Brahmamudi August 13 Episode: ఏడిపించిన కొడుకు, కరిగిన తల్లి మనసు- రేఖ గురించి తప్పుగా మాట్లాడిన మదన్- నట్టింట్లో డబ్బు

Brahmamudi Serial August 13th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 13వ ఎపిసోడ్‌‌లో శశి రివర్స్ అవుతాడు. ఐశ్వర్య నమ్ముతుంది. ఇందుకు తనకు వార్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు శశి. రేఖను కలిసిన లక్కీ తల్లి గురించి వెతకమని కాళ్లపై పడతాడు. మదన్ వచ్చి తన తల్లి గురించే తప్పుగా మాట్లాడుతాడు.

Published on: Aug 13, 2026, 09:29:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శశి ఇచ్చే గిఫ్ట్స్‌కి ఆశపడి నీకు పరిచయం చేశా. కానీ వాడు నిన్ను ప్రేమించట్లేదు, మోసం చేయాలని చూశాడని రేణు చెబుతుంది. నో, నువ్వు అబద్ధం చెబుతున్నావ్ అని ఐశ్వర్య అంటుంది. ఈ ఇందు నా ఫ్రెండ్‌ను భయపెట్టి ఇలా చెప్పిస్తుందంటుంది.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 13వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 13వ ఎపిసోడ్

రివర్స్ అయిన శశి

నిన్ను చాలా నమ్మానే. ఎవరికోసమే ఇలా చెబుతావా. నిన్ను కూడా నమ్మను అని ఐశ్వర్య అంటుంది. దాంతో శశిని తీసుకొచ్చి నిజం చెప్పమంటుంది నందు. నేను నిన్ను ప్రేమించట్లేదు. వీళ్లంతా చెప్పేది నిజమే. నేను నిన్ను మోసం చేయడానికే దగ్గరయ్యాను. అంతకుమించి నీ మీద ఫీలింగ్స్ లేవని శశి అంటాడు.

రేయ్ నువ్వు చదువుకున్నావుగా. కొంచమైనా సిగ్గులేదా అని అంతా తిడతారు. కేసు పెడతామంటారు. ఇందు గారు మీరు చెప్పినట్లే చెప్పాను, మీకు ఓకేనా అని ప్లేట్ ఫిరాయిస్తాడు శశి. నిన్న పార్టీకి వచ్చి నన్ను కొట్టి ఇలా చెప్పిమని బెదిరించారు. వీళ్లకు భయపడి ఇలా చెప్పాను. కానీ, నువ్వు లేకుండా నేను ఉండలేనని నాకు ఇప్పుడే అర్థమైంది. నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని శశి అంటాడు.

త్వరలోనే నీ గురించి ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకుందామనుకున్నాను. ఎవరి ఎలా బెదిరించినా మనల్ని ఆపలేరని శశి అంటాడు. రేయ్ ఆపరా, ఐషు వాడు మళ్లీ నిన్ను మోసం చేస్తున్నాడు. ఇప్పుడే ప్రూవ్ చేస్తానని సోషల్ మీడియాలో తన బర్త్ డే ఉంది. అది నిన్న కాదని చూపిస్తుంది ఇందు. నేను బర్త్ డే తప్పుగా ఎంటర్ చేశాను. దాంతో పనేముందని పట్టించుకోలేదని శశి అంటాడు.

నేను శశినే పెళ్లి చేసుకుంటా

నిన్ను నమ్ముతున్నాను శశి. వీళ్లు చెప్పేది అబద్ధమే అని ఐశ్వర్య అంటుంది. వీడు బాగా బలిసిన ఫ్యామిలీ ఉన్నట్టుంది. మనదారికే తెచ్చుకుందామనుకున్న భ్రమరాంబ ఇందును తిడుతుంది. శశికి సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా అచ్చం దీని అమ్మలాగే పైకి మంచిదానిలా నటిస్తూ ఇలా చేస్తుందని ఐశ్వర్య అంటుంది. ఇందు తల్లి గురించి తీస్తే ఊరుకోనన్న ఐషు మాట్లాడుతుంది.

ఇది నా జీవితం నాకు నచ్చిట్లే ఉంటాను. నేను శశినే పెళ్లి చేసుకుంటానంటుంది ఐశ్వర్య. శశికి రేఖ సారీ చెబుతుంది. శశి వెళ్లిపోతాడు. తర్వాత బయట శశిని నాటకాలు ఆడుతున్నావా అని ఇందు అంటుంది. అనవసరంగా నాకు తెలియకుండా నాతో పెట్టుకున్నావ్ అని శశి అంటే నీకు సరైనా బుద్ధి చెప్పకుండా వదలను అని ఇందు అంటుంది.

ఇప్పటివరకు ఐశ్వర్యను వాడుకుని వదిలేద్దామనుకున్నా. కానీ, నిన్న నువ్వు కొట్టావ్. నిన్ను నీ ఫ్యామిలీని అవమానేలా చేస్తాను. నీకు నాకు వార్ స్టార్ట్ అయింది. దానివల్ల మీ పరువుప్రతిష్టలు పోయేలా చేస్తాను. మీ కుటుంబాన్ని అందరిముందు తలదించుకునేలా చేస్తాను. నా నుంచి నీ ఫ్యామిలీని కాపాడుకో అని శశి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

రాజుకు క్లాస్ పీకిన ఇందు

తర్వాత బయట అంతా జరుగుతుంటే నాకెందుకు చెప్పాలని రాజు కోప్పడుతాడు. ప్రతిదానికి ప్లానింగ్ ఉండాలంటాడు. అక్కడే మీ అక్కకు రెండు తగిలించి మత్తు పోయేలా అక్కడే చూపించేదాన్ని అని రాజు అంటాడు. ఇంకా మాట్లాడితే కొడతాను. ముందు నీకే రాత్రి చెప్పాను. ఫుల్లుగా తాగి పక్కనపెట్టావ్ అని గుర్తు చేస్తుంది ఇందు.

నీకు వీళ్లకు ఎలాంటి అటాచ్‌మెంట్ లేదా. ఇలా తాగితే ఈ ఫ్యామిలీని ఎలా చూసుకుంటావ్ అని రాజుకు క్లాస్ పీకుతుంది. సరే నేను చూసుకుంటాను. ఐశ్వర్య భ్రమను తొలగిద్దాం. నేను ఉండగా నీకు కానీ నీ ఫ్యామిలీకి ఆ శశిగాడిని ఏం చేయనివ్వను. నేను చూసుకుంటానుగా. తప్పకుండా ఇంకో అవకాశం దొరుకుతుంది. అప్పుడు శశి గాడు ఏంటో ఐషుకు తెలిసేలా చేద్దామని రాజు ధైర్యం చెబుతాడు.

మరోవైపు రేఖతో లక్కీ మాట్లాడుతాడు. మీరు చెప్పినదానికి ఇంకా రెండు రోజులే ఉంది. మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా అని లక్కీ అడుగుతాడు. తనను తల్లి విషయంలో అంతా అవమానిస్తున్నారని, నన్నెందుకు చీదరించుకుంటున్నారని, ప్రతి క్షణం భయం భయంగా బతకాల్సి వస్తోందని లక్కీ ఏడుస్తూ చెబుతాడు.

ఏడిపించేసిన లక్కీ, కరిగిన తల్లి మనసు

పసికందుగా ఉన్న నన్ను ఎందుకు వదిలేసిందో నేను మా అమ్మను అడగాలి అని లక్కీ కన్నీళ్లు పెట్టుకుంటాడు. లక్కీ అంటూ రేఖ మనసు కరుగుతుంది. లక్కీవైపు జాలిగా చూస్తుంది రేఖ. దయచేసి మా అమ్మ ఎవరో కనుక్కోండని దండం పెడతాడు లక్కీ. కావాలంటే మీ కాళ్లు పట్టుకుంటానని తల్లి కాళ్లు పట్టుకుంటాడు లక్కీ.

రేఖ కూడా కరిగి లక్కీ అని లేపబోయి మళ్లీ ఆగిపోతుంది. అది చూసిన మదన్ కోపంగా వచ్చి లక్కీని లేపుతాడు. మీ అమ్మ ఎవరో నీకే తెలియదు. అది తెలుసుకోమ్మని మా మమ్మీ కాళ్లు పట్టుకుంటున్నావ్ నీకు సిగ్గు లేదా అని మదన్ అంటాడు. మదన్ కొంచెం మర్యాదగా మాట్లాడు అని రేఖ అంటుంది.

వీడు పుట్టగానే వదిలించుకుందంటే అర్థం కావట్లేదా వీడి పుట్టుకలోనే తప్పుందని. అది వీడికే అర్థం కావట్లేదు. అసలు నీ తప్పుడు తల్లి గురించి తెలుసుకుని నువ్వు సాధించేది ఏంట్రా అని తన తల్లి రేఖ గురించే ఇన్‌డైరెక్ట్‌గా తప్పుగా మాట్లాడుతాడు మదన్. దాంతో మదన్ కాలర్ పట్టుకుని ఏం మా అమ్మ తప్పుడిది కాదు. నన్ను వదిలేయడానికి తన కారణాలు తనకు ఉండుంటాయి. అంతేగాని మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అని లక్కీ అంటాడు.

మదన్‌కు మళ్లీ షాక్

అలా తల్లి ముందే ఇద్దరు కొడుకులు గొడవ పడతారు. ఎంత ధైర్యం ఉంటే నా షర్ట్ పట్టుకుంటావురా అని లక్కీని మదన్ కొట్టబోతే రేఖ చేయి పట్టుకుని ఆపుతుంది. దాంతో మదన్ షాక్ అవుతాడు. తనకు సాయం చేయకపోయినా పర్వాలేదు కానీ అవమానించకు. నువ్వు నోరు పారేసుకున్నావ్ అందుకే అలా చేశాడని లక్కీకి సపోర్ట్‌గా మాట్లాడుతుంది రేఖ.

నేను నీ కొడుకును నాకు సపోర్ట్ చేయాలని మదన్ అంటే.. కన్నతల్లి కాబట్టి సపోర్ట్ చేస్తుందని రాజు ఎంట్రీ ఇస్తాడు. రేఖ పిన్ని కూడా ఒక బిడ్డకు తల్లి కదా. లక్కీని అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తుందని రాజు అంటాడు. ఏం అర్థం కావట్లేదని మదన్ కోపంగా వెళ్తాడు.

నట్టింట్లో డబ్బు

తర్వాత నట్టింట్లో సోఫాపై భారీగా డబ్బు చూపిస్తాడు రాజు. నేను ఇందు కలిసి చేసిన మొదటి ప్రాజెక్ట్‌కు వచ్చిన లాభాలు. ఎప్పుడు నష్టాలు తప్పా ఇలా లాభాలు తెచ్చిపెట్టావా అని రేఖను అంటాడు రాజు. ఆ డబ్బుతో సుభాష్‌కు ఆపరేషన్ చేసి కాళ్లు రప్పించాలని ఇందు, రాజు అంటారు. అది కుదరదని రేఖ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More