బ్రహ్మముడి జూలై 2 ఎపిసోడ్: 20 ఏళ్ల క్రితం జరిగింది మర్చిపోయారా? అపర్ణపై రాజు తండ్రి ఫైర్- రేఖ బ్యాచ్‌కు దిమ్మతిరిగే షాక్

Brahmamudi Serial July 2 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ ఎపిసోడ్‌‌లో రాజు షర్ట్‌ను ఇందు కాల్చేస్తుంది. చలపతి, లక్ష్మీ వస్తారు. రాజు పెళ్లి చేసుకున్నట్లు చెప్పడంతో చెంప చెల్లుమనిపిస్తాడు చలపతి. ఇందుకు విడాకులు ఇచ్చేయమంటాడు తండ్రి. అపర్ణ మధ్యలో దూరితే 20 ఏళ్ల క్రితం జరిగింది మర్చిపోయారా అంటాడు.

Published on: Jul 2, 2026, 08:41:18 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు ఇస్త్రీ చేసుకుంటే రాజు వచ్చి తన షర్ట్ కూడా చేయమంటాడు. ఇందు చేయనంటుంది. అమ్మమ్మను అడుగుతానని రాజు అంటే.. ఇందు ఆపుతుంది. బ్లాక్ మెయిల్ చేస్తున్నాననుకో అని రాజు వెళ్తుంటే ఇందు ఆగమని రాజు షర్ట్ ఐరన్ చేస్తానంటుంది.

బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూలై 2వ ఎపిసోడ్

రాజు షర్ట్ కాల్చిన ఇందు

షర్ట్ మల్లెపూవులా కనిపించాలని చెప్పి వెళ్లిపోతాడు రాజు. నన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా అని రాజు షర్ట్ కాల్చేస్తుంది ఇందు. అది చూసిన రాజు ఐరన్ బాక్సుతో వాత పెడతానని ఇందు వెంటపడతాడు. హాల్లో అందరిముందు అటు ఇటు తిరుగుతారు రాజు, ఇందు. అప్పుడే వచ్చిన రేఖ ఇంకాసేపట్లో ఈ నవ్వులన్నీ పోతాయి. చాలా బాధపడుతారని భ్రమరాంబకు చెబుతుంది.

ఇందును పట్టుకున్న రాజు సారీ చెప్పమని అడుగుతాడు. అప్పుడే రాజు తల్లిదండ్రులు చలపతి, లక్ష్మీలు వస్తారు. ఇప్పుడుంటుంది అసలైన తుఫాన్ అని భ్రమరాంబతో అంటుంది రేఖ. రాజును ఈ ఇంట్లో ఎందుకు ఉంటున్నావని నిలదీస్తారు తల్లిదండ్రులు. మీరు బిజినెస్ చేస్తే ఇలా ఆడుతుపాడుతు ఉండరుగా. ఈ అమ్మాయి బిజినెస్ పార్టనరా.. లైఫ్ పార్టనరా అని చలపతి నిలదీస్తాడు.

ఇప్పటికైనా నిజం చెప్పు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావా అని గట్టిగా నిలదీస్తాడు చలపతి. అంకుల్ నేను చెబుతాను అని ఇందు అంటే.. ఇది తండ్రి కొడుకు విషయం. నువ్వు మధ్యలోకి రాకమ్మా అని చలపతి అంటాడు. పెళ్లి చేసుకున్నావా లేదా అని చలపతి అడిగితే.. చేసుకున్నాను అని రాజు అంటాడు. దాంతో రాజును లాగి చెంపదెబ్బ కొడతాడు చలపతి.

20 ఏళ్ల క్రితం జరిగింది మర్చిపోయారా

నీ అమ్మనాన్న చనిపోయావుకున్నావా. మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావంటే అప్పుడే అంత గొప్పవాడివయ్యావా అని చలపతి అంటే.. ఏంట్రా ఇది. ఏది అయితే జరగొద్దనుకున్నానో అదే జరిగిందని తల్లి లక్ష్మీ అంటుంది. ఇలాంటి గొప్పింటికి అల్లుడు కావొద్దనుకున్నా. అలాగే అయ్యావ్. నేను అడిగింది చేస్తావా. జరిగిందేదో జరిగిపోయింది. ఈ పెళ్లి మాకిష్టం లేదు. నువ్వు అల్లుడిగా ఈ ఇంట్లో ఉండటం వద్దు. ఈ అమ్మాయితో బంధం తెంచేసుకో. ఇందుకు విడాకులు ఇచ్చేయ్ అని చలపతి అంటాడు.

రేఖ బ్యాచ్ నవ్వుతుంది. అబ్బాయి, అమ్మాయి ఇష్టపడ్డారు. మీకు చెప్పలేదు. అలా అని మూడుముళ్ల బంధాన్ని తెంచేస్తారా అని అపర్ణ అంటుంది. ఈ బంధం ఎప్పటికీ నిజం కాదు. 20 ఏళ్ల క్రితం మీ జీవితాల్లో ఏం జరిగిందో అప్పుడే మర్చిపోయారా. అది యాక్సిడెంట్ అని మీరంటున్నారు. కానీ, బయటివాళ్లు నానా రకాలుగా మాట్లాడుతున్నారు అని చలపతి అంటాడు.

మీ గొప్పింటి వాళ్లు బాగా లేకపోతే ఏమైనా చేస్తారు. చివరికి ప్రాణాలు అయినా తీయడానికైనా చూస్తారు. నా కొడుకు ప్రాణాలతో ఉండాలంటే ఈ ఇంట్లో ఉండకూడదు అని చలపతి అంటాడు. హో.. వీళ్ల భయం ఇదా అని రేఖ సంతోషిస్తుంది. పదా వెళ్లిపోదాం అని రాజును లాక్కెళ్తాడు చలపతి. కానీ, గుమ్మం దగ్గర రాజు ఆగిపోతాడు.

ఇందుకిచ్చిన మాట

ఇందుకు ఇచ్చిన ప్రామిస్ గుర్తు చేసుకుంటాడు. ఏంట్రా ఆగిపోయావని చలపతి అడుగుతాడు. నేను రాను, నేను రాలేను అని రాజు అంటాడు. రేఖ బ్యాచ్ షాక్ అవుతుంది. తండ్రిగా, తల్లిగా పిలుస్తున్నామని చలపతి, లక్ష్మీ అంటారు. నార్మల్‌గా అయితే వచ్చేవాన్ని. కానీ, ఇప్పుడు ఇందు భర్తని. జీవితాంతం తోడుగా ఉంటానని తాళి కట్టిన నన్ను మధ్యలో వదిలేసి రావాల. ఇది కరెక్ట్ అంటారా అని రాజు అంటాడు.

నన్ను క్షమించండి నాన్న. నేను మీతో రాలేను. నా భార్యను నా ఇంటిని వదిలేసి ఎక్కడికి రాలేను అని రాజు చెబుతాడు. విషయం అంతవరకు వచ్చిందా. అయితే నీకు మేము కావాలో ఆ అమ్మాయి కావాలో తేల్చుకో అని చలపతి షాకింగ్ మెలిక పెడతాడు. కన్నవాళ్లను, కట్టుకున్నదాన్ని ఎలా కాదంటాడని అపర్ణ అంటుంది. ఇది మా విషయం మీకు సంబంధం లేదని చలపతి అంటాడు.

భ్రమరాంబ, రేఖ మరింత రెచ్చగొడతారు. రేఖ ఇంకా ఆపుతావా అని అపర్ణ వారిస్తుంది. రేఖను చూసి శ్రుతి చెప్పింది గుర్తుకు తెచ్చుకున్న చలపతి, లక్ష్మీ మరింత భయపడతారు. మీరు ఇలా చేయకండని సుభాష్ అంటాడు. మీకు దండం పెడతాను. ఇది నా కొడుకు విషయం. రేయ్ నీకు కన్నవాళ్ల ప్రేమ కావాలా, లేక ఈ ఖరీదైన ఇల్లు కావాల అని చలపతి అడుగుతాడు.

తల్లిదండ్రులను కాదన్న రాజు

రాజు సైలెంట్‌గా ఉండిపోతాడు. తల్లి బతిమిలాడుతుంది. వాడు రాడు లక్ష్మీ అని చలపతి అంటాడు. ఇద్దరు వెళ్లిపోతారు. దాంతో రేఖ, ఐశ్వర్య బ్యాచ్ ప్లాన్ ఫెయిల్ అయి దిమ్మతిరిగే షాక్ ఎదురవుతుంది. తర్వాత గదిలో నువ్వు ఇక్కడ ఉండటంలో అర్థం లేదని ఇందు అంటుంది. నేను ఇక్కడ ఉండటానికి చాలా అర్థం ఉంది, కారణాలు ఉన్నాయి. అదే మనిద్దరి మధ్య ఉన్న బంధం అని రాజు అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More