బ్రహ్మముడి ఫిబ్రవరి 16 ఎపిసోడ్: రేవతి ఇంటికి రాజ్, కావ్య- కల్యాణ్, అప్పును చంపేయమన్న రుద్రాణి- కత్తితో పొడిచిన రౌడీ!
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 16 ఎపిసోడ్‌లో ధాన్యలక్ష్మీ నిందించడంతో రాజ్, కావ్య పాపను తీసుకుని ఇంట్లోంచి వెళ్లిపోతారు. రాజ్ అక్క రేవతి ఇంట్లో ఉంటారు. రాజ్, కావ్య రేవతి ఇంట్లో రిలాక్స్ అవుతున్నారని ధాన్యలక్ష్మీ చూసేలా రాహుల్, రేఖ డ్రామా ఆడుతారు. కల్యాణ్, అప్పును చంపేయమని రౌడీలకు రుద్రాణి చెబుతుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ట్రస్ట్, సగం ఆస్తి గురించి వాదనలు జరుగుతూనే ఉంటాయి. అందరిని ఆపి తమ ఇష్టపూర్వకంగా చేస్తున్నామని, ట్రస్ట్ అనేది తాతయ్య కల, అది నిజం చేయనివ్వండని కావ్య వేడుకుంటుంది. మాకు ఎలాంటి నష్టాలు వచ్చిన దుగ్గిరాల ఇంటి పేరు శాశ్వతంగా ఉండిపోవాలని, అంతా సహకరించాలని కావ్య అంటుంది.

ఆస్తి రాసినట్లు నటించారు
ఆపండి మీ నాటకాలు అని అరుస్తుంది ధాన్యలక్ష్మీ. ట్రస్ట్ అని, దానం అన్నారు. నా కొడుకు పేరు మీద ఆస్తి రాసినట్లు నటించి నా కడుపు మీద తన్నారు అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇక్కడ ఆస్తి పేపర్స్ నా చేతిలో పెడుతూ అక్కడ నా కొడుకు, కోడలిని నాశనం చేస్తున్నారా. అప్పు, కల్యాణ్ కిడ్నాప్ అయ్యారని వీడియో చూపిస్తుంది ధాన్యలక్ష్మీ.
అందులో రౌడీలను వీళ్లను విడిచిపెట్టకూడదు అని రాజ్ సర్ చెప్పారని అంటారు. దాంతో రాజ్, కావ్యను నిందిస్తుంది ధాన్యలక్ష్మీ. నిన్ను ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు, ఇదంతా అబద్ధమని రాజ్ అంటాడు. రేయ్ రాజ్ ఇదంతా చూస్తూ ఏమనుకోవాలిరా అని ప్రకాశం కూడా అనుమానంగా అడుగుతాడు. దేవుడు మీద ప్రమాణం చేసి చెబుతున్నా నేను చేయలేదని రాజ్ అంటాడు.
డబ్బు కోసం చేయలేదు. ఆస్తి కోసమే ఇలా చేశారని ధాన్యలక్ష్మీ అనడంతో అపర్ణ తిడుతుంది. ఆస్తికోసమే ఇంతకు తెగించాడు. నన్ను భయపెట్టడానికే ఇంతల దిగజారాడు అని రాజ్‌ను అంటుంది ధాన్యలక్ష్మీ. దాంతో కావ్య కోపంగా అరుస్తుంది. ఈ పని ఎవరు చేశారో మాకు తెలియదు. కల్యాణ్, అప్పు ఎక్కడున్న మేము వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది అని కావ్య అంటుంది.
మీరు శిక్ష అనుభవించడం
వాళ్లకు ఏమైనా జరగరానిది జరిగితే ఎలా అని ధాన్యం అనడంతో.. వాళ్లు ఇంటికి వచ్చేదాకా మేము కూడా ఇంట్లో ఉండం అని రాజ్ అంటాడు. చేయని తప్పుకు మీరు శిక్ష అనుభవించడం ఏంట్రా అని అపర్ణ అంటుంది. అయిన రాజ్ వినడు. పాప, కావ్య, రాజ్ ఇంట్లోంచి వెళ్లిపోతారు. మరోవైపు అప్పు, కల్యాణ్ నోటి ప్లాస్టర్ తీస్తారు రౌడీలు. వదిలేయమని కల్యాణ్ అంటాడు.
మా చేత మిమ్మల్ని కిడ్నాప్ చేయించారు. మా సర్ చెప్పేదాక ఇలాగే ఉంటారు అని రౌడీ అంటాడు. రుద్రాణి కాల్ చేసి నేను చెప్పేదాక అలాగే ఉంచండని అంటుంది. ఇప్పుడు నేను ఆ ఇంట్లోకి అడుగుపెట్టే టైమ్ వచ్చిందంటుంది రుద్రాణి. మరోవైపు రాజ్ అక్క ఇంటికి రాజ్, కావ్య వెళ్తారు. జరిగింది అంతా చెబుతారు. ఎస్సై ఎంక్వైరీ చేస్తున్నారని రాజ్ చెప్పగానే కాల్ వస్తుంది.
పాపను ఆడిస్తూ స్వరాజ్ ఏమవుతుంది అని అంటాడు. పాప స్వరాజ్‌కు మరదలు అవుతుందని, పెద్దాయ్యాక భార్య అవుతుందని కావ్య అంటుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ వచ్చేది చూసి తను వినాలనే కావాలని రాహుల్, రేఖ మాట్లాడుతారు. ధాన్యలక్ష్మీకి సపోర్టింగ్‌గా మాట్లాడుతారు.
చంపేయమన్న రుద్రాణి
రాజ్, కావ్య వాళ్లను వెతకట్లేదు. రాజ్ వాళ్ల అక్క రేవతి ఇంట్లో కూర్చొన్నారు. వాళ్లిద్దరు చాలా హ్యాపీగా రిలాక్స్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్లే కిడ్నాప్ చేశారు కాబట్టి, ధాన్యలక్ష్మీ అత్త అనుమానించిదే నిజం కాబట్టి అని రాహుల్ అంటాడు. దాంతో ధాన్యలక్ష్మీ కిందకు వెళ్లి గొడవకు దిగుతుంది. రాజ్, కావ్య తప్పించుకుంటూ తిరుగుతున్నారంటుంది.
రాజ్, కావ్య వాళ్లు రిలాక్స్ అవుతున్నారని, అపర్ణను నానా మాటలు అంటుంది ధాన్యలక్ష్మీ. మరోవైపు అప్పు, కల్యాణ్ తప్పించుకుంటారు. అది తెలిసి వాళ్లను చంపేయమని రుద్రాణి అంటుంది. దాంతో అప్పు, కల్యాణ్‌ను చుట్టు ముడతారు రౌడీలు. అప్పును కత్తితో పొడిచినట్లు చూపిస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


