బ్రహ్మముడి ఫిబ్రవరి 18 ఎపిసోడ్: రుద్రాణి గుట్టు బట్టబయలు.. కుట్ర మొత్తం ఆమెదే అని తెలుసుకున్న అప్పు.. ఇంటికి మరో ఇందిర

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ లో రౌడీల దగ్గరి నుంచి తప్పించుకున్న అప్పు, కల్యాణ్.. ఈ కుట్ర వెనుక ఉన్నది రుద్రాణియే అని తెలుసుకుంటుంది. అటు ధాన్యలక్ష్మి తన తప్పు తెలుసుకుంటుంది.

Published on: Feb 18, 2026, 07:14:34 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 959వ ఎపిసోడ్ మరో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చింది. రుద్రాణి కుట్రలకు ఇక తెరపడే టైమ్ దగ్గర పడినట్లు అనిపిస్తోంది. అప్పు, కల్యాణ్ లను రాజ్, కావ్య విడిపించడం, ఆమె ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడంతో కథ కీలకమైన మలుపు తిరిగింది.

బ్రహ్మముడి ఫిబ్రవరి 18 ఎపిసోడ్: రుద్రాణి గుట్టు బట్టబయలు.. కుట్ర మొత్తం ఆమెదే అని తెలుసుకున్న అప్పు.. ఇంటికి మరో ఇందిర
బ్రహ్మముడి ఫిబ్రవరి 18 ఎపిసోడ్: రుద్రాణి గుట్టు బట్టబయలు.. కుట్ర మొత్తం ఆమెదే అని తెలుసుకున్న అప్పు.. ఇంటికి మరో ఇందిర

హోర్డింగ్ చూసి అడ్రెస్ తెలుసుకున్న రాజ్

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఫిబ్రవరి 18) ఎపిసోడ్ రాజ్, కావ్యలను కిడ్నాపర్లు తప్పుదోవ పట్టించే సీన్ తో మొదలవుతుంది. వాళ్లు తప్పుడు అడ్రెస్ కు వెళ్తారు. కానీ వీడియోను బాగా చూసిన రాజ్, కావ్య.. అందులో కిటికీలో నుంచి కనిపించిన ఓ హోర్డింగ్ చూస్తాడు. దానికి ఫోన్ చేసి వాటిని ఎక్కడెక్కడ పెట్టారో తెలుసుకుంటాడు. దాని ద్వారా అప్పు, కల్యాణ్ లను కిడ్నాపర్లు పట్టుకొని ఉంచిన ప్లేస్ ను కనిపెడతాడు.

అప్పుకి నొప్పులు.. ప్రాధేయపడిన కల్యాణ్

మరోవైపు నెలలు నిండటంతో అప్పుకి నొప్పులు మొదలవుతాయి. ఆమె విపరీతమైన నొప్పులతో ఏడుస్తూ ఉంటుంది. దీంతో కల్యాణ్ కిడ్నాపర్లను ప్రాధేయపడతాడు. తమను విడిచిపెట్టాలని వేడుకుంటాడు. తమ సార్ వద్దన్నాడంటూ కావాలని మరోసారి రాజ్ ను ఇరికించే ప్రయత్నం వాళ్లు చేస్తారు. మా అన్నయ్య ఇలాంటి పని చేయడని కల్యాణ్ అంటాడు. అప్పుడే రాజ్, కావ్య ఆ ఇంటి దగ్గరికి వస్తారు. కిటికీలో నుంచి అప్పు, కల్యాణ్ లను చూస్తారు.

రౌడీలతో రాజ్, కావ్య ఫైట్

తెలివిగా రౌడీల కళ్లు కప్పి ఆ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ అప్పు, కల్యాణ్ ల కట్లు విప్పుతుండగా రౌడీలు వస్తారు. వాళ్లను పట్టుకుంటారు. కానీ రాజ్, కావ్య వాళ్లతో ఫైట్ చేస్తారు. ఓవైపు కల్యాణ్, కావ్య కలిసి అప్పుని బయటకు తీసుకెళ్తారు. మరోవైపు రాజ్ రౌడీలతో ఫైట్ చేస్తుంటాడు. కల్యాణ్, అప్పు తప్పించుకుంటారు. ఇటు రాజ్ ను రౌడీలు చితకబాదుతారు.

వాళ్లను చంపేయమన్న రుద్రాణి

కల్యాణ్, అప్పు కనిపించకపోవడంతో రౌడీలు రుద్రాణికి ఫోన్ చేసి విషయం చెబుతారు. దీంతో ఆమె వాళ్లను తిడుతూ ముందు పట్టుకొని చంపేయండి.. లేదంటే నేను ఇరుక్కుపోతానని అంటుంది. దీంతో రౌడీలు వాళ్ల కోసం వెతికి అప్పు, కల్యాణ్ లను పట్టుకుంటారు. కల్యాణ్ ముందే అప్పుని కత్తితో పొడిచి చంపడానికి వెళ్తారు. అప్పుడే రాజ్ ఎంట్రీ ఇస్తాడు. వాళ్లందరినీ చితకబాదుతాడు. ఇంతలో కావ్య కారు తీసుకొచ్చి కల్యాణ్, అప్పులను తీసుకెళ్తుంది.

హాస్పిటల్లోనూ ధాన్యలక్ష్మి రచ్చ.. తల్లికి క్లాస్ పీకిన కల్యాణ్

కావ్య వాళ్లను హాస్పిటల్ కు తీసుకొస్తుంది. ఆపరేషన్ థియేటర్లో అప్పు నొప్పులతో బాధపడుతుంది. అప్పుడే ఇంట్లో వాళ్లందరూ అక్కడికి వస్తారు. అక్కడ కూడా ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుంది. రాజ్ నే నిందిస్తుంది. అది విని కల్యాణ్ ఆవేశం కట్టలు తెంచుకుంటుంది.

అసలు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా.. అన్నయ్య నన్ను కిడ్నాప్ చేయించడమేంటి.. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మమ్మల్ని కాపాడాడు.. అన్నయ్య లేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేదో అని కల్యాణ్ తన తల్లికి కాస్త గట్టిగానే క్లాస్ పీకుతాడు. దీంతో ఇంట్లో వాళ్లందరు కూడా ధాన్యాన్ని తిడతారు. ఇప్పటికైనా రాజ్, కావ్య గురించి తెలుసుకో అని చెబుతారు. ఇంటికి వచ్చిన తర్వాత రాజ్, కావ్య కూతురికి బారసాల ఏర్పాటు చేస్తారు. తన కూతురికి నాన్నమ్మ ఇందిరా దేవి పేరు పెడతాడు రాజ్.

రుద్రాణి గుట్టు రట్టు

అప్పు తన ప్రసవం తర్వాత వెంటనే అసలు ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరో తెలుసుకునే పనిలో పడుతుంది. పోలీసులు పట్టుకున్న రౌడీల దగ్గరికి వెళ్తుంది. ఈ విషయాన్ని రేఖ అప్పుడే తన తల్లికి ఫోన్ చేసి చెబుతుంది. అటు రౌడీలు తమ ఫోన్లో ఉన్న రుద్రాణి ఫొటో చూపించి ఈమెనే తమకు డబ్బులు ఇచ్చి ఈ పని చేయించిందని చెబుతారు. దీంతో అప్పు, కల్యాణ్ షాక్ తింటారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More