బ్రహ్మముడి జూన్ 15 ఎపిసోడ్: కష్టాల్లో కంపెనీ, సుభాష్ పార్టీ ఐడియా- బకరాగా అపర్ణ ఫ్రెండ్- సైకిల్‌పై వెంకీ ఫుడ్ డెలివరీ

Brahmamudi Serial June 15th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 15వ ఎపిసోడ్‌‌లో స్వరాజ్ కంపెనీకి రా మెటీరియల్ సప్లై చేయట్లేదని నోటీసులు వస్తాయి. అలా అయితే కంపెనీ మూసుకోవాల్సిందేనని రేఖ అంటుంది. దానికి సుభాష్ పార్టీ ఐడియా ఇస్తాడు. అది వర్కౌట్ అయ్యేందుకు అపర్ణ ఫ్రెండ్‌ను దించాలని ఇందు చెబుతుంది.

Published on: Jun 15, 2026, 08:55:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తల్లిదండ్రలకు డెలివరీ బాయ్ కాకుండా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నట్లు అబద్ధం చెప్పి బయటకు వస్తాడు వెంకీ. బైక్ అస్సలు స్టార్ట్ కాదు. బైక్ ఏంటీ హ్యాండ్ ఇచ్చిందని వెంకీ అనుకుంటాడు. వెంకీ బాస్ కాల్ చేసి ఇంకా ఇంటి దగ్గర ఉన్నావా. జాబ్‌లో జాయిన్ అయిన రోజే లేట్ వస్తావా. త్వరగా రా.. చాలా ఆర్డర్స్ ఉన్నాయని అరుస్తాడు.

బ్రహ్మముడి సీరియల్ జూన్ 15 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 15 ఎపిసోడ్

కంపెనీకి నోటీసులు

మరోవైపు ఇంద్రావతి మీరేనా అని ఇందుకు కొరియర్ ఇస్తాడు డెలివరీ బాయ్. అదేంటో చూస్తుండగా.. అది చదివేద్దామనే చూస్తున్నావా అని రేఖ, అంతా వచ్చి అంటారు. భూషణ్‌ను చూడమంటుంది రేఖ. అది చూసిన భూషణ్ షాక్ అయి.. మనకు రా మెటీరియల్ పంపేవాళ్లు నోటీస్ పంపారు. 3 నెలలుగా డబ్బు చెల్లించట్లేదు. వెంటనే డబ్బులు క్లియర్ చేయాలని, లేకుంటే రా మెటీరియల్ ఆపేస్తున్నట్లు ఉందని చెబుతాడు.

రా మెటీరియల్ పంపకుంటే మ్యాన్యుఫాక్చరింగ్ ఆగిపోతుందిగా అని ఇందు అంటుంది. అంతేకాదు కంపెనీ కూడా క్లోజ్ అవుతుందని రేఖ అంటుంది. ఇన్నాళ్లు రేఖ చూసుకున్న తీరుకు రేఖను తిడుతుంది అపర్ణ. దాంతో అపర్ణపైకే రేఖ రివర్స్ అవుతుంది. జీతాలే సరిగా ఇవ్వలేని నేను బిల్ ఎలా క్లియర్ చేస్తాను. బిల్ క్లియర్ చేయకుంటే కంపెనీ మూసుకోవాల్సిందే అని రేఖ అంటుంది.

మీరే ఏదోటి చేయండి ఆంటీ అని ఇందు అంటుంది. నీ భర్తగా కంపెనీని ముందుకు నడిపిస్తానని రాజు అన్నాడుగా. తనే చూసుకుంటాడు. నేనేందుకు ఇన్వాల్వ్ కావడం అని రేఖ అంటుంది. ఏంటీ పిన్నీ నా మీద రివేంజ్ తీసుకుంటున్నావా. నీ మాటల్లే ఏదో తేడా కనిపిస్తుందని రాజు అంటాడు. రాత్రి నేను చెప్పినట్లు చేస్తే డబ్బులు వచ్చేవని రేఖ అంటుంది.

కష్టాల్లో స్వరాజ్ కంపెనీ

ఇక ఈ విషయంలో నేను అస్సలు ఇన్వాల్వ్ అవ్వలేను. పైగా అందరూ నన్నే అంటారని రేఖ అంటుంది. భ్రమరాంబ వంతపాడుతుంది. ఇప్పుడు కంపెనీ కష్టాల్లో ఉంది. ఇప్పుడు ఎలా కంపెనీ మూతపడకుండా ఆపుతావో చేయు అని రాజుతో ఛాలెంజ్ చేస్తుంది రేఖ. కష్టాల్లో ఉన్న కంపెనీని గట్టేక్కిస్తావా అని భూషణ్, భ్రమరాంబ సెటైర్లు వేసి వెళ్తారు.

రేఖ చాలా క్రూరంగా చేస్తుందని చెప్పాగా. మీరే నా మాట వినలేదని అపర్ణ అంటుంది. మీరేం కంగారుపడకండని రాజు అంటాడు. తర్వాత రాజు, ఇందు ఆలోచిస్తుంటారు. ఇందును దగ్గరిగా రొమాంటిక్‌గా చూస్తాడు రాజు. ఎందుకు అలా చూస్తున్నావ్ అని కంగారుగా అడుగుతుంది ఇందు. అందమైన అమ్మాయిలను చూస్తే మైండ్ ఫ్రీ అయి మంచి ఆలోచనలు వస్తాయని రాజు అంటాడు.

నువ్వు అందంగా లేకపోయినా చూస్తున్నా అని రాజు అంటాడు. నిజం చెప్పు నేను అందంగా లేనా అని కోప్పడుతుంది ఇందు. మరి కోత పెట్టొద్దు. నిజానికి చంద్రబింబంలా చాలా అందంగా ఉన్నావ్. కళ్లు చక్రాళ్ల భలే ఉంటాయి. ఒక్కచూపు చూస్తే చాలు ఎవడైనా పడిపోతాడు అని ఇందు అందాన్ని పొగుడుతాడు రాజు. మీ రేఖ ఆంటీ చాలా పెద్ద కంత్రీ. భలే పెద్ద ప్రాబ్లమ్ పెట్టిందని రాజు అంటాడు.

సుభాష్ పార్టీ ఐడియా

ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదని ఇందు అంటే.. ఒక మార్గం ఉందని సుభాష్ అంటాడు. మన కంపెనీకి చాలా మంది క్లైంట్స్ ఉన్నారు. అందులో రేఖకు సపోర్ట్ చేసేవాళ్లు, మనకు సపోర్ట్ చేసేవాళ్లు ఎవరో తెలుసుకోవాలని సుభాష్ అంటాడు. దానికి పార్టీ చేద్దామంటాడు.

నువ్వు సీఈఓ అయినందుకు పార్టీ ఇద్దాం. అందులో మన మనుషులు, రేఖ మనుషులు ఎవరో తెలుసుకోవచ్చు. మనకు సపోర్ట్‌గా ఉండేవాళ్లు ఎవరో తెలుసుకుని కన్విన్స్ చేసి మళ్లీ డీల్స్ తెప్పించుకుంటే డబ్బులు వస్తాయి. అప్పుడు రా మెటీరియల్ సమస్య తీరిపోతుందని సుభాష్ ఐడియా ఇస్తాడు. నువ్వు సూపర్ తాతయ్య, ఐడియా సూపర్ అని ఇందు అంటుంది.

ముసలోడే గానీ బిజినెస్‌లో పట్టు అలాగే ఉందని రాజు మనసులో అనుకుంటాడు. పార్టీకి రేఖ పిన్ని ఒప్పుకోవాలిగా అని రాజు అంటే.. అదంతా నానమ్మ చేతిలో ఉంది. డైరెక్ట్‌కా అడిగితే ఒప్పుకోదు. తనను రెచ్చగొట్టేలా చేస్తే ఒప్పుకుంటుంది. అందుకు ఒక బకరా కావాలని, అది నీ ఫ్రెండ్ శకుంతల అని ఇందు అంటుంది.

బకరాగా అపర్ణ ఫ్రెండ్

దాని నోరు అస్సలు ఊరుకోదు. అసలే రేఖకు దానికి పడదు అని అపర్ణ అంటుంది. ఇప్పుడు శకుంతల నోటితోనే పని ఉందని, త్వరగా రప్పించు. తను వచ్చాకా ఏం చేయాలంటే అని ఇందు మరో ప్లాన్ చెబుతుంది. మరోవైపు ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెంకీ వెళ్తుంటే బైక్‌లో పెట్రోల్ ఉందా అని బాస్ అడుగుతాడు.

ఫుల్ ట్యాంక్ కొట్టించానని అబద్ధం చెబుతాడు వెంకీ. కట్ చేస్తే సైకిల్ మీద ఫుడ్ డెలివరీ ఇస్తాడు వెంకీ. కస్టమర్ వెంకీకి కాల్ చేసి త్వరగా రమ్మంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More