బ్రహ్మముడి జూన్ 19 ఎపిసోడ్: పార్టీలో సీతారామయ్య ఫొటో- రేఖతోనే దండం పెట్టించిన రాజు- వెంకీ 1500 టిప్‌తో కరెంట్ బిల్

Brahmamudi Serial June 19th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 19వ ఎపిసోడ్‌‌లో పార్టీలో సీతారామయ్య ఫొటో ఉండటం చూసి రేఖ షాక్ అవుతుంది. ఇందు మీద అరుస్తుంది. ఆ ఫొటో తాను పెట్టించానని, దానికి కారణం చెబుతాడు రాజు. చివరికి రేఖతోనే సీతారాయమయ్ ఫొటోకు దండం పెట్టేలా చేస్తాడు రాజు.

Published on: Jun 19, 2026, 08:56:31 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ తినకపోవడం తెలిసి నందు ఫీల్ అవుతుంది. ఇలాంటి కష్టాలు పడితేనే లైఫ్‌లో ముందుకెళ్తామని నువ్వేగా చెప్పావ్ అని వెంకీ అంటాడు. బాగా మారావురా. సరే నీకు ట్రీట్ ఇస్తాను అని నందు అంటుంది.

బ్రహ్మముడి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 19 ఎపిసోడ్

వెంకీ టిప్‌తో కరెంట్ బిల్

వద్దు కోచింగ్‌కు లేట్ అవుతుందని వెంకీ అంటాడు. తినకుండా వెళ్తే ఏం అర్థమవుతుంది అని చెప్పి నందు తీసుకెళ్తుంది. మరోవైపు కరెంట్ బిల్ కట్టలేదని పవర్ కట్ చేస్తానని ఎలక్ట్రిషియన్ అంటాడు. కొంచెం టైమ్ ఇవ్వమని చలపతి వాళ్లు ప్రాధేయపడతారు. ఇంతలో వెంకీ వస్తాడు. విషయం తెలిసి 1500 కరెంట్ బిల్ కడతాడు వెంకీ.

దాంతో అతను వెళ్లిపోతాడు. నీకు శాలరీ వచ్చేది ఇప్పుడు కాదుగా. డబ్బులు ఎక్కడివి అని చలపతి అడుగుతాడు. టిప్ వచ్చింది నాన్న అని వెంకీ నోరు జారుతాడు. టిప్ ఏంట్రా అని చలపతి, లక్ష్మీ అడుగుతారు. టిప్ అంటే అది కాదు మా కంపెనీలో పనికి వచ్చే ఐడియా ఇస్తే ఇలా ఎక్స్‌ట్రా మనీ ఇస్తారని వెంకీ అబద్థం చెబుతాడు. ఏమోరా. నువ్వు చెబుతున్నావుగా నమ్ముతాను అని చలపతి అంటాడు.

తర్వాత రాజు గాడి గురించి లక్కీ గాడికి తెలిసే ఉంటుంది. వానికి నాలుగు తగిలిస్తే వాడే చెబుతాడు. మనం వాడి దగ్గరికి వెళ్దామని లక్ష్మీతో చలపతి అంటాడు. మరోవైపు స్వరాజ్ కంపెనీ క్లైంట్స్‌ కోసం ఇందు సీఈఓ అయినందుకు పార్టీ ఇస్తారు. అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. గార్డెన్‌లో సీతారామయ్య ఫొటో ఉండటం చూసి రేఖ షాక్ అవుతుంది.

కారణం మా తాతయ్య గారే కదా

ఇందును కోపంగా పిలిచి ఈ ముసలోడి ఫొటో ఎందుకుందని, వాళ్ల ఫొటోలను ఇంట్లో పెట్టకూడదని చెప్పానుగా అని అడుగుతుంది. మేము పెట్టలేదని ఇందు అంటుంది. నేనే పెట్టించానని రాజు ఎంట్రీ ఇస్తాడు. సీతారామయ్య గారు స్వరాజ్ కంపెనీకి ఫౌండర్. ఆయన వల్లే మనం దర్జాగా బతుకుతున్నామంటే దానికి కారణం మా తాతయ్య గారే కదా అని రాజు అంటాడు.

దాంతో అపర్ణ, అంతా షాక్ అవుతారు. అదే సీతారామయ్య గారే కదా అని రాజు అంటాడు. కంపెనీ పార్టీలో ఫౌండర్ ఫొటో లేకుంటే ఎలా. అందుకే దగ్గరుండి పెట్టించాను. నాకు సొంత తాత కాకపోవచ్చు. నా పెళ్లానికి సొంత తాతయ్యే కదా అని రాజు అంటాడు. భ్రమరాంబను ఫొటో తీసి బయటపడేయమంటుంది రేఖ. ఒక్క సెకన్ ఆగమంటాడు రాజు.

నిన్నటి వరకు నిన్ను చూసి మంచి బిజినెస్ వుమెన్ అనుకున్నా. నిన్ను ఫాలో అవుదామనుకున్నా. కానీ, నువ్వు మరి ఇంత తెలివితక్కువ దానివా పిన్నీ.. ఇక్కడికి కంపెనీ క్లైంట్స్ వస్తారు. అందరికి సీతారామయ్యపై పాజిటివ్ ఒపినీయన్ ఉంది. ఇప్పుడు వాళ్లకు ఆయన మొహమే చూపించాలి. మనవి కాదు. అప్పుడే ఇన్వెస్ట్ చేస్తారు. ఈ విషయం మీకు తెలియదా అని రాజు అంటాడు.

రేఖతో దండం పెట్టించిన రాజు

రాజు చెప్పేది నిజమే అనిపిస్తుంది. బిజినెస్ బాగా రన్ అవ్వాలంటే తాతయ్య గారి ఫొటో ఉండాలనిపిస్తుందని ఇందు అంటుంది. అలా అయితేనే ఇన్వెస్ట్‌మెంట్స్ వస్తాయి. లేకపోతే పార్టీ ఖర్చులు కూడా బొక్కే అని రాజు అంటాడు. ఇంతలో క్లైంట్స్ వచ్చి సీతారామయ్య ఫొటోకు పూలు పెట్టి ఆయన గురించి గొప్పగా మాట్లాడుతారు.

మీకు జీవితాంతం రుణపడి ఉంటామని అంటారు. క్లైంట్స్ మాటలు విన్నారుగా. బిజినెస్ కావాలా. మీ పంతం కావాలా. డబ్బులు కావాలా, ఫొటో తీసేయడం కావాలా అని రాజు అంటాడు. సరే అత్తయ్య తాతయ్య ఫొటో తీసేయ్ అని రాజు అంటాడు. అక్కర్లేదు ఉండని అని రేఖ అంటుంది. పిన్ని ఫొటోకు దండం పెట్టుకో. అలా చేస్తే నువ్వు తాతయ్య గారి మనిషివని, తాతయ్యలాగే నమ్మకస్తురాలివని నమ్ముతారు అని రాజు అంటాడు.

భ్రమరాంబ, శేషు కూడా వెళ్లమంటారు. క్లైంట్స్ వస్తుంటారు. రేఖ వెళ్లి సీతారామయ్య ఫొటోకు దండం పెట్టుకుంటుంది. అలా చేస్తాడు రాజు. ఇన్నేళ్ల తర్వాత ఇలాంటి పార్టీలో మా మావయ్య గారి ఫొటో ఉండటం చూస్తున్నాను అని అపర్ణ, సుభాష్ సంతోషిస్తారు. అంతా రాజు వల్లే సాధ్యమైందని సుభాష్ అంటాడు. ఇదేం చూశారు. ఇక ముందు ముందు చూస్తారు. ఆ రేఖను ఎలా దెబ్బకొడతానో చూస్తారుగా అని రాజు అంటాడు.

పెండ్రైవ్‌లో ఇందు గుట్టు

లక్కీతో రాజు చెప్పిన నిజాన్ని తీసిన వీడియోను ల్యాప్‌ట్యాప్‌లో చూస్తుంది ఐశ్వర్య. ఏమే ఇందు నువ్వు ఇంత పెద్ద ప్లాన్ వేశావని తెలిస్తే అంతా షాక్ అవుతారు. ఈ వీడియోను అందరి ముందు ప్లే చేస్తే ఉంటుందని, దాన్ని పెండ్రైవ్‌లో కాపీ చేస్తుంది ఐశ్వర్య. రాజు, ఇందుల గుట్టు పెండ్రైవ్‌లో ఉంది. ఒసేయ్ ఇందు నీ గుట్టు రట్టు చేసేందుకు వస్తున్నా అని ఐశ్వర్య అంటుంది.

మరోవైపు ఇందు మంచి ప్లానే ఇచ్చిందని రేఖతో అంటుంది భ్రమరాంబ. ఈ పార్టీతో పెట్టిన ఖర్చుకు వంద రెట్లు రాబట్టాలని రేఖ అంటుంది. మనకు సపోర్ట్‌గా ఉండే క్లైంట్స్ ఎవరో తెలుసుకుందామని రాజు, ఇందు అనుకుంటారు. కొంతమంది రేఖ గురించి గొప్పగా, మరికొంతమంది సీతారామయ్య గురించి మాట్లాడుకుంటారు.

సీతరామయ్య గారి గురించి మంచిగా మాట్లాడిన వాళ్ల దగ్గరికి వెళ్లిన రాజు పరిచయం చేసుకుని ఇందు సొంత నిర్ణయాలు తీసుకుంటుందని, మీరు అనుకున్నట్లు బిజినెస్ నడిపిస్తుందని రాజు చెబుతాడు. వాళ్లు సరేనంటారు. తనకు సపోర్ట్ చేసేవాళ్లు నలుగురు ఉన్నారని, మిగతా అంతా రేఖ వైపు ఉన్నారని ఇందు, రాజు మాట్లాడుకుంటారు.

రేఖ ఆంటీని కాదని

కానీ, వీళ్లంతా రేఖ ఆంటీని కాదని మనకు సపోర్ట్ చేస్తారంటావా అని ఇందు అంటే.. నేనైతే నీ గురించి చాలా బాగా మాట్లాడాను. చేస్తారు అని రాజు అంటాడు. సరేనని ఇందు అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More