బ్రహ్మముడి జూన్ 22 ఎపిసోడ్: మ్యారేజ్ సర్టిఫికేట్‌తో నందు ఎంట్రీ- వీడియోతో తప్పించుకుని సంతకంతో రేఖకు దొరికిపోయిన ఇందు!

Brahmamudi Serial June 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 22వ ఎపిసోడ్‌‌లో పార్టీలో రాజు తాగి వాగిన వీడియోను ఐశ్వర్య ప్లే చేస్తుంది. అది చూసి అంతా షాక్ అయి ఇందు, రాజులను నిలదీస్తారు. మ్యారేజ్ సర్టిఫికేట్‌తో నందు ఎంట్రీ ఇచ్చి ఇద్దరిని కాపాడుతుంది. ఐశ్వర్య ప్లాన్ రివర్స్ అవుతుంది.

Published on: Jun 22, 2026, 09:11:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు, రేఖ ఇచ్చే పార్టీలో మదన్ దగ్గర ఐస్‌క్రీమ్ లాగేసుకుంటుంది స్వాతి. తనకు ఓ ఐస్‌క్రీమ్ తీసుకొచ్చి ఇస్తే ఇస్తానంటుంది. మదన్ సీరియస్‌గా, స్వాతి సరదాగా గొడవ పడతారు.

బ్రహ్మముడి సీరియల్ జూన్ 22 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 22 ఎపిసోడ్

ఆ పెళ్లి రేఖ జరగనివ్వదుగా

అది చూసిన భ్రమరాంబ మురిసిపోతుంది. వీళ్ల జంట చూడముచ్చటగా ఉందని అంటే.. రేఖ పెళ్లి జరగనివ్వదుగా అని శేషు అంటాడు. ఓ ఐడియా. స్టేజీ మీదకు వెళ్లి మదన్, స్వాతి పెళ్లి చేసుకోబోతున్నారని చెబితే తర్వాత రేఖ ఏం చేయలేదుగా అని భ్రమరాంబ అంటుంది. రిస్క్ చేస్తున్నావేమో అని శేషు అంటే.. తప్పదని భ్రమరాంబ వెళ్తుంది.

అప్పటికి ప్రొజెక్టర్ ప్లే చేసే అతనికి పెండ్రైవ్ ఇచ్చి వీడియో ప్లే చేయమంటుంది ఐశ్వర్య. లక్కీతో రాజు నిజం చెప్పిన వీడియో చూసి అంతా షాక్ అవుతారు. ఏం బాబు అద్దె మొగుడిగా వచ్చావా అని భ్రమరాంబ, మమ్మల్ని వెర్రోళ్లను చేశారా అని భూషణ్ అంటారు. అమ్మా ఇందు మీ పెళ్లి నిజం కాదా అని అపర్ణ అడుగుతుంది. రేఖ కూడా ఇద్దరిని నిలదీస్తుంది.

ఐశ్వర్య చప్పట్లు కొడుతుంది. ఇదంతా నిజమని చెబుతుంది. నేను మీకు చెబితే నమ్మలేదు. అందుకే అందరి ముందు వీడియో ప్లే చేశాను. ఏం రాజు నీ ఫ్రెండ్ నాలుగు పెగ్గులు పోసేసరికి నిజం చెప్పేశావా అని ఐశ్వర్య అంటుంది. ఆంటీ ఇదంతా అబద్ధం. ఐశ్వర్య కావాలనే చేస్తుంది. ఆంటీ నమ్మకండి అని ఇందు అంటుంది.

మ్యారేజ్ సర్టిఫికెట్‌తో నందు

మరి మీకు పెళ్లి జరిగినట్లు సాక్ష్యం చూపిస్తావా అని ఐశ్వర్య అడుగుతుంది. ఇలా దొరికిపోయానేంట్రా బాబు అని రాజు అనుకుంటాడు. ఇందు ఏం సమాధానం ఇవ్వదు. అంటే ఈ వీడియో నిజమేగా. సాక్ష్యం ఉందా అని ఐశ్వర్య అడుగుతుంది. సాక్ష్యం ఉంది అని నందు ఎంట్రీ ఇస్తుంది. వీళ్లిద్దరికి పెళ్లయిందని నా దగ్గర సాక్ష్యం ఉంది. అది మ్యారేజ్ సర్టిఫికేట్ అని నందు చెబుతుంది.

పోలీసుల సమక్ష్యంలోనే వీళ్ల పెళ్లి రిజిస్టర్ అయింది. ఇదిగోండి మ్యారేజ్ సర్టిఫికేట్ అని రేఖకు ఇస్తుంది నందు. అది రేఖ చూస్తుంది. ఐశ్వర్య కూడా చూస్తుంది. ఇందుగారు నన్ను పార్టీకి ఇన్వైట్ చేశారు. ఈ సర్టిఫికెట్ ఇచ్చి నేను సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నాను. కానీ, ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది అని నందు అంటుంది.

ఆంటీ ఇది నిజం కాదు. వాళ్ల అమ్మలాగే ఇందు అందరిని ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేస్తుంది. సీఈఓ చైర్ నుంచి నిన్ను దించి అది కూర్చుంది ఆంటీ అని ఐశ్వర్య అంటుంది. ఐషు.. ఇందు సర్టిఫికేట్ ఒకే మరి ఈ వీడియో ఏంటీ అని రేఖ అడుగుతుంది. ఆంటీ అది.. ఏఐ.. ఏఐ జెనరేటెడ్ వీడియో అని ఇందు అంటుంది.

ఆడియో అబద్ధం

అవును పిన్ని ఆ వీడియో నిజమే. కానీ ఆడియో అబద్ధం. ఐశ్వర్య చెబుతుందిగా తనే ప్రూఫ్ కోసం వీడియో తీశానని, తను అనుకుంది ఏఐతో అలా చేయించింది. నా పెళ్లి గురించి నేనెందుకు అలా అంటాను. మొగుడని అయిండి అద్దె మొగుడు అని ఎలా చెప్పుకుంటాను. వీడియోలో ఉన్న ఆడియో అబద్ధం అని రాజు అంటాడు.

నా ఫ్రెండ్‌తో చాలా కాలం తర్వాత మందు సిట్టింగ్‌లో కూర్చుని మాట్లాడుకుంటుంటే దొంగచాటుగా వీడియో తీయడం ఏంటీ. దానికి ఏదేదో ఆడియో వేసి నా కాపురం పాడు చేయాలని చూడటం ఏంటీ. ఏంటీ పిన్నీ ఇంకా నమ్మట్లేదా. ఇప్పుడే ప్రూవ్ చేస్తానని ఐశ్వర్య వీడియో తీస్తాడు రాజు. అది రేఖకు చూపిస్తాడు.

మా రేఖ ఆంటీ తెలివితక్కువ దద్దమ్మా. అందుకే దాన్ని తింగరిదాన్ని చేద్దామని ఇలా వీడియో క్రియేట్ చేసి ప్లే చేశాను అని ఐశ్వర్య చెప్పినట్లుగా వీడియో ఉంటుంది. మీ కళ్లముందే ఫొటో ప్లస్ వీడియో, ఆడియోతో ఎలా చేశానో అని రాజు అంటాడు. నా పరువు తీశావే. ఇలా అందరిముందు మతిలేనిదానిలా చేస్తావా అని ఐశ్వర్యను తిడుతుంది రేఖ.

ముందుగానే ప్లాన్ చేసిన ఇందు

డిస్టర్బన్స్‌కు సారీ. పార్టీ అయిపోయింది. ఇక అందరు వెళ్లిపోవచ్చని రేఖ అంటుంది. అలా రాజు, ఇందులను నందు కాపాడుతుంది. అంతా వెళ్లిపోతారు. ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇదంతా ఎలా ప్లాన్ చేశావని ఇందును అడుగుతుంది ఐశ్వర్య. ఐశ్వర్య పెండ్రైవ్‌లో వీడియో కాపీ చేసింది ఇందు చూస్తుంది. అది గుర్తుకు చేసుకున్న ఇందు దీని నుంచి ఎలాగైనా బయటపడాలని అనుకుంటుంది.

ఆరోజు రేఖ ఆంటీని తీసుకొచ్చినప్పుడే అనిపించింది. నన్ను ఏదోరోజు ఇరికిస్తావని అని ఇందు అంటుంది. ఏదో తప్పించుకున్నా అని మురిసిపోకు అని ఐశ్వర్య అంటే.. ఛీ నోర్మూయ్. కిడ్నాప్ చేసినప్పుడే కొట్టి బుద్ధి చెప్పాను. ఇంకోసారి ఇలా చేస్తే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ఇందు. నిన్ను నేను కూడా విడిచిపెట్టను. మీ బాగోతం బయటపెడతాను అని ఐశ్వర్య అనుకుంటుంది.

తర్వాత నందుకు థ్యాంక్స్ చెబుతుంది ఇందు. చాలా భయపడ్డాను అని ఇందు అంటే.. నువ్వేగా మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకురమ్మన్నావ్. ఇంకెందుకు భయం అని నందు అంటుంది. నువ్వు టైమ్‌కి వస్తావో లేదో అని ఇందు అంటుంది. ఇలాంటివి ఉంటే ముందే చెప్పు అక్క. సడెన్‌గా ఇలాంటివి రెడీ చేయాలంటే చాలా కష్టం. నా తలప్రాణం తోకకు వచ్చిందని నందు అంటుంది.

కండిషన్ బ్రేక్ చేస్తావా

ఐశ్వర్యకు నేను అంటే అస్సలు పడట్లేదు. సీఈఓ అయినప్పటి నుంచి పగ మరింత పెంచుకుంది. ఆ రాజుగాడి కూడా బయట ఎక్కడ వాగకని చెప్పాను. వాడి సంగతి చెబుతాను అని ఇందు అంటుంది. అది సరే నానమ్మకు ఎంతో కొంత డౌట్ వచ్చే ఉంటుందిగా అని నందు అంటుంది. తర్వాత ఇందును చూసి భయపడతాడు రాజు. కొంచెం కూడా బుద్ధిలేదా. ఏది పడితే అది మాట్లాడతవా అని ఇందు అరుస్తుంది.

ఐశ్వర్య వెనుక ఉండి ఇంత చేయిస్తుందనుకోలేదు. మందు పడితే నిజాలు వస్తాయిగా అని రాజు అంటాడు. నోర్మూయ్. మన డీల్ గురించి ఎవరికి చెప్పొద్దని కండిషన్ పెట్టుకున్నాం కదా. మరి ఎందుకు బ్రేక్ చేశావని ఇందు అడుగుతుంది. అనుకోకుండా అలా జరిగిపోయిందని రాజు అంటాడు. నువ్వే నన్ను నిలువునా ముంచేలా ఉన్నావ్. తిండి డబ్బు ఉంటే చాలు ఎదుటివాళ్లను పట్టించుకోవు అని ఇందు అంటుంది.

నేను ఇదివరకు కాపాడానుగా. ఇవాళ నన్ను కాపాడావ్. ఇద్దరం పార్టనర్స్‌మే కదా అని రాజు అంటాడు. తర్వాత రోజు ఆఫీస్‌లో నగల డిజైన్స్ డీల్ వస్తుంది. తనకు డిజైన్స్ నచ్చితే కాంట్రాక్ట్ ఓకే చేసుకుందామని క్లైంట్ చెబుతాడు. దానికి ఇందు సరేనంటుంది. అగ్రిమెంట్ మీద సైన్ చేసి ఇందుకు ఇస్తాడు క్లైంట్.

సంతకంతో దొరికిపోయిన ఇందు

ఆ సంతోషంలో ఇందు కూడా సైన్ చేస్తుంది. ఇందు సైన్ చేయడం చూసి రేఖ, భూషణ్ ఇద్దరు షాక్ అయిపోతారు. వీడియోతో తప్పించుకున్న ఇందు సంతకంతో దొరికిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More