Aunty: 36 ఏళ్ల ఐశ్వర్య రాయ్‌ని ఆంటీ అన్న 25 ఏళ్ల హీరోయిన్ సోనమ్ కపూర్.. కార్చిచ్చు రేపిన వివాదం వెనుక అసలు నిజాలు!

Sonam Kapoor Aishwarya Rai Aunty Comment Controversy: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఒకప్పుడు ఐశ్వర్య రాయ్‌ను ఉద్దేశించి చేసిన ఆంటీ కామెంట్ పెద్ద దుమారాన్నే రేపాయి. సుదీర్ఘ కాలం పాటు నడిచిన ఈ కోల్డ్ వార్‌పై సోనమ్ ఇచ్చిన క్లారిటీ, ఆ తర్వాత వారిద్దరి మధ్య మారిన పరిస్థితుల గురించి ఆసక్తికర కథనం.

Published on: Jun 15, 2026, 10:51:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sonam Kapoor Aishwarya Rai Aunty Comment Controversy: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల మధ్య విభేదాలు, పంతాలు చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు చేసే కామెంట్లు కొన్నిసార్లు ఇండస్ట్రీలో పెద్ద గొడవకు దారితీస్తుంటాయి. అలాంటి ఒక సంచలన వివాదమే గ్లామర్ క్వీన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ మధ్య జరిగింది.

36 ఏళ్ల ఐశ్వర్య రాయ్‌ని ఆంటీ అన్న 25 ఏళ్ల హీరోయిన్ సోనమ్ కపూర్.. కార్చిచ్చు రేపిన వివాదం వెనుక అసలు నిజాలు!
36 ఏళ్ల ఐశ్వర్య రాయ్‌ని ఆంటీ అన్న 25 ఏళ్ల హీరోయిన్ సోనమ్ కపూర్.. కార్చిచ్చు రేపిన వివాదం వెనుక అసలు నిజాలు!

స్టార్ హీరో కూతురుగా

2007లో 'సావరియా' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అప్పటి స్టార్ హీరో అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్.. 'ఢిల్లీ-6', 'రాంఝణా', 'నీర్జా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే సినిమాల కంటే కూడా తన ముక్కుసూటితనంతో, వివాదాస్పద వ్యాఖ్యలతో సోనమ్ తరచూ వార్తల్లో నిలిచేవారు. ఈ క్రమంలోనే ఒక అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్ విషయంలో ఐశ్వర్య రాయ్‌ను టార్గెట్ చేస్తూ సోనమ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఇండస్ట్రీని కుదిపేశాయి.

వివాదానికి కారణమైన 'ఆంటీ' కామెంట్

అసలు కథ 2009లో మొదలైంది. అంతకుముందు వరకు ఒక ప్రముఖ అంతర్జాతీయ బ్యూటీ బ్రాండ్‌కు ఐశ్వర్య రాయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. అయితే ఆ సంస్థ తమ బ్రాండ్ కోసం సరికొత్త గ్లామర్ ఫేస్ కోసం వెతుకుతూ.. అప్పుడప్పుడే స్టార్‌డమ్ తెచ్చుకుంటున్న సోనమ్ కపూర్‌ను లైన్లోకి తెచ్చింది.

ఒక సీనియర్ హీరోయిన్ స్థానంలో యంగ్ హీరోయిన్ రావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇదే విషయంపై మీడియా సోనమ్‌ను ప్రశ్నించగా.. ఆమె ఊహించని విధంగా స్పందించారు. ఐశ్వర్య రాయ్‌ను "మరో తరం ఆంటీ" (Anunty from another generation) అంటూ కామెంట్ చేశారు.

11 ఏళ్ల వ్యత్యాసం

అయితే, అప్పటికి ఐశ్వర్య రాయ్ వయసు 36 ఏళ్లు కాగా, సోనమ్ వయసు 25 ఏళ్లు. అంటే, ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్ ఉందన్నమాట. ఈ కామెంట్ బాలీవుడ్‌లో కార్చిచ్చు రగిల్చింది. సోనమ్ వయసు రీత్యా అవమానించారంటూ (Age-shaming) విమర్శకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

గౌరవప్రదమైన మౌనం.. ఆపై సోనమ్ యూ-టర్న్

ఈ వివాదంపై ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఒక సీనియర్ నటిగా తను పాటించాల్సిన హుందాతనాన్ని కాపాడుకుంటూ మౌనంగానే ఉండిపోయారు. అయితే ఈ ఇష్యూ పెద్దదవ్వడంతో కొన్నేళ్ల తర్వాత సోనమ్ కపూర్ దీనిపై హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

"ఐశ్వర్య మా నాన్న (అనిల్ కపూర్) సరసన సినిమాలు చేశారు. అలాంటప్పుడు నేను ఆమెను ఆంటీ అని కాక ఇంకేమని పిలుస్తాను?" అంటూ సమర్థించుకునే ప్రయత్నం చేశారు సోనమ్ కపూర్.

ఐశ్వర్యపై ప్రశంసలు

కాలక్రమేణా సోనమ్ కపూర్ తన తప్పును తెలుసుకుని పలు సందర్భాల్లో ఐశ్వర్యపై ప్రశంసల జల్లు కురిపించారు. ముఖ్యంగా 2016లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఐశ్వర్య రాయ్ పర్పుల్ లిప్‌స్టిక్ వేసుకుని రెడ్ కార్పెట్‌పై నడిచినప్పుడు నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేశారు. ఆ సమయంలో ఐశ్వర్యకు సోనమ్ మద్దతుగా నిలిచారు.

"ఫ్యాషన్, మేకప్ అనేవి చర్చించుకోవడానికే ఉంటాయి. ఐశ్వర్య అనుకున్నది సాధించారు, ఆమె లుక్ అద్భుతంగా ఉంది. అంతర్జాతీయ వేదికపై 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆమె చేసిన ఈ ప్రయోగం చాలా కూల్‌గా ఉంది" అంటూ అప్పట్లో ఐశ్వర్యను వెనకేసుకొచ్చారు సోనమ్ కపూర్.

పెళ్లి వేడుకతో ముగిసిన కోల్డ్ వార్

వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్లకు 2018లో పూర్తి స్థాయిలో బ్రేక్ పడింది. సోనమ్ కపూర్, ఆనంద్ అహుజాల వివాహ వేడుకకు ఐశ్వర్య రాయ్ హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రముఖ డిజైనర్ సందీప్ ఖోస్లా బంధువుల రిసెప్షన్‌లో ఐశ్వర్యను కలిసిన సోనమ్ తల్లి సునీతా కపూర్.. ఆమెను పెళ్లికి రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించారు.

ఆ తర్వాత సోనమ్ కూడా ప్రత్యేకంగా పిలవడంతో ఐశ్వర్య అన్ని విభేదాలను పక్కన పెట్టి వివాహ వేడుకల్లో సందడి చేశారు. దీంతో వీరిద్దరి మధ్య ఎలాంటి శతృత్వం లేదని దాంతో తేలిపోయింది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More