బ్రహ్మముడి జూన్ 16 ఎపిసోడ్: రేఖను ఏమార్చిన ఇందు- పార్టీలో రాజు ఇందు సీక్రెట్ బయటపెట్టనున్న ఐశ్వర్య- రుద్రాణిలాగే ప్లాన్!

Brahmamudi Serial June 16th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 16వ ఎపిసోడ్‌‌లో శకుంతల ఎంట్రీ ఇస్తుంది. పెద్ద డ్రామా ఆడి రేఖను క్లైంట్స్‌తో పార్టీకి ఒప్పిస్తుంది ఇందు. ఇంటికొచ్చిన లక్కీతో ఇందుతో జరిగిన పెళ్లి అబద్ధం అని, అద్దె మొగుడిలా నటిస్తున్నాని రాజు నిజం చెబుతాడు. ఆ మాటలు ఐశ్వర్య వింటుంది.

Published on: Jun 16, 2026, 09:09:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ సైకిల్ మీద అందరికి ఫుడ్ డెలివరీ ఇస్తాడు. ఓ కస్టమర్ వెంకీ బాస్‌కి కాల్ చేసి ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి త్వరగా ఇవ్వమని తిడతాడు. వెంకీ సరేనంటాడు.

బ్రహ్మముడి సీరియల్ జూన్ 16 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 16 ఎపిసోడ్

సైకిల్ మీద డెలివరీ ఏంటీ

వీడు బైక్ మీద వెళ్లాడు కదా. మరెందుకు లేట్ అవుతుంది అని బాస్ అనుకుంటాడు. ఓ కస్టమర్ బాస్‌కు కాల్ చేసి మీవాడు ఏంటీ సైకిల్ మీద డెలివరీ చేస్తున్నాడు. ఇలా అయితే మీ బిజినెస్ పోతుందిగా. బైక్ ఉన్నవాళ్లను పెట్టుకోవచ్చుగా అని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి నువ్వు సైకిల్ మీద డెలివరీ చేస్తున్నావని తెలిసిపోయిందని తిట్టి ఐదు నిమిషాల్లో రమ్మంటాడు.

మరోవైపు సుభాష్, ఇందుల ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంటికి శకుంతల వస్తుంది. రాగానే మా ఇంట్లో పరాయివాళ్ల పెత్తనం కాదుగా అని రేఖపై సెటైర్లు వేస్తుంది. అపర్ణను ఎవరు అని అడిగిన రాజు భోజనం చేయమని చెప్పండంటాడు. శకుంతల కూడా వచ్చి భోజనానికి కూర్చుంటుంది.ఇదేదో సత్రం అయినట్లు అందరికి భోజనం పెడుతున్నారని రేఖ అంటుంది.

నేనేం పట్టించుకోను నువ్వు పెట్టు అని శకుంతల అంటుంది. ఈ అబ్బాయి ఎవరే. అచ్చం రాజ్‌లా ఉన్నాడని శకుంతల అడుగుతుంది. నా మనవడు అని అపర్ణ అంటే.. అంటే నీ కూతురు కొడుకా అని శకుంతల అంటుంది. కాదు ఈ ఇంటి అల్లుడు, ఇందుకు మొగుడు అని శేషు చెబుతాడు. ఇందు పెళ్లి గురించి చెబితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, పెద్దలకు తెలియదంటే అదేగా అని శేషు చెబుతాడు.

రేఖను శాడిస్ట్ అన్న శకుంతల

శకుంతలతో మాట్లాడమని, డ్రామా స్టార్ట్ చేయమని ఇందు అంటుంది. ఇందు నువ్వు కూడా భోజనం చేయు. నువ్వు ఇప్పుడు స్వరాజ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీకి సీఈఓ కదా అని రాజు అంటాడు. ఏంటీ ఇందు సీఈఓ అయిందా అని శకుంతల ఆశ్చర్యపోతుంది. రేఖ ఉండగా ఇందు సీఈఓ అవ్వడమేంటీ. రేఖ నిజంగా నీ పదవి పోయిందా. దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు. అందుకే ఇలా జరిగిందని శకుంతల అంటుంది.

ఇందును బయటకు పంపకుండా బానిసలా చూశావుగా అని శకుంతల అంటే.. మా ఆంటీని ఏం అనకండని. బానిసలా చూడలేదని, నా సెక్యూరిటీ కోసం అలా చూసుకుందని ఇందు రేఖకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇందును రేఖ సీఈఓ చేయడం గురించి మాట్లాడుకుంటారు. రేఖ నీకు ఇలాంటి మంచి బుద్ధులు ఎలా వచ్చాయి. నువ్వు అసలే శాడిస్ట్‌వి కదా అని శకుంతల అంటుంది.

మా రేఖ ఆంటీ చాలా మంచిది. తనను తప్పుబడితే బాగుండదు. నా ముందే రేఖ ఆంటీని అలా అంటే ఊరుకోను. మీరు వెంటనే వెళ్లిపోండి అని ఇందు అంటుంది. దాంతో శకుంతల వెళ్లిపోతుంది. ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. బయట కూడా చాలా మంది శకుంతలాగే మాట్లాడుకుంటారు. అందరి నోళ్లు మూయిస్తావా అని సుభాష్ అంటాడు.

రేఖను ఏమార్చిన ఇందు

మూయిస్తాను. ఆంటీ ఇప్పుడు నేను సీఈఓ అయిన సందర్భంగా మన క్లైంట్స్ అందరిని పిలిచి పార్టీ ఇద్దామా. ఇది మన పెట్టుబడి. రేఖ ఆంటీ మీద ఉన్న తప్పుడు అభిప్రాయాలు పోతాయి. ఇప్పుడు పార్టీలో రేఖ ఆంటీనే నన్ను సీఈఓ చేసిందని చెబితే.. అప్పుడు రేఖ ఆంటీ మంచితనం తెలుస్తుంది అని ఇందు అంటుంది. అవును ఇందు చెప్పింది కరెక్ట్. పార్టీ ఇద్దామని రేఖ అంటుంది.

సూపర్ ఇందు. అక్షరం ముక్క రాకపోయిన నీ ఐడియా అదిరిపోయిందని ఇందును మెచ్చుకుంటుంది రేఖ. భూషణ్ చెప్పిన వినకుండా ఇదే ఫైనల్ అని రేఖ అంటుంది. అలా రేఖను ఏమార్చి పార్టీకి ఒప్పిస్తుంది ఇందు. మరోవైపు సైకిల్ మీద డెలివరీ చేసినందుకు, ఇలా మోసం చేస్తావా అని బాస్ తిడతాడు. బైక్ పాడైంది చెబుతాడు వెంకీ.

నీలా అబద్ధం చెప్పేవాళ్లకు నా దగ్గర పని ఉండదు. నీ జాబ్ లేదు అని బాస్ అంటాడు. ఒక్క అవకాశం ఇవ్వమని వెంకీ ప్రాధేయపడతాడు. సైకిల్ మీద వెళ్లిన లేట్ చేయలేదు. బైక్‌పై వెళ్తే ఇన్ టైమ్‌లో ఇస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు వెంకీ. సరే ఒక్క ఛాన్స్ ఇస్తాను. ఒక్క మిస్టేక్ చేసిన, డెలివరీ లేట్ అయిన మాట్లాడటాలు ఉండవు. జాబ్‌లో నుంచి తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు బాస్.

పులిహోర కూడా కలుపు

నందు ఫ్రెండ్‌వి కాబట్టి ఊరుకుంటున్నా అని బాస్ చెబుతాడు. మరోవైపు రాజు విష్ణుమూర్తిలా పడుకుంటాడు. పార్టీ గురించి రాజు, ఇందు మాట్లాడుకుంటారు. నేను రేఖ ఆంటీ పక్కనే ఉంటాను కాబట్టి క్లైంట్స్‌తో రాజును మాట్లాడమని, కావాల్సివస్తే పులిహోర కలిపి, వాళ్లలో ఈ కంపెనీకి ఫేవర్‌గా ఉన్నవాళ్లు ఎవరో కనుక్కోవాలని ఇందు చెబుతుంది.

అలాగే, రేఖ ఆంటీ మనుషులు ఎవరా అని సెపరేట్ చేయాలి. అలా ఎవరో తెలుసుకునేలా చేయడమే నీ టాలెంట్ అని ఇందు అంటుంది. అదంతా చేస్తాను కానీ ఇలా చేసేటప్పుడు రేఖకు డౌట్ రాదా అని రాజు అంటాడు. ఓవరాక్షన్ చేస్తే డౌట్ వస్తుందని ఇందు అంటుంది. నాది నాచురల్ యాక్టింగ్. దాన్నేమైనా అంటే అని రాజు అంటుంటే.. అంటానురా. ఏం చేస్తావురా అని రా కొడుతుంది ఇందు.

ఇందుదే యాక్టింగ్ కాదని రాజు అంటాడు. ఇద్దరు గొడవ పడతారు. తర్వాత ఇంటికి లక్కీ వస్తాడు. రాజుతో పెళ్లి గురించి మాట్లాడుతాడు. అసలు ఇది పెళ్లే కాదు. అద్దె మొగుడిలా నటిస్తున్నాను అని లక్కీకి రాజు నిజం చెబుతాడు.

రుద్రాణిలా ఐశ్వర్య

ఆ మాటలు ఐశ్వర్య వింటుంది. ఈసారి పార్టీలో అందరిముందు ఈ నిజాన్ని బయటపెడతాను అని అచ్చం నానమ్మ రుద్రాణిలా ప్లాన్ చేస్తుంది ఐశ్వర్య. అంటే, పార్టీలో రాజ్, ఇందుల సీక్రెట్‌ను ఐశ్వర్య బయటపెట్టనుందని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More