Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి.. ఇందుని మోసం చేసిన రాజు.. ఐశ్వర్య ప్లాన్ సక్సెస్.. మళ్లీ రేఖ గుప్పిట్లోకి ఇందు

Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి సీరియల్ మే 1 ఎపిసోడ్ లో ఇందుని రాజు మోసం చేస్తాడు. అతన్ని నమ్మి మళ్లీ రేఖ గుప్పిట్లోకి వెళ్లిపోతుంది ఇందు. ఐశ్వర్య ప్లాన్ సక్సెస్ అవుతుంది. కానీ రాజు ప్రేమలో ఓడిపోతాడు.

Published on: May 1, 2026, 08:31:02 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఐశ్వర్య ప్లాన్ సక్సెస్ అయి.. డబ్బు ఒత్తిడిలో రాజు దిగి వస్తాడు. ఇందుని మోసం చేసి మళ్లీ రేఖకు అప్పగిస్తాడు. అతనిపై ఎంతో నమ్మకం పెట్టుకున్న ఇందుకి చివరికి తీవ్ర నిరాశే ఎదురవుతుంది.

Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి.. ఇందుని మోసం చేసిన రాజు.. ఐశ్వర్య ప్లాన్ సక్సెస్.. మళ్లీ రేఖ గుప్పిట్లోకి ఇందు
Brahmamudi May 1st Episode: బ్రహ్మముడి.. ఇందుని మోసం చేసిన రాజు.. ఐశ్వర్య ప్లాన్ సక్సెస్.. మళ్లీ రేఖ గుప్పిట్లోకి ఇందు

ఇందుకి రాజ్ మిడిల్'క్లాస్'

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మే 1) ఎపిసోడ్ ఇందుకి డబ్బు గురించి, మిడిల్ క్లాస్ కష్టాల గురించి రాజు క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. మిడిల్ క్లాస్ వాళ్లకు డబ్బు ఎంత అవసరమో అతడు చెబుతాడు. డబ్బులో పుట్టి పెరిగిన నీకు అది పెద్ద విషయం కాకపోవచ్చు కానీ.. డబ్బే అన్నీ ఇస్తుందని రాజు అంటాడు. డబ్బు కోసం తనలాంటి వాళ్లు పడే కష్టాల గురించి చెబుతాడు. అదంతా విన్న ఇందు.. వీడు మంచోడే కానీ కాస్త డబ్బు పిచ్చి ఎక్కువ అని అనుకుంటుంది.

ఐశ్వర్యకు ఫోన్ చేసి బెదిరించిన రాకేష్

ఇటు ఐశ్వర్యకు రాకేష్ మరోసారి ఫోన్ చేస్తాడు. తనకు వెంటనే డబ్బు కావాలని అంటాడు. తనకు డబ్బులు రావాల్సి ఉందని, అవి రాగానే ఇచ్చేస్తానని ఐశ్వర్య చెప్పినా వినడు. వెంటనే ఇవ్వకపోతే మీ ఆంటీ దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పేస్తానని బెదిరిస్తాడు. దీంతో ఐశ్వర్యలో టెన్షన్ మొదలవుతుంది.

రేఖకు ఐశ్వర్య ప్లాన్

వెంటనే రేఖ దగ్గరికి వెళ్లి ఇందు కిడ్నాప్ విషయం ఎంత వరకు వచ్చిందని అడుగుతుంది. డబ్బు సరిపోవడం లేదని, కేవలం రూ.20 లక్షలే ఉన్నాయని చెబుతుంది. అంతే ఇస్తామని కిడ్నాపర్లకు చెప్పమని అంటుంది. రూ.50 లక్షలకే ఒప్పుకోలేదు.. 20 లక్షలకు అస్సలు ఒప్పుకోరని రేఖ చెబుతుంది. ఓసారి ఫోన్ చేసి చూడండి అని ఐశ్వర్య అంటుంది.

రాజుకు రేఖ ఫోన్.. 20 లక్షలు వద్దంటూ..

సరే అని రాజుకి రేఖ ఫోన్ చేస్తుంది. డబ్బు రెడీ అయిందని అంటుంది. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెబుతానని రాజు అంటాడు. కానీ కోటి కాదు రూ.20 లక్షలే ఉన్నాయని అనడంతో రాజు కోప్పడతాడు. 50 లక్షలే వద్దంటే 20 లక్షలు ఎలా తీసుకుంటాను.. కుదరదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

రాజుకు ఫోన్ చేసి క్లాస్ పీకిన ఐశ్వర్య

అది విన్న ఐశ్వర్య మరోసారి తన గదిలోకి వెళ్లి రాజుకు ఫోన్ చేస్తుంది. 20 లక్షలకు ఎందుకు ఒప్పుకోవడం లేదు.. మా ఆంటీ దగ్గర అంత కన్నా ఎక్కువ లేవు.. ఆలస్యం చేస్తే నాకు ప్రాబ్లెమ్ అవుతుంది అని అంటుంది. అవి తీసుకొని ఇందుని వదిలెయ్యమని చెబుతుంది.

అటు రాజుకు కూడా సాహు ఇచ్చిన 24 గంటల గడువు గుర్తుకు వస్తుంది. దీంతో చేసేది లేక సరే అంటాడు. వెంటనే రేఖకు ఫోన్ చేసి 20 లక్షలు అయినా సరే అని అంటాడు. ఎక్కడికి, ఎప్పుడు రావాలో చెబుతానని అనడంతో రేఖతోపాటు ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు. ఇటు 20 లక్షలకు ఎందుకు ఒప్పుకున్నావని లక్కీ నిలదీస్తాడు. కానీ తన పరిస్థితి గురించి చెప్పి రాజు అతన్ని కన్విన్స్ చేస్తాడు.

ఇందుని గుడికి తీసుకొచ్చిన రాజు, లక్కీ

ఇందుకి ఏదో అబద్ధం చెప్పి గుడికి తీసుకొస్తారు రాజు, లక్కీ. ఇంత దైవభక్తి సడెన్ గా ఏంటి అని ఇందు అంటుంది. ఆమెను రేఖకు అప్పగించబోతున్నానని రాజు బాధగా ఉంటాడు. నీపై నాకు నమ్మకం ఉందని ఇందు అనడంతో రాజు మరింత బాధపడతాడు. గుడి చుట్టూ తిరిగి అమ్మావారికి మొక్కుకుంటే అనుకున్నవి జరుగుతాయని చెప్పి ఇందుని పంపిస్తాడు రాజు. తర్వాత లక్కీకి డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలో చెబుతాడు.

ఇందుని తీసుకెళ్లిన రేఖ

అటు ఇందుని తీసుకురావడానికి రేఖ, భూషణ్ బయలుదేరుతారు. గుడిలో అమ్మవారికి తనను కష్టాల నుంచి గట్టెక్కించమని ఇందు మొక్కుకుంటుంది. వెనక్కి తిరగగానే ఆమె ముందు రేఖ ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే ఇందు షాక్ తింటుంది. వెంటనే ఇందుని రేఖ లాక్కెళ్తుంది. చాటు వాళ్లను రాజు చూస్తుంటాడు. వెనక్కి తిరిగి రాజుని చూస్తూ ఇందు బాధపడుతుంది. అటు డబ్బు అందిందని లక్కీ వచ్చి చెబుతాడు. అయితే ఇందుని మోసం చేసి మళ్లీ ఆమెను రేఖ గుప్పిట్లోకి పంపించిన రాజు బాధపడుతుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More