Brahmamudi August 6 Episode: బ్రహ్మముడి- రేఖకు 2 రోజుల గడువు- మైలుతో రాజు ఎస్కేప్- లక్కీకి పెళ్లి చూపులు- ఐశ్వర్య అప్పు

Brahmamudi Serial August 6th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ ఎపిసోడ్‌‌లో రేఖ దగ్గరికి లక్కీ వచ్చి తన తల్లి గురించి అడుగుతాడు. రాజు వచ్చి రేఖకు రెండు రోజుల్లో లక్కీ తన కొడుకు అని చెప్పాలని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు. ఐశ్వర్య 3 లక్షల అప్పు చేసిన వ్యక్తి ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు.

Published on: Aug 6, 2026, 09:09:21 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీని ఎందుకు మాట్లాడట్లేదని నిలదీస్తుంది నందు. ఇంట్లో అమ్మానాన్న ఉన్నారు. సాయంత్రం మాట్లాడుదామని వెంకీ అంటే నందు వినదు. బైక్ ఎక్కి ఇప్పుడే మాట్లాడాలని పట్టుబడుతుంది.

బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 6వ ఎపిసోడ్

తల్లి గురించి తల్లినే అడిగిన లక్కీ

మరోవైపు రేఖతో లక్కీ మాట్లాడుతాడు. మా అమ్మ గురించి ఏమైనా తెలిసిందా. ఇలా అడగడం తప్పే. కానీ, అడగలేకపోతున్నా. అమ్మా అనే పిలుపు కోసం ప్రతి తల్లి ఆరాటపడుతుందంటారు. కానీ, మా అమ్మ ఎందుకు ఆ పిలుపు దూరం చేసుకుందో అర్థం కావట్లేదు అని తను పడిన బాధలు చెబుతాడు లక్కీ.

మా అమ్మ గురించి ఏమైనా తెలిస్తే చెప్పండి. జీవితాంతం రుణపడి ఉంటాను అని లక్కీ అంటాడు. ఇంతలో వచ్చిన రాజు అవునురా, మీది రుణానుబంధం. తల్లికి ఏ బిడ్డైనా జీవితాంతం రుణపడి ఉంటుడాగా అని అంటాడు. దాంతో రేఖ కోప్పడుతుంది. ఏం మాట్లాడుతున్నావురా అని లక్కీ అంటే.. అమ్మ గురించి అంటున్నారా అని రాజు అంటాడు.

పిన్నీ వీడు అమ్మ కోసం ఇంత పరితపిస్తున్నాడుగా వీడి అమ్మ కూడా పరితపిస్తుందంటావా. అప్పుడు దూరం చేసుకుంది తర్వాత కొంచెం అయినా ఫీల్ అవుతుందంటావా. వీడు కొడుకు అని తెలిస్తే ఎలా అని భయపడుతుందా. వీడి అమ్మ స్థానంలో ఉండి ఆలోచించు అని రాజు అంటాడు. మేడమ్ మావోడి మాటలు పట్టించుకోకండి. మా అమ్మ గురించి తెలుసుకోండని లక్కీ అంటాడు.

రేఖకు 2 రోజుల గడువు

మా పిన్ని మాటిస్తే తప్పకుండా నెరవేరుస్తుంది. ఇంకా రెండు రోజుల టైమ్ ఉందిగా. కచ్చితంగా మీ అమ్మను తీసుకొచ్చి నీ ముందు నిలబెడుతుంది అని రేఖకు రెండు రోజుల గడువు ఉన్నట్లుగా రాజు చెబుతాడు. లక్కీని పంపిస్తాడు రాజు. నన్నెందుకు టార్చర్ పెడుతున్నావ్ అని రాజును అంటుంది రేఖ. నేను చెప్పినట్లు చేస్తే ఏ టార్చర్ ఉండదంటాడు రాజు.

పిన్ని నీకు రెండు రోజుల టైమ్ ఉంది. లక్కీ నీ కొడుకు అని యాక్సెప్ట్ చేసి అందరిముందు బయటపెట్టాలి. లేకుంటే నేనే బయటపెడతాను. నువ్వు చెబితే బాగుంటుంది. నేను బయటపెడితే వేరే లెవెల్‌లో ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు రాజు. మరోవైపు రాజు వస్తుంటే చూసిన అపర్ణ ఇందు వాళ్లు ఓ డ్రామా స్టార్ట్ చేస్తారు.

ఇందు నో. నేను అస్సలు ఒప్పుకోను అంటుంది. రాజు వచ్చి ఏమైందని అడిగితే.. నీకెందుకు అని అరుస్తుంది ఇందు. పెద్దవాళ్లు ఏం చేసిన మనకోసమేగా. ఎందుకు అలా అంటావ్. వాళ్లు చెప్పింది మనం వినాలని, ఏదైమైనా తాతయ్య, నానమ్మను సంతోషపెట్టాలని రాజు అంటాడు. మేము చెప్పింది ఒప్పుకుంటావా అని అపర్ణ అడుగుతుంది. సరేనని రాజు అంటాడు.

ఇరుక్కున్న రాజు

మీకు పెళ్లయిందిగా, ఏడు అడుగులు నడిచారుగా అని అపర్ణ అడిగితే.. అవును, వేదమంత్రాల సాక్షిగా తన మెడలో తాళి కట్టాని తడబడుతూ చెబుతాడు రాజు. పెళ్లి తర్వాత సాంప్రదాయంగా మీకు జరగాల్సింది ఏవి జరగలేదు. సత్యనారాయణ వ్రతం జరగలేదు. పెళ్లి అయిన తర్వాత మెడలో నల్లపూసలు వేస్తారు. ఇన్నిరోజులు అవుతున్నా ఇందు మెడలో ఆ నల్లపూసలు లేవుగా అని అపర్ణ అంటుంది.

పంతులును పిలిపించి అమ్మ వారి సమక్షంలో పూజ చేయించి ఆ నల్లపూసల తాళి ఇందు మెడలో వేశావే అనుకో ఓ పనైపోతుంది అని అపర్ణ అంటుంది. దాంతో రాజు షాక్ అవుతాడు. ఏమైంది. నేను చెబుతున్నా వినలేదుగా అని ఇందు అంటుంది. ఇలా ఇరికించావేంటే అని రాజు అంటే.. నేను ఇరికించలేదు. నువ్వే ఇరుక్కున్నావ్. అనుభవించు అని ఇందు అంటుంది.

పెళ్లి చూడకపోయిన ఇలా జరిపించి సంతోషిస్తాం అని అపర్ణ అంటుంది. ఇప్పుడు కాదని రాజు అంటాడు. మేము చెప్పింది చేస్తా అన్నావుగా అని అపర్ణ అంటుంది. రాజు ఎంత చెప్పిన అపర్ణ, సుభాష్ వద్దనడానికి కారణం గుచ్చి గుచ్చి అడుగుతారు. వదలట్లేదే అని అనుకున్న రాజు మా బాబాయ్ చనిపోయాడు. మైలు అని రాజు అంటాడు.

మైలుతో తప్పించుకున్నరాజు

నీకు బాబాయ్ ఎవరు లేరే అని ఇందు అంటుంది. ఆ టాపిక్ రాలేదుగా అని రాజు అంటాడు. మొన్నే మా బాబాయ్ ఏదో రోగం వచ్చి పోయాడు. మైలు ఉందిగా. ఈ పూజలు ఇప్పుడు వద్దు. మైలు పోయాక నేను చెబుతా అని రాజు వెళ్లిపోతాడు. దాంతో నవ్వుకుంటారు అపర్ణ వాళ్లు. ఎన్నిరోజులు తప్పించుకుంటావో చూస్తా మనవడా. ఎప్పటికైనా నీతో ఇందు మెడలో తాళి వేయిస్తానని అపర్ణ అనుకుంటుంది.

మరోవైపు రెస్టారెంట్‌లో నందు, వెంకీ కూర్చుంటారు. నందు హర్ట్ అయ్యేలా మాట్లాడాలని వెంకీ అనుకుంటాడు. డెలివరీ జాబ్ ఎందుకు మానేశావని నందు అడుగుతుంది. అన్నయ్య డబ్బులు పంపిస్తున్నాడు. ఇంటి అవసరాలు తీరుతున్నాయి. జాబ్ చేసే టైమ్ కోచింగ్‌కు పెట్టొచ్చని మానేశా అంటాడు వెంకీ. మరి నన్నెందుకు దూరం పెట్టావని నందు అడుగుతుంది.

ఇన్నిరోజులు నాకు పనిలేదు పైగా నీతో అవసరం ఉంది. అందుకే నీతో టైమ్ స్పెండ్ చేశాను. కానీ, ఇప్పుడు నీతో నాకు అవసరం లేదు. అయినా నేను జీవితంలో ఎదగాలనుకుంటున్నాను. నీతో తిరిగి టైమ్ వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇదే నిజం. ఇప్పుడు నీకు కోట్ల ఆస్తి ఉంది. నువ్వు ఏం సాధించిన సాధించకపోయినా వచ్చేది ఏం లేదు. కానీ నా లైఫ్ అలా కాదు. నేను సంపాదిస్తేనే మావాళ్లకు తిండిపెట్టగలను. నేను అనుకుంది సాధించాలి అర్థమైందా అని వెంకీ అంటాడు.

నందును ఏడిపించిన వెంకీ

రేయ్ నన్ను ఏడిపించాలని ప్రాంక్ చేస్తున్నావుగా అని నందు అంటుంది. నాకు అంత అవసరం లేదు. నీతో టైమ్ స్పెండ్ చేస్తే వేస్ట్ అవుతుంది తప్పా ఒరిగేదేం లేదు అని గట్టిగా అరుస్తాడు వెంకీ. ఇకమీదట నిన్ను కలవాలని, మాట్లాడాలని అనుకోవట్లేదు. నువ్వు అనుకోకు. చేస్తే నా లైఫ్ నీ వల్లే స్పాయిల్ అవుతుంది. నీ టైమ్ నా టైమ్ వేస్ట్ చేయకు. ఇదే చెప్పలేకపోయా. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందని, నందుతో తెగదెంపులు చేసుకుని వెంకీ వెళ్లిపోతాడు.

దాంతో నందు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. వెంకీ కూడా ఏడుస్తూ వెళ్లిపోతాడు. మరోవైపు ఇందు ఇంటికి ఐశ్వర్య అంటూ ఒకతను వస్తాడు. ఎవరని భ్రమరాంబ కోపంగా నిలదీస్తుంది. మీ ఐశ్వర్య నా దగ్గర రూ. 3 లక్షలు అప్పు తీసుకుంది అని చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.

అప్పు తీసుకునేటప్పుడు పదిసార్లు ఫోన్ చేసేది. అప్పు కట్టమంటే మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అసలు కలవడమే లేదు. అందుకే నేరుగా ఇంటికి వచ్చాను. మీ దగ్గర వసూలు చేద్దామనుకుంటున్నాను అని అతను అంటాడు. అప్పు తీసుకున్నట్లు బాండ్ పేపర్ ఏమైనా రాయించుకున్నావా అని శేషు, భ్రమరాంబ అడుగుతారు.

ఐశ్వర్య 3 లక్షల అప్పు

తనను నమ్మి ఇచ్చాను. ఇలా రాయించుకోవాలని అనిపించలేదని అతను అంటాడు. లేదు నాకు డౌట్‌గా ఉంది. మా ఐషు మీ దగ్గర డబ్బు తీసుకోవడం ఏంటీ. తనకు అంత అవసరం లేదు అని స్వాతితో ఐశ్వర్యను తీసుకురమ్మని ఇందు అంటుంది. ఐశ్వర్య వస్తే అప్పు గురించి అడుగుతారు ఇంట్లోవాళ్లు. ఐశ్వర్య కోపంగా మాట్లాడుతుంది.

లక్కీకి పెళ్లి చూపులు

తర్వాత లక్కీకి పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాడు రాజు. పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్లు లక్కీ తల్లి గురించి అడుగితే.. అనాథ ఆశ్రమంలో వదిలేసి వెళ్లిందని రాజు చెబుతాడు. అసలు అది తల్లేనా అని పెళ్లికూతురు తల్లి నానా మాటలు అంటుంది. భ్రమరాంబ కూడా తిడుతుంది.

అదెవరో తెలిస్తే దాన్ని చెప్పుతో తిరగేసి తిరగేసి కొట్టేదాన్ని అని భ్రమరాంబ అంటుంది. దాంతో రేఖ కోపంగా సోఫా నుంచి పైకి లేస్తుంది. లక్కీ తల్లి తానే అని రేఖ చెప్పేస్తుందా అన్నట్లుగా చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More