బ్రహ్మముడి జూలై 3 ఎపిసోడ్: కోడలిని నిందించిన చలపతి- ఫైనల్ సెటిల్‌మెంట్‌తో రాజును ఇంట్లోంచి వెళ్లగొట్టిన ఇందు- రేఖ హ్యాపీ
Brahmamudi Serial July 3 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 3వ ఎపిసోడ్‌లో రాజును నానా మాటలు అంటాడు చలపతి. అలాగే కోడలు ఇందును కూడా నిందిస్తాడు. ఇందు ఎమోషనల్ అయి రాజును పంపిస్తుందని రేఖ అనుకుంటుంది. అలాగే, ఫైనల్ సెటిల్‌మెంట్ ఇచ్చి రాజును ఇంట్లోంచి పంపించేస్తుంది ఇందు. లగేజ్‌తో రాజు వెళ్లిపోతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నవాళ్ల ప్రేమ కావాలా, ఖరీదైన ఇల్లు కావాలా అని రాజును తండ్రి చలపతి అడుగుతాడు. తల్లి కూడా రమ్మంటుంది. నాన్నను జాగ్రత్తగా తీసుకెళ్లు అని తల్లికి చెబుతాడు రాజు. దానికి అంతా షాక్ అవుతారు.

కన్నకొడుకు అంటే నీలా ఉండాలిరా
నువ్వు ఎవరిని కాదంటున్నావో అర్థమవుతందా అని తల్లి అంటుంది. కన్నకొడుకు అంటే నీలా ఉండాలిరా. నీలాంటి వాడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి. వీడు ఈ కోట్ల ఆస్తి చూడగానే మన కొడుకు అని మర్చిపోయాడు. వీడు పూర్తిగా మారిపోయాడు. మనల్ని బికారీలుగా చూస్తున్నాడు. వీడి మనసు స్వార్థంతో నిండిపోయిందని చలపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఇన్నేళ్ల మా ప్రేమకు, నిరీక్షణకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదారా అని చలపతి అంటాడు. నువ్వు లేకుండా ఉండలేమురా అని తల్లి అంటుంది. మనం వాడి కాళ్లు పట్టుకున్న రాడు. వాడికి కావాల్సింది కన్నవాళ్లు కాదు ఈ కోట్ల ఆస్తి. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదో ఒకరోజు నీకు తప్పు అని తెలుస్తుంది. అది తెలిసిన రోజు నీకు ఈ తండ్రి ఉండడురా అని చలపతి అంటాడు.
నేను చచ్చిన తర్వాత నాకు తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు రాకూడదు అని చలపతి అంటాడు. తర్వాత ఇందుతో ఒకప్పుడు నిన్ను చూసి మా ఇంటి కోడలు అయితే చాలా బాగుండు అనిపించిందమ్మా. కానీ, ఇప్పుడు నువ్వు కోడలివి అయి మా కొడుకును కాకుండా చేశావు. అసలు వాడికి తల్లిదండ్రులు లేకుండా చేశావ్. సంతోషం అమ్మా అని దండం పెట్టి ఇందును నిందిస్తాడు చలపతి.
ఎలాగైనా తీసుకొస్తాను
రాజు తల్లిదండ్రులు ఏడుస్తూ వెళ్లిపోతారు. రాజుతో ఎందుకు అంత కఠినంగా మాట్లాడారని లక్ష్మీ అంటుంది. అలా మాట్లాడితే అయినే వాడు ఇంటికొస్తాడేమో అని అలా అన్నాను అని చలపతి అంటాడు. రాజు ప్రాణాల గురించి మాట్లాడుకుంటారు. వాడు ఆ ఇంటి మనిషి అని తెలిస్తే వాడు అస్సలు రాడు. వాడు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. వాడిని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదని చలపతి అంటాడు.
రాజు విషయంలో మనం తప్పు చేస్తున్నామేమో. వాడు యాక్సిడెంట్ తర్వాత మన బిడ్డగానే పెరిగాడు. వాడిని ఏ అండలేని ఆ కుటుంబానికి అండగా నిలబడేలా దేవుడు చేస్తున్నాడేమో. ఇదంతా దేవుడు ఆడిస్తున్న ఆటలా ఉందని, ఇప్పుడు మన చేయి దాటిపోయింది. వాడిని అడ్డుకుని తప్పు చేస్తున్నావేమో అని లక్ష్మీ అంటుంది.
మనం అడ్డు పడటం కరెక్టే. వాడు లేకుంటే మనం బతకగలమా. వాడు లేకుంటే మహా అయితే ఆ రేఖ ఆ ఆస్తి సొంతం చేసుకుంటుంది. వాడైతే ప్రాణాలతో ఉంటాడుగా. నేను వాడిని ఎలాగైనా ఆ ఇంటినుంచి తీసుకొస్తాను అని చలపతి అంటాడు. మరోవైపు అసలు మనం అనుకున్నది ఏది జరగదా, రేఖ నీ మాటలు గాలి మాటలు అయ్యాయని భ్రమరాంబ అంటుంది.
రాజు వెళ్లిపోడానికి బీజం పడింది
మనం ఏం చేసిన వాళ్లకే ఫేవర్‌గా మారుతుంది. మనం ఇన్నేళ్లుగా ఎన్నో అరాచకాలు చేశాం. కానీ, రాజు గాడి వచ్చి అంతా మార్చేశాడని, మనకు ఆస్తి దక్కేలా లేదని భూషణ్ అంటాడు. వాడు వెళ్లిపోడానికి ఒక బీజం పడింది. మనం అనుకున్నట్లు జరగలేదు. కానీ రాజును ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి మార్గం దొరికిందని రేఖ అంటుంది.
ఇప్పుడు ఇందు చాలా ఎమోషనల్ అవుతుంది. తన వల్లే రాజుకు ఈ పరిస్థితి వచ్చిందనుకుంటుంది. రాజునే ఇందు పంపించేస్తుంది అని రేఖ అంటుంది. ఇందు మాయలో ఉండకు ఆంటీ. అది అంత తెలివితక్కువది కాదని ఐశ్వర్య అంటుంది. సరే అలా జరగకుంటే నేను రాజును పంపిస్తానుగా. రాజు గాడి విషయం అవకాశం దొరికింది. అది వాడుకుని వాడిని పంపించేస్తాను అని రేఖ అంటుంది.
మరోవైపు రాజుతో ఇది కరెక్ట్ కాదని, తండ్రి అంత బాధపడిన కూడా నువ్వు ఉండటంలో అర్థం లేదని ఇందు అంటుంది. ఎందుకు లేదు. నువ్వు ఇక్కడే ఉండమని ప్రామిస్ చేయించుకున్నావుగా, అది బ్రేక్ చేయమంటావా అని రాజు అంటాడు. నిజమే. కానీ, నా వల్ల మీ ఇంట్లోవాళ్లు బాధపడే పరిస్థితి వస్తుందంటే నేనెందుకు అలా చేస్తాను. ప్రామిస్ చేయించుకున్న నేనే చెబుతున్నా. నువ్వు వెళ్లిపో రాజు. మీ అమ్మనాన్న దగ్గరికి వెళ్లు అని ఇందు అంటుంది.
గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది
నేను వెళ్తే నువ్వు అనుకుంది ఎలా చేస్తావని రాజు అంటాడు. అది నా సమస్య. నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. నీ వాళ్లను నీకు దూరం చేసినదాన్ని కాలేను అని ఇందు అంటుంది. నీది అవసరం, నాది స్వార్థం. మనకు కారణాలు ఉన్నాయి. మా నాన్నను నేను కన్విన్స్ చేస్తాను. లైట్ తీసుకో. ఇదంతా మాములే అని రాజు అంటాడు.
మీ వాళ్లు లోపల ఏది ఉందో అదే మాట్లాడుతారు. వాళ్లు కన్నీళ్లు పెడుతున్నారంటే బలమైన కారణం ఉంటుంది. ఈ ఇంట్లో వచ్చే కష్టం నాది. దాన్ని ఆరుస్తానో తీరుస్తానో నా ఇష్టం అని ఇందు అంటుంది. వాళ్ల బాధలకంటే ఇక్కడున్న బాధ్యతలే ముఖ్యమని రాజు అంటాడు.
ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజు
దాంతో చాలా డబ్బు తీసుకొచ్చి రాజుకు ఇస్తుంది ఇందు. ఇదిగో నీ పేమెంట్. ఇదంతా చేస్తుంది డబ్బు కోసమే కదా అని ఇందు ఫైనల్ సెటిల్‌మెంట్ చేస్తుంది. మనిద్దరి మధ్య ఉన్న బంధం డబ్బేనా అని రాజు అంటాడు. తర్వాత లగేజ్ సర్దుకుని రాజు ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


