు పడతారు. ఇప్పటికే చాలా సమస్యల్లో ఉన్నాం.. ఇలాంటి కిడ్నాప్ లు చేసి జైలుకెళ్లే అవసరం లేదు అని చెప్పి రాజు, లక్కీ వెళ్లిపోతారు.
రాజు ఇంటికి వచ్చి మరీ బెదిరించిన సాహు
అటు రాజు ఇంటికి సాహు వస్తాడు. తాను రాజు ఫ్రెండ్ నంటూ చేపలు కూడా ఇంట్లో వాళ్లకు ఇస్తాడు. అతన్ని చూసి రాజు టెన్షన్ పడతాడు. రాజు తనతో కలిసి బిజినెస్ చేస్తాడని సాహు చెప్పడంతో ఏం బిజినెస్ అని చలపతి అడుగుతాడు. పౌడర్ బిజినెస్ అని సాహు అంటాడు. దీంతో రాజు, లక్కీ షాకవుతారు. అప్పుడే గాయాలతో ఉన్న వెంకీ ఇంటికి రావడంతో ఆ పని తాను చేసిందే అని సాహు చెబుతాడు.
డబ్బు ఇవ్వకపోతే ఇంట్లో వాళ్లపైకి బుల్డోజర్ వస్తుందని బెదిరిస్తాడు. దీంతో చేసేది లేక తిరిగి ఐశ్వర్య దగ్గరికి వెళ్లి కిడ్నాప్ చేయడానికి సిద్ధమని రాజు అంటాడు. ఇందు ఫొటో చూసి షాక్ తింటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.