Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి.. శోభనం కూడా అయిపోయిందన్న రాజు.. విడాకులు ఇవ్వడానికి రేఖ ప్లాన్.. ఇందు షాక్

Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 9 ఎపిసోడ్ లో రాజు తన కథను రక్తి కట్టిస్తాడు. ఇందుతో శోభనం కూడా అయిపోయిందని చెబుతాడు. అయితే రేఖ మాత్రం వాళ్లకు విడాకుల ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Published on: May 9, 2026, 06:58:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందును నకిలీ పెళ్లి చేసుకొని దుగ్గిరాల ఇంట్లో అడుగుపెడతాడు రాజు. రేఖ ఆమె మెడలో తాళి తీసేయడానికి వెళ్తే రాజు అడ్డుకుంటాడు. ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. చేసేది లేక ఇంట్లోకి రమ్మన్న రేఖ.. తర్వాత విడాకుల ప్లాన్ చేస్తుంది.

Brahmamudi May 9th Episode:  బ్రహ్మముడి.. శోభనం కూడా అయిపోయిందన్న రాజు.. విడాకులు ఇవ్వడానికి రేఖ, ఇందు ప్లాన్
Brahmamudi May 9th Episode: బ్రహ్మముడి.. శోభనం కూడా అయిపోయిందన్న రాజు.. విడాకులు ఇవ్వడానికి రేఖ, ఇందు ప్లాన్

ఇందు కిడ్నాప్ కథ చెప్పిన రాజు

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 9) ఎపిసోడ్ దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన రాజు.. ఇందును కిడ్నాప్ చేసిన కథ చెబుతాడు. ఆ కిడ్నాపర్ ను తనే అని, ఆ సమయంలోనే చక్రాల్లాంటి ఇందు కళ్లు చూసి ఆమె ప్రేమలో పడిపోయానని అంటాడు. అయితే డబ్బు కోసం ఆ ప్రేమను వదులుకున్నానని, కానీ అప్పటి నుంచీ ఆమె ఆలోచనలతోనే గడిపానని చెబుతాడు. మీరు చేసుకున్నది ఉత్తిత్తి పెళ్లి కావచ్చు కదా అని రేఖ అంటుంది.

ఆ రాత్రి శోభనం జరిగిపోయిందంటూ..

అప్పుడు తమ పెళ్లి రిజిస్టర్ చేయించానని, ఫొటోలు కూడా తీయించానని సాక్ష్యాలతో సహా చూయించిన రాజు.. తర్వాత మరో షాకింగ్ అబద్ధం చెబుతాడు. అది విని ఇందు కూడా షాక్ తింటుంది. కిడ్నాప్ చేసిన సమయంలో ఓ రోజు రాత్రి ఇందుని తినమని బతిమాలుతుంటే తినలేదని, అప్పుడే ఓ ఉరుము, మెరుపు రావడంతో ఆమె భయంతో తనను వాటేసుకుందని చెబుతాడు. ఆ తర్వాత తనలో ఏవేవో ఫీలింగ్స్ కలిగి మొత్తం జరిగిపోయిందని అంటాడు. అది విని రేఖ షాక్ తింటుంది. ఇందు అతన్ని మింగేసేలా చూస్తుంది.

తాళి తీసేస్తానన్న రేఖ.. అడ్డుకున్న రాజు

ఇంత చెప్పినా రేఖ మాత్రం కన్విన్స్ కాదు. మీరు చేసుకున్న పెళ్లిపై నమ్మకం లేదని, తాను తాళి తీసేస్తానని రేఖ అంటుంది. ఇందు మెడలో తాళి తీయడానికి ప్రయత్నించగా రాజు ఆమె చేయి పట్టుకొని అడ్డుకుంటాడు. అది చూసి అపర్ణ, సుభాష్ సంతోషిస్తారు. ఇన్నాళ్లకు రేఖకు సరైనోడు వచ్చాడని సంబరపడతారు.

ఇప్పుడు మీరు తాళి తీసేసి రచ్చ చేస్తే తాను మీడియా దగ్గరికి వెళ్తానని రాజు బెదిరిస్తాడు. తన దగ్గర ఉన్న సాక్ష్యాలన్నీ చూపించి దుగ్గిరాల కుటుంబం అల్లుడిని ఇంట్లో నుంచి గెంటేసిందని చెబుతానని అంటాడు. ఇలాగే బెదిరించి తన మెడలో తాళి కట్టాడని, కుటుంబం పరువు పోతుందని తాను ఏమీ అనలేదని ఇందు చెబుతుంది.

హారతిచ్చి స్వాగతం పలికిన భ్రమరాంబ

ఆ తర్వాత ఇందుని తీసుకొని రాజు బయటకు వెళ్తాడు. చివరిసారిగా అడుగుతున్నా.. లోనికి రావాలా లేక మీడియా గడప తొక్కాలా అని వార్నింగ్ ఇస్తాడు. లోనికి రమ్మను అని భ్రమరాంబకు చెప్పి రేఖ వెళ్లిపోతుంది. దీంతో భ్రమరాంబ వాళ్లిద్దరినీ హారతి ఇచ్చి మరీ లోనికి ఆహ్వానిస్తుంది. చూశావా మీ ఆంటీని ఎలా బోల్తా కొట్టించానో అని ఇందుతో అంటాడు రాజు.

రాజుని చూసి ఎమోషనల్ అయిన అపర్ణ, సుభాష్

ఇంట్లోకి వచ్చిన తర్వాత రాజును చూసి అపర్ణ, సుభాష్ ఎమోషనల్ అవుతారు. నువ్వు అచ్చూ మా కొడుకులాగే ఉన్నావని అంటారు. నీ పేరేంటని అడిగితే రాజు అని అంటాడు.. దీంతో వాళ్లు మరింత మురిసిపోతూ తమ కొడుకు పేరు కూడా రాజ్ అని, నీతో ఏదో రక్తం సంబంధం ఉన్నట్లు అనిపిస్తోందని సుభాష్ చెబుతాడు. రాజు తల్లిదండ్రుల పేర్లు అడుగుతారు. అతడు అబద్ధం చెప్పడానికి వెళ్లగా ఇందు నిజం చెప్పేస్తుంది.

రేఖ విడాకుల ప్లాన్

ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇందుని రేఖ నానా మాటలు అంటుంది. కానీ ఇందు మాత్రం డ్రామా రక్తి కట్టిస్తుంది. ఇప్పటికీ మీరు ఏం చెబితే అది చేయడానికి తాను రెడీగా ఉన్నానని అంటుంది. అయితే అతనికి విడాకులు ఇస్తావా అని రేఖ అడుగుతుంది. దీంతో ఇందు, రాజు షాక్ తింటారు. ఇందు ఏం చెబుతుందా అని రాజు ఎదురు చూస్తుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More