Brahmamudi May 11 Episode: బ్రహ్మముడి.. రాజుకు రోజుకు 10 వేలు.. అతడు కూతురి కొడుకే అని కనిపెట్టిన సుభాష్.. షాక్‌లో రేఖ
Brahmamudi May 11 Episode: బ్రహ్మముడి సీరియల్ మే 11 ఎపిసోడ్ లో రాజుతో ఇందు కుదుర్చుకున్న డీల్, కండిషన్స్ అన్నీ తెలుస్తాయి. అటు అతడు తమ కూతురి కొడుకే అని సుభాష్, అపర్ణ కనిపెట్టేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
Brahmamudi May 11 Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజు, ఇందులను చూసి రేఖలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. ఎలాగైనా వాళ్ల పెళ్లిని పెటాకులు చేసి ఇందుని మళ్లీ తన కొడుకు మదన్ కు ఇచ్చి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తుంది. మరోవైపు రాజులో తన కొడుకున్న చూసుకుంటున్న అపర్ణలో మరింత అనుమానం కలుగుతుంది.

రాజు వివరాలు రాబట్టిన అపర్ణ
బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మే 11) ఎపిసోడ్ రాజు గురించి అపర్ణ వివరాలు రాబట్టే సీన్ తో మొదలవుతుంది. రాజు తల్లిదండ్రుల వివరాలు ఇందు చెబుతుంది. ఎక్కడ ఉంటారని అడిగితే బస్తీలో ఉంటామని అతడు అంటాడు. రాజుని చూసి శేషు, భ్రమరాంబ కూడా మురిసిపోతారు.
స్వాతి అయితే పెళ్లి జరగనందుకు చాలా సంతోషంగా ఉంటుంది. రాజును తన ఇంటి పేరు ఏంటని కూడా అపర్ణ అడుగుతుంది. ఇక్కడే ఉంటే తన పుట్టుపూర్వోత్తరాలన్నీ అడుగుతుందని అనుకొని మన గది చూపించమంటూ ఇందుని తీసుకొని రాజు వెళ్లిపోతాడు.
రాజు మన మనవడే అని చెప్పిన సుభాష్
అయితే అతన్ని చూసి అపర్ణ ఎంతో మురిసిపోతుంది. అచ్చూ మన కొడుకులాగే ఉండటమేంటని సుభాష్ తో అంటుంది. అతనితో కచ్చితంగా మనకు రక్త సంబంధం ఉండే ఉంటుంది.. లేకపోతే మన కొడుకులా ఉండటమేంటి.. అతడు కచ్చితంగా మన మనవడే.. మన కూతురు కొడుకే అయి ఉంటాడు అని సుభాష్ అంటాడు. అతని తల్లిదండ్రులను కలిస్తే అసలు వివరాలు తెలుస్తాయని అపర్ణ, సుభాష్ అనుకుంటారు.
రేఖ ఫ్రస్ట్రేషన్.. అసలు ఏం జరుగుతోందంటూ..
ఇటు ఇదంతా చూసి రేఖలో ఫ్రస్ట్రేషన్ మరింత పెరుగుతుంది. అసలు ఏం జరుగుతోందని భూషణ్ తో అంటుంది. ఆస్తి కోసం ఎన్ని ప్లాన్స్ వేసినా వర్కౌట్ కావడం లేదు.. ముందు కిడ్నాప్, తర్వాత సంతకం చెల్లకపోవడం, ఇప్పుడీ పెళ్లి అంటూ రేఖ వాపోతుంది.
ఇందు సంతకం పెడితే ఆస్తంతా కలిసి వచ్చి మన అప్పులు తీరిపోయి కష్టాల్లో నుంచి బయటపడతామనుకుంటే ఇలా జరిగిందేంటని భూషణ్ కూడా బాధ పడతాడు.
ఈ పెళ్లిని ఎలాగైనా పెటాకులు చేసి తమ కొడుకుతో ఇందుకి మరో పెళ్లి చేయాల్సిందే అని చెబుతుంది. దానికి ఏం చేయాలో తాను ఆలోచిస్తానని, నువ్వు కూడా ఆలోచించు అని భూషణ్ తో అంటుంది.
ఇందు గురించి అసలు నిజం తెలిసి రాజు షాక్
మరోవైపు రాజును తన గదిలోకి తీసుకెళ్తుంది ఇందు. అయితే అది ఓ స్టోర్ రూమ్ కావడంతో అతడు షాక్ తింటాడు. ఈ ఇంటికి మహారాణి అనుకుంటే నువ్వు ఇలాంటి రూమ్ లో ఉండటమేంటని రాజు అంటాడు. ఇలాగైతే నాకు ఇస్తానన్న డబ్బులు ఎలా ఇస్తావని నిలదీస్తాడు. ఈ ఆస్తంతా తనదే అని, ఇస్తానన్న డబ్బులు ఇస్తాను కానీ.. తాను చెప్పిన కండిషన్స్ ఓసారి గుర్తు చేసుకోమని రాజుతో చెబుతుంది ఇందు.
ఇందు కండిషన్స్ గుర్తు చేసుకున్న రాజు.. రోజుకు రూ.10 వేలు
దీంతో అంతడు ఫ్లాష్‌బ్యాక్ లోకి వెళ్తాడు. పెళ్లి కోసం రాజు, ఇందు కుదుర్చుకునే డీల్ చూపిస్తారు. తన భర్తగా నటించాలని అతన్ని అడుగుతుంది. రోజుకు రూ.5 వేలు ఇస్తానంటుంది. అతడు రూ.50 వేలు కావాలంటాడు. చివరికి రూ.10 వేలకు డీల్ కుదురుతుంది. అయితే తనకు కొన్ని కండిషన్స్ ఉన్నాయని ఇందు చెబుతుంది.
నువ్వు కేవలం అద్దె భర్తవే.. నామీద పెత్తనం చెలాయించడానికి ట్రై చేయొద్దు.. నీ కాళ్లుచేతులే కాదు నీ చూపులు కూడా కంట్రోల్లో ఉండాలని అంటుంది. డబ్బు అవసరం కావడంతో రాజు కూడా సరే అంటాడు. కానీ డబ్బు మాత్రం ఏ రోజుకు ఆరోజే ఇవ్వాలని రాజు అంటాడు. ఇందు సరే అంటుంది. ఆ కండిషన్స్ గుర్తు చేసుకొని ఇక తప్పుతుందా అని రాజు అనకుంటాడు. మరోవైపు ఇందు విడాకుల ప్లాన్ వేస్తూ ఉంటుంది రేఖ. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


