Brahmamudi May 6 Episode: బ్రహ్మముడి.. మైండ్ బ్లాంక్ ట్విస్ట్.. రాజును పెళ్లి చేసుకున్న ఇందు.. రేఖ షాక్.. ఇక సినిమాయే..
Brahmamudi May 6 Episode: బ్రహ్మముడి సీరియల్ మే 6 ఎపిసోడ్ లో ఊహకందని ట్విస్ట్ ఎదురైంది. రాజుని ఏకంగా పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొస్తుంది ఇందు. వాళ్లను చూసి ఇటు రేఖ, అటు అపర్ణ షాక్ తింటారు. ఇది సీరియల్ ను పూర్తిగా మలుపు తిప్పనుంది.
Brahmamudi May 6 Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందుని తన కొడుకు మదన్ కు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్న రేఖకు షాక్ తగులుతుంది. ఆమె ఏకంగా రాజును పెళ్లి చేసుకొని ఇంటికి వస్తుంది. ఆస్తి కోసం ఎదురు చూస్తున్న రేఖకు ఇది ఊహించని షాక్ లాంటిదే అని చెప్పొచ్చు.

రాజుకు ఐశ్వర్య ఫోన్.. ఆవేశంతో ఊగిపోతూ.. ఫీలైన లక్కీ
బ్రహ్మముడి సీరియల్ బుధవారం (మే 6) ఎపిసోడ్ ఐశ్వర్యకు రాకేష్ వార్నింగ్ ఇచ్చే సీన్ తో మొదలవుతుంది. ఆంటీ నువ్వు చెప్పినా తనకు సంబంధం లేదని అంటుందని ఐశ్వర్య అనడంతో వారం రోజు టైమ్ ఇచ్చి రాకేష్ వెళ్లిపోతాడు. ఆ వెంటనే రాజుకి ఐశ్వర్య ఫోన్ చేస్తుంది.
మొదట పట్టించుకోని రాజు ఆ తర్వాత ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏంది రా అంటూ ఐశ్వర్య మాట్లాడటంతో రాజు కూడా రెచ్చిపోతాడు. ఆవేశంతో ఊగిపోతూ ఐశ్వర్యపై మండిపడతాడు. ఆమె మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేస్తాడు. అటు ఇది తప్పని అన్నందుకు లక్కీకి కూడా రాజు క్లాస్ పీకుతాడు. దీంతో అతడు ఫీలైపోయి వెళ్లిపోతాడు.
ఇందు పెళ్లి గురించి మాట్లాడిన స్వాతి
ఇటు ఇంట్లో సంతోషంగా వంట చేస్తున్న ఇందు, అపర్ణ దగ్గరికి స్వాతి వస్తుంది. ఆస్తి సేఫ్ అని తెలిసేసరికి ఇద్దరూ చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు అని స్వాతి అంటుంది. ఇక ఇందు అక్కకి పెళ్లి చేసేయాలని అంటుంది. అయితే అపర్ణ మాత్రం తనకు రాబోయే మనవడు ఎలా ఉండాలో పెద్ద లిస్ట్ చెబుతుంది. ఇందుని బాగా చూసుకోవాలని, ఆ రేఖ పీచమణచాలని అంటుంది.
ఇందుకి మదన్‌తో పెళ్లి విషయం చెప్పిన రేఖ
అప్పుడే వాళ్లను రేఖ పిలుస్తుంది. పంతులుగారు వచ్చారు మంచి ముహూర్తం చూస్తున్నారు అని అంటుంది. దేనికి అని అడిగితే ఇందు పెళ్లి కోసం అని అంటుంది. దీంతో అపర్ణ షాక్ తింటుంది. పెళ్లి కొడుకు ఎక్కడ అని అడిగితే.. ఉన్నాడు తన కొడుకు మదన్ అని రేఖ చెబుతుంది. అది విని ఇందు, స్వాతి, అపర్ణ, సుభాష్ లకు నోట మాట రాదు.
అడ్డు చెప్పిన అపర్ణ.. రేపే పెళ్లి అన్న రేఖ
ఈ పెళ్లి కుదరదు అని అపర్ణ అంటుంది. ఈడూజోడూ కుదరాలి.. అమ్మాయికి నచ్చాలి కదా అని చెబుతుంది. దీంతో మదన్, ఇందులను పక్కపక్కనే కూర్చోబెట్టి ఈడూజోడూ చూస్తుంది. చూడముచ్చటగా ఉన్నారని అంటుంది. అయితే ఇందు కంటే మదన్ మూడేళ్లు చిన్నోడన్న విషయం అపర్ణ చెబుతుంది.
అయితే ఏంటి.. ఎంతో మంది పెళ్లి చేసుకుంటున్నారు కదా.. అలా చేసుకోకూడదని రూల్ ఏమీ లేదు కదా అని రేఖ అంటుంది. రేపే మంచి ముహూర్తం ఉందని పంతులుతో బలవంతంగా చెప్పిస్తుంది. మంచి పట్టుచీర కొందామని ఇందుతో అంటుంది.
పెళ్లి చేసుకోవద్దని ఇందుకి నచ్చజెప్పిన అపర్ణ, స్వాతి
అది విని అపర్ణ ఆవేశంతో రగిలిపోతుంది. లోనికి వెళ్లిన తర్వాత ఈ పెళ్లి చేసుకోవద్దని అపర్ణ, స్వాతి ఆమెకు నచ్చజెప్తారు. కానీ రేఖ ఏదైనా అనుకుంటే చేసి తీరుతుందని ఇందు అంటుంది. అయితే వేలి ముద్ర వేసినట్లుగా తల వంచుకొని పెళ్లి కూడా చేసుకుంటావా అని ఇందుని అపర్ణ నిలదీస్తుంది. ఎందుకు అంతలా భయపడుతున్నావని అడుగుతుంది. మీకోసమే అని ఆమె అనడంతో ఎవరి కోసమో నీ జీవితం నరకం చేసుకోవద్దు.. ఇష్టం లేని పెళ్లి వద్దు అని అపర్ణ వారిస్తుంది. అటు స్వాతి కూడా అదే విషయం చెబుతుంది.
మదన్‌ను ప్రేమిస్తున్న విషయం చెప్పిన స్వాతి
ఆ తర్వాత స్వాతి బయట ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్లిన ఇందు ఏమైందని అడుగుతుంది. తాను ఓ వ్యక్తిని ప్రేమించానని, ఇక అతన్ని పెళ్లి చేసుకోవడం కుదరదు అని అంటుంది. ఎవరా వ్యక్తి అని అడిగితే రేపు నువ్వు పెళ్లి చేసుకోబోయే మదన్ అని చెబుతుంది. అది విని షాక్ తిన్న ఇందు.. ఈ పెళ్లి జరగదు అని ఆమెకు మాట ఇస్తుంది.
రాజును పెళ్లి చేసుకున్న ఇందు
మరుసటి రోజు మదన్ తో ఇందు పెళ్లికి రేఖ ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. కానీ ఇందుని ఎవరో ఎత్తుకెళ్లిపోయారంటూ భ్రమరాంబ వచ్చి చెబుతుంది. అది అపర్ణ పనే అని అనుమానించిన రేఖ ఆమె నుదుటికి గన్ను పెట్టి మరీ నిజం చెప్పమని బెదిరిస్తుంది. అప్పుడే ఇందుని పెళ్లి చేసుకొని వచ్చిన రాజు.. ఆగండి అని అంటాడు. వాళ్లను చూసి అపర్ణ, రేఖ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


