బ్రహ్మముడి జులై 4 ఎపిసోడ్: రాజు, చలపతి మధ్య యుద్ధం.. ఇందుని నిలదీసిన అపర్ణ.. సెంటిమెంట్‌తో పిండేసిన లేటెస్ట్ ఎపిసోడ్

Brahmamudi July 4th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 4 ఎపిసోడ్ సెంటిమెంట్ తో పిండేసింది. రాజును దారుణంగా అవమానించి ఇంట్లో నుంచి పంపించిన ఇందు తర్వాత ఎమోషనల్ కాగా.. అటు రాజు, చలపతి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది.

Published on: Jul 4, 2026, 07:50:43 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి చాలా రోజుల తర్వాత మళ్లీ అదిరిపోయే సెంటిమెంట్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందు.. రాజు, చలపతి మధ్య వచ్చే సీన్లు సెంటిమెంట్ తో పిండేశాయి. ఇంట్లో నుంచి రాజు వెళ్లిపోవడం, ఇందు ఎమోషనల్ అవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

బ్రహ్మముడి జులై 4 ఎపిసోడ్: రాజు, చలపతి మధ్య యుద్ధం.. ఇందుని నిలదీసిన అపర్ణ.. సెంటిమెంట్‌తో పిండేసిన లేటెస్ట్ ఎపిసోడ్
బ్రహ్మముడి జులై 4 ఎపిసోడ్: రాజు, చలపతి మధ్య యుద్ధం.. ఇందుని నిలదీసిన అపర్ణ.. సెంటిమెంట్‌తో పిండేసిన లేటెస్ట్ ఎపిసోడ్

రాజును దారుణంగా అవమానించిన ఇందు..

రాజును ఇందు దారుణంగా అవమానించే సీన్ తో బ్రహ్మముడి సీరియల్ శనివారం (జులై 4) ఎపిసోడ్ మొదలైంది. తల్లిదండ్రుల కన్నా నీకు డబ్బే ముఖ్యమా.. ఏ తండ్రియినా అలా మాట్లాడితే కన్న కొడుకు వెంటనే వెళ్లిపోతాడు.. నువ్వు మాత్రం డబ్బు కోసం ఇక్కడే ఉన్నావా.. ఇంత చీప్ క్యారెక్టరా నీది అంటూ రాజును దారుణంగా అవమానించేలా మాట్లాడుతుంది ఇందు.

రాజును రెచ్చగొట్టి పంపించిన ఇందు

అవును నాకు డబ్బే ముఖ్యం అని రాజు తేల్చి చెబుతాడు. నా తల్లిదండ్రుల బాధ కంటే ఇక్కడే నా బాధ్యతే ముఖ్యమని అంటాడు. దీంతో ఇందు అతన్ని మరింత రెచ్చగొడుతుంది. నీ అవసరం లేదు.. ఇది నా ఫ్యామిలీ.. నేను చూసుకుంటానని అంటుంది.

మరి మన మధ్య ఉన్న బంధం, ఒప్పందం సంగతేంటని అడిగితే.. అలాంటివేమీ లేవు.. నీకు రావాల్సిన మిగిలిన పేమెంట్ ఇదే ఇక వెళ్లిపో అంటూ అతని బ్యాగు విసిరి కొడుతుంది. దీంతో ఆ డబ్బును ఇందు చేతుల్లో పెట్టి రాజు వెళ్లిపోతాడు.

ఇందు ఎమోషనల్.. కంటతడి

రాజు వెళ్లిపోతుంటే ఓ ఎమోషనల్ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్ లో ప్లే అవుతూ ఉంటుంది. ఇందు కళ్లు బాధతో అతని వైపే చూస్తుంటాయి. అటు రాజు కూడా ఎంతో బాధలో ఇంట్లో నుంచి వెళ్లిపోతాడు. అతడు వెళ్లిపోయిన తర్వాత ఇందు కంటతడి పెడుతుంది. నాకు మరో దారి లేక నిన్ను ఇలా ఎన్నో మాటలు అన్నాను.. ఈ ఫ్యామిలీ గురించి నువ్వు ఎంత బాధ్యతగా ఉన్నావో నాకు తెలుసు అనుకుంటూ ఇందు ఏడుస్తుంది.

రాజు, చలపతి మధ్య యుద్ధం..

అటు ఇంటికి వెళ్లిన తర్వాత తండ్రి చలపతితో రాజుకు యుద్ధమే జరుగుతుంది. రాజును ఇంట్లోకి రానీయడు. ఆ ఇంటిని పూర్తిగా వదిలేసి వస్తేనే నా ఇంట్లో అడుగుపెట్టు అని చలపతి తేల్చి చెబుతాడు.

అసలు నీ ప్రాబ్లెం ఏంటి నాన్నా.. మీరు అమ్మను ఇలాగే వదిలేయమంటే వదిలేస్తారా.. నేను కూడా ఇందును పెళ్లి చేసుకున్నాను.. మీకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నానని సంతోషించాల్సింది పోయి ఆమె గొప్పింటి అమ్మాయి అని తెలియగానే ఇలా చేస్తారా అంటూ రాజు నిలదీస్తాడు.

ఏదో శక్తి ఆపుతుందన్న రాజు

అయినా చలపతి మాత్రం కరగడు. దీంతో రాజు మరింత ఎమోషనల్ అవుతాడు. ఆ కుటుంబంతో తనకు ఏదో బంధం ఉన్నట్లు అనిపిస్తోందని, అపర్ణ, సుభాష్ తో మాట్లాడుతుంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతోందని అంటాడు. తాను ఇంటిని వదిలేద్దామన్నా ఏదో శక్తి ఆపుతోందని రాజు అనడంతో చలపతి షాక్ తింటాడు. రాజుకు ఎక్కడ గతం గుర్తుకు వస్తుందో అన్న ఆందోళన చలపతి, లక్ష్మీల్లో కనిపిస్తుంది.

మీకోసమే ఆ ఇందు నన్ను రెచ్చగొట్టి ఇంట్లో నుంచి పంపించేసింది.. ప్రస్తుతానికి ఇక్కడే ఉంటాను.. మీకు మీరుగా నన్ను మళ్లీ ఆ ఇంటికి వెళ్లమని చెప్పే వరకు వెళ్లను అని రాజు అంటాడు. అది జరగని పని అని చలపతి అంటే.. జరుగుతుంది, నా మనసులో ఎందుకో గట్టిగా అనిపిస్తోందని చెప్పి ఇంట్లోకి వెళ్తాడు రాజు.

రాజును పంపించేశానని అపర్ణకు చెప్పిన ఇందు

ఇటు ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటే ఇందు బాధగా కూర్చొంటుంది. రాజును కూడా భోజనానికి పిలువు అని అపర్ణ అనడంతో అసలు విషయం చెబుతుంది. దీంతో మనవరాలిపై అపర్ణ తీవ్రంగా మండిపడుతుంది. ఇంట్లో పెద్దవాళ్లను ఒక్క మాట అడగకుండా ఎందుకు పంపించేశావని క్లాస్ పీకుతుంది.

దీంతో రాజుకు అపర్ణ ఫోన్ చేస్తుంది. నువ్వు వచ్చిన తర్వాతే ఇంటికి వెలుగు వచ్చింది.. ఇందు జీవితంలో వెలుగులు నింపేది నువ్వు అని అంటుంది. ఇటు ఇందుతో కూడా నీ భర్తతో నిలబడి మీ అత్తామామల మనసు గెలవాల్సిన బాధ్యత నీదే అని అపర్ణ చెబుతుంది. అటు బాధపడుతున్న రాజును లక్కీ ఓదారుస్తాడు. ఉత్తిత్తి పెళ్లికి అంతలా ఎందుకు ఫీలవుతున్నావు.. ఇందుని నిజంగానే ప్రేమించావా అని అడగడంతో రాజు ఎమోషనల్ అవుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More