బ్రహ్మముడి జూన్ 29 ఎపిసోడ్: రేఖ ప్లాన్‌ను లక్కీతో తిప్పికొట్టిన రాజు- రేఖకు ఇచ్చిపడేసిన శ్రుతి- చలపతికి 5 నెలల బోనస్
Brahmamudi Serial June 29th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 29వ ఎపిసోడ్‌లో శ్రుతి డిజైన్స్‌తో వస్తుంది. అది చూసి రేఖ బిత్తరపోతుంది. హర్షకు డిజైన్స్ చూపించడంతో చాలా బాగున్నాయని, ఇందు గొప్ప బిజెనెస్ వుమెన్ అవుతుందని మెచ్చుకుంటాడు. చలపతి కంపెనీ ఓనర్ ఇంటికే వెంకీ స్వీట్స్ డెలివరీ ఇచ్చేందుకు వస్తాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతి కోసం రాజు, ఇందు టెన్షన్ పడుతుంటారు. అది చూసి రేఖ తెగ సంతోషిస్తుంది. హర్ష గారు చాలా సీరియస్ అవుతున్నారు. వేరే వర్క్ ఉందట అని రేఖ చెబుతుంది. ఇంకా శ్రుతి వచ్చేలా లేదు. హర్ష గారిని వెళ్లమని చెబుతానని రేఖ అంటుంది.

డిజైన్స్‌తో శ్రుతి ఎంట్రీ
ఏంటీ ఈ డీల్ క్యాన్సిల్ చేయాలని చూస్తున్నావా. నువ్వు అస్సలు కంగారు పడకు. శ్రుతి గారు వస్తారని రాజు అంటాడు. అంతలోనే ఆటోలో శ్రుతి వస్తుంది. రేఖ అవాక్కవుతుంది. రేఖను రాజు చూస్తాడు. నా స్కూటీ ట్రబుల్ ఇచ్చింది. టైమ్‌కు ఆటో దొరకలేదు. ఆ టెన్షన్‌లో ఫోన్ చూసుకోలేదు, సైలెంట్‌లో ఉందని శ్రుతి చెబుతుంది.
శ్రుతి, ఇందు లోపలికి వెళ్తారు. శ్రుతి ఇక్కడ ఉంటే ఆ వెధవలు అక్కడేం చేస్తున్నారు అని మనసులో అనుకుంటుంది రేఖ. అప్పుడే పిన్ని మనసులో అనుకుంటే ఎలా ఓసారి కాల్ చేసి కనుక్కో ఆ ఇంట్లో ఎవరున్నారో తెలిసిపోతుందిగా అని రాజు వెళ్లిపోతాడు. తన ప్లాన్‌ను రాజు పసిగట్టాడని రేఖ షాక్ అవుతుంది. రేఖ పురమాయించిన రౌడీలకు కాల్ చేస్తుంది.
రౌడీలను తిడుతుంది రేఖ. ఇందాకే శ్రుతి సోడా తీసుకుని వస్తానని లోపలికి వెళ్లిందంటారు. తను ఆఫీస్‌కు వచ్చిందని రేఖ తిట్టి కాల్ కట్ చేస్తుంది. శ్రుతి ఆఫీస్‌కు వెళ్తే లోపల ఎవరున్నారని రౌడీలు అనుకుంటారు. ఇంతలో నిమ్మకాయ సోడా పట్టుకుని చీరలో లక్కీ ఎంట్రీ ఇచ్చి ఝలక్ ఇస్తాడు. లక్కీ ఇచ్చిన ట్విస్టుకు రౌడీలు షాక్ అవుతారు. మేడమ్ చెప్పింది నిజమేరా అని రౌడీలు అనుకుంటారు.
డీల్ క్యాన్సిల్ అయ్యేలా
మనతో పెట్టుకోకండమ్మా మాములుగా ఉండదని లక్కీ వెళ్లిపోతాడు. మరోవైపు హర్షకు నగల డిజైన్స్ చూపిస్తుంది ఇందు. రేఖ వస్తుంది. ఏంటీ మైండ్ బ్లాక్ అయిపోయిందా. నువ్వు నీ ప్లాన్‌లో ఉంటే నేను నా ప్లాన్‌లో ఉన్నానని రాజు రేఖను చూస్తూ మనసులో అనుకుంటాడు. డిజైన్స్ బాగున్నాయి కానీ ఈ స్టోన్ కింద ఉంటే బాగుండు అని హర్ష అంటాడు.
మనం మధ్యలో దూరి డీల్ క్యాన్సిల్ అయ్యేలా చేద్దామని రేఖ అనుకుంటుంది. అవును హర్ష గారు మీరు చెప్పింది నిజమే. ఇదేంటీ ఇందు ఇంత కేర్లేస్‌గా ఉన్నావు. హర్ష గారు డీల్ క్యాన్సిల్ చేసుకుంటారేమో అని రేఖ అంటుంది. మధ్యలో రాజు దూరి ఆ స్టోన్ మధ్యలో పెట్టడానికి కారణం చెప్పమని ఇందుతో అంటాడు. ఆ స్టోన్ అక్కడ పెట్టడం గురించి హర్షకు ఇందు వివరిస్తుంది.
అది విన్న హర్ష చాలా మెచ్చుకుంటాడు. ఈ డిజైన్స్ చాలా బాగా నచ్చాయని, అద్భుతంగా ఉన్నాయని పొగుడుతాడు. మిమ్మల్ని ఎంత మెచ్చుకున్నా తక్కువేనండి. మీరు సూపర్. మీ అమ్మగారిలాగే ఈ డిజైన్స్ ఉన్నాయని, వీటిని మ్యాన్యుఫాక్చర్ చేయండి. 3 నెలల్లో వీటిని కంప్లీట్ చేస్తే మా కంపెనీ తరఫున వచ్చే అన్ని కాంట్రాక్ట్స్ మీకే ఇస్తామని హర్ష అంటాడు.
గొప్ప బిజినెస్ వుమెన్ అవుతారు
అలాగే చేస్తామని ఇందు అంటుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. బిజినెస్‌లో కావాల్సింది ఇదే. మీరు కచ్చితంగా గొప్ప బిజినెస్ వుమెన్ అవుతారు అని హర్ష అంటాడు. దానికి రేఖ తెగ షాక్ అయిపోతుంది. హర్ష వెళ్లిపోతాడు. మన ఫస్ట్ డీల్ సక్సెస్ అని రాజు, ఇందు అనుకుంటారు. తర్వాత శ్రుతిపై రేఖ ఫైర్ అవుతుంది.
ఆ మాటలు ఇందు వింటుంది. మీ అమ్మ ప్రాణాలు అంటే లెక్కలేదా. నన్నే కాదంటావా అని రేఖ అంటే.. నా ప్రాణాలు కూడా లెక్కలేదని శ్రుతి అంటుంది. నేనంటే భయం పోయిందా అని రేఖ అంటే.. భయపడాల్సిన లేదు. ఇన్నేళ్లు మీరు చెప్పింది చేశాను. ఇందు గారు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఎవరికో భయపడి అది వమ్ము చేయలేను. రాజ్, కావ్య సర్ వల్లే మా ఫ్యామిలీ నిలబడింది. మీలా తిన్నింటి వాసాలు లెక్కపెట్టలేని అని శ్రుతి ఇచ్చి పడేస్తుంది.
రేఖకు ఎదురుతిరిగిన శ్రుతి
ఎవరిని చూసుకుని ఈ ధైర్యం. ఆ రాజు గాడిని చూసుకునేగా నీ ధైర్యం. ఏం చేస్తానో చూడు అని రేఖ అంటుంది. ఏం చేస్తారు. జాబ్‌లో నుంచి తీసేస్తారా. జాబ్ కాదు ప్రాణాలు తీసిన ఇందు మేడమ్‌ని మోసం చేయనని శ్రుతి అంటుంది. నేనేంటో త్వరలో చూపిస్తానని రేఖ వెళ్లిపోతుంది. ఇందు వచ్చి నాకోసం ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు. రేఖ ఆంటీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక్కమాట చెబితే అయిపోయేదిగా అని ఇందు అంటుంది.
మీరు ఎవరి ముందు తలవంచాల్సిన అవసరం లేదని శ్రుతి అంటుంది. మీ వల్లే ఈరోజు డీల్ పూర్తయిందని. మీరు చాలా గొప్పగా చేశారు. థ్యాంక్యూ శ్రుతి గారు అని హగ్ చేసుకుంటుంది ఇందు. మరోవైపు చలపతి, లక్ష్మీని కంపెనీ ఓనర్ ఇంటికి పిలిచి భోజనం పెడతాడు. దానికి చలపతి సంతోషిస్తాడు. మా కంపెనీకి చాలా సేవలు చేసినందుకు ఈ దసరాకి నీకు 5 నెలల బోనస్ ఇస్తున్నానని ఓనర్ చెబుతాడు.
మా కంపెనీ ఎదుగుదలకు ఎంతో కష్టపడ్డావ్. అందుకే బోనస్ ఇస్తున్నా అని ఓనర్ అంటాడు. ఇంతలో ఓనర్ కూతురు ప్రియను పరిచయంచేసి మూన్ స్టార్ కంపెనీలో పని చేస్తుందని చెబుతాడు. అదే కంపెనీలో తన కొడుకు వెంకటేశ్వర్లు పని చేస్తాడని చలపతి అంటాడు. అలాంటి పేరుతో ఎవరు లేరని ప్రియ అంటుంది. ఇంటికి వెళ్లాక అబ్బాయిని అడిగి కన్ఫర్మ్ చేసుకో అని ఓనర్ అంటాడు.
తప్పించుకున్న వెంకీ
అంతలోనే అక్కడికి వెంకీ ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వస్తాడు. అక్కడ తల్లిదండ్రులను చూసి వెంకీ షాక్ అవుతాడు. డెలివరీ ఇవ్వకుంటే ఓనర్ తిడతాడని వెంకీ అనుకుంటాడు. మాస్క్ కట్టుకుని వెంకీ వెళ్తాడు. టైమ్‌కి రావాలి కదా అతన్ని చలపతి ఓనర్ తిడతాడు. వెంకీ సారీ చెప్పి వెళ్లిపోతాడు. అలా వెంకీ తప్పించుకుంటాడు.
ఈ స్వీట్స్ నీకోసమే అని చలపతికి ఓనర్ ఇస్తాడు. మరోవైపు స్వీట్స్ తెచ్చి రేఖకు, అందరికి కంగ్రాట్స్ చెబుతాడు శేషు. మనం గెలవలేదు. రాజుగాడు గెలిచాడని భ్రమరాంబ అంటుంది. తెలుసు. మనం సక్సెస్‌ఫుల్‌గా పూర్తిగా ఓడిపోయాని చెప్పడానికే ఈ స్వీట్స్ పట్టుకొచ్చానని శేషు అంటాడు. రాజు, ఇందులను ఎంప్లాయిస్ దేవుళ్లలా చూస్తారు. వాళ్లకు తిరుగే ఉండదని అంటాడు.
రేఖ ప్లాన్స్ తిప్పికొట్టి
ఇవాళ రేఖ ప్లాన్స్ అన్ని తిప్పికొట్టి మరి డీల్ ఓకే చేసుకున్నారు. ఇప్పుడు కంపెనీలో రేఖ చెల్లెమ్మతో పనిలేదని నిరూపించిన అల్లుడు ఇంట్లో కూడా లేదని ప్రూవ్ చేస్తాడని శేషు అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


