బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. ధాన్యలక్ష్మి ఉగ్రరూపం.. కల్యాణ్ పేరిట ఆస్తి

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 14) ఎపిసోడ్ లో అప్పు, కల్యాణ్ ను కాపాడటం కోసం రాజ్, కావ్య కూడా ఇల్లు వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. కల్యాణ్ పేరిట సగం ఆస్తి రాసి ఇచ్చినా ధాన్యలక్ష్మి మాత్రం రచ్చ చేస్తుంది.

Published on: Feb 14, 2026, 07:41:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 956వ ఎపిసోడ్ లో అప్పు, కల్యాణ్ లను కిడ్నాప్ చేయిస్తుంది రుద్రాణి. అది రాజ్ చేయించినట్లు ధాన్యలక్ష్మికి వీడియో పంపిస్తుంది. దీంతో ఇంట్లో రచ్చ జరుగుతుంది. ఆస్తి కోసమే ఇలా చేసినట్లు ఆమె ఆరోపించడంతో వాళ్లను తిరిగి తీసుకొచ్చే వరకు తాము కూడా ఇల్లు వదిలి వెళ్తామని రాజ్ అంటాడు.

బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. ధాన్యలక్ష్మి ఉగ్రరూపం.. కల్యాణ్ పేరిట ఆస్తి
బ్రహ్మముడి ఫిబ్రవరి 14 ఎపిసోడ్: ఇల్లు వదిలి వెళ్లిపోయిన రాజ్, కావ్య.. ధాన్యలక్ష్మి ఉగ్రరూపం.. కల్యాణ్ పేరిట ఆస్తి

రుద్రాణిని నిందించిన రేఖ, రాహుల్

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 14) ఎపిసోడ్ లో రుద్రాణిని రేఖ, రాహుల్ నిందించే సీన్ తో మొదలవుతుంది. నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఒక్క ప్లాన్ కూడా సక్సెస్ కాలేదంటారు.

ఆ ఇంటికి వారసులే లేకుండా చేస్తానన్నావ్.. కానీ ఇప్పుడు వాళ్లు ఆస్తే లేకుండా చేస్తున్నారు.. కావ్య ట్రస్ట్ ఆలోచన చేయడం, దానికి అందరూ తలూపడం జరిగిపోయింది.. ధాన్యలక్ష్మి మాత్రమే అడ్డుపడింది అని రాహుల్ చెబుతాడు. అలా జరిగితే మనకు చిల్లిగవ్వ కూడా లేకుండా పోతుందని, ఇప్పటికే తన బిజినెస్ నష్టాల్లో ఉందని అంటాడు.

అప్పుపై దాడికి రుద్రాణి ప్లాన్

దీంతో రుద్రాణి మరో ప్లాన్ చేస్తుంది. అప్పుడే ఆమెకు తాను మాట్లాడిన రౌడీ నుంచి ఫోన్ వస్తుంది. పోలీసులు తమ కోసం వెతుకుతున్నారని అంటాడు. ఎవరికీ దొరకకుండా దాక్కోవాలని ఆమె చెబుతుంది. అదే సమయంలో అప్పుపై దాడి చేయాలని, కిడ్నాప్ చేయాలని రుద్రాణి అంటుంది.

మనం అలా చేసి నిందను రాజ్, కావ్యలపైకి నెట్టేస్తే ఆ ఇంట్లో ధాన్యలక్ష్మి రచ్చ చేస్తుందని, దీంతో ట్రస్ట్ మాటే ఇక ఎత్తరని రుద్రాణి చెబుతుంది. దీనికి రేఖ, రాహుల్ సరే అంటారు.

దాడి చేసిన వాళ్లను పట్టుకున్న పోలీసులు

మరోవైపు ఇంట్లో ఉన్న అప్పుకి ఓ పోలీసు ఫోన్ చేస్తాడు. హాస్పిటల్లో చిన్నారిపై దాడి చేసిన వాళ్లను పట్టుకున్నట్లు చెబుతాడు. వాళ్లు నిజం చెప్పారా అని అడిగితే.. మంత్రి పేరే చెబుతున్నారని, అసలు నిజం చెప్పిస్తానని అంటాడు. తాను కూడా అక్కడికి వస్తానని అప్పు చెబుతుంది.

కల్యాణ్ కు అదే విషయం చెప్పి తనను అక్కడికి తీసుకెళ్లాలని అడుగుతుంది. కానీ అక్కడ వాళ్లు ఎవరి పేరు చెప్పినా అక్కడితో నీ ఇన్వెస్టిగేషన్ ఆపేయాలని కల్యాణ్ అంటాడు. ఆమె సరే అంటుంది.

కల్యాణ్ పేరిట సగం ఆస్తి

ట్రస్టుకు ధాన్యం అడ్డుపడుతుండటంతో ఇటు రాజ్ మరో ఆలోచన చేస్తాడు. ఆస్తిని సగం ట్రస్టుకు, మిగిలిన సగం కల్యాణ్ పేరు మీద రాసి తీసుకురావాలని లాయర్ కు ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కావ్యతోనూ అదే విషయం చెబుతాడు.

తాను చెప్పినందుకే మొత్తం ఆస్తినే వదులుకుంటున్నారని, ఇలాంటి భర్త దొరికినందుకు చాలా గర్వంగా ఉందని కావ్య అంటుంది. ఈ విషయం ధాన్యలక్ష్మికి ముందు చెప్పిన తర్వాత కాగితాలు రెడీ చేయించాలని రాజ్ తో చెబుతుంది.

అప్పు, కల్యాణ్ కిడ్నాప్

మరోవైపు ఆ రౌడీల నుంచి నిజం రాబట్టడానికి కల్యాణ్ తో కలిసి అప్పు బయలుదేరుతుంది. ఈ విషయాన్ని రుద్రాణికి ఫోన్ చేసి చెబుతుంది రేఖ. ఇద్దరూ వెళ్తున్నారని తెలియడంతో తన పని ఇంకా సులువు అవుతుందని రుద్రాణి అనుకుంటుంది.

అనుకున్నట్లుగానే దారిలో కాపు కాసిన రౌడీలు కల్యాణ్ ను కొడతారు. ఇద్దరినీ ముసుగేసి తీసుకెళ్తారు. రుద్రాణికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఆ వీడియో తీసి, అది రాజ్ కిడ్నాప్ చేసినట్లుగా ఉండాలని, తాను చెప్పిన నంబరుకు పంపించాలని రుద్రాణి చెబుతుంది.

కల్యాణ్ పేరిట ఆస్తి.. ధాన్యం రచ్చ

ఇంట్లో వాళ్లందరినీ మాట్లాడాలని చెప్పిన రాజ్, కావ్య.. బయటకు వచ్చి తాము తీసుకున్న నిర్ణయం గురించి చెబుతారు. పిన్ని ట్రస్టుకు అడ్డు పడుతుంది కాబట్టి సగం ఆస్తిని కల్యాణ్ పేరిట రాస్తున్నట్లు రాజ్ వెల్లడిస్తాడు. అది విని అందరూ షాక్ తింటారు.

మరి మీ భవిష్యత్తు సంగతేంటని ఇందిరా దేవి అడుడుతుంది. ఇదే మాట నేను మాట్లాడితే నన్ను నానా మాటలు అన్నారు కదా అని ధాన్యం మరింత చెలరేగిపోతుంది. తన కొడుకుకు ఏదో దానం చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని, ఇన్నాళ్లూ కావ్య పేరిట ఆస్తి ఉంటే ఎవరూ ఏమీ మాట్లాడలేదని అంటుంది.

ఇంటి నుంచి వెళ్లిపోతాం

అదే సమయంలో అప్పు, కల్యాణ్ కిడ్నాప్ అయిన వీడియో ధాన్యం ఫోన్ కి వస్తుంది. దీనిని చూపించి రాజే ఈ పని చేయించాడని అంటుంది. ఇటు ఆస్తి కాగితాలు ఇచ్చే సమయానికే అటు నా కొడుకు, కోడలిని కిడ్నాప్ చేయించారని నిందిస్తుంది. దీంతో షాక్ తిన్న రాజ్.. వాళ్లిద్దరినీ ఇంటికి తిరిగి తీసుకొచ్చే వరకు తాము కూడా ఇంట్లో ఉండమని అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More