బ్రహ్మముడి ఫిబ్రవరి 19 ఎపిసోడ్: రాజ్, కావ్యకు మంత్రి ఆహ్వానం- బారసాలలో రుద్రాణి కొత్త ప్లాన్-ట్రస్ట్‌కు ధాన్యలక్ష్మీ ఓకే
బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 19 ఎపిసోడ్‌లో రాజ్, కావ్య చేసినదానికి ధాన్యలక్ష్మీ పశ్చాత్తాపపడుతుంది. అప్పుకు పాప పుడుతుంది. దుగ్గిరాల ఇంటికొచ్చిన మంత్రి ధర్మేంద్ర తన కూతురు బారసాలకు ఆహ్వానిస్తాడు. అదే ఫంక్షన్‌లో రుద్రాణి కొత్త ప్లాన్ వేస్తుంది. అప్పు దగ్గర అటాక్ చేసిన రౌడీలు ఉన్నారని రేఖ వారిస్తుంది.
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కల్యాణ్ నిజం చెప్పడంతో ధాన్యలక్ష్మీ ఫీల్ అవుతుంది. దాంతో అందరూ ధాన్యలక్ష్మిని తిడతారు. తనను ఏమనొద్దు అని కావ్య, రాజ్ అంటారు. నన్ను క్షమించురా అని ధాన్యలక్ష్మీ అంటుంది. తప్పు చేశాను, మన్నించండి అని పశ్చాత్తాపపడుతుంది. ఇంతలో డాక్టర్ అనురాధ వచ్చి అప్పుకు పాప పుట్టిందని చెబుతుంది.

ముచ్చటగా మూడో మహాలక్ష్మీ
దాంతో దుగ్గిరాల కుటుంబం సంతోషిస్తుంది. అంతా వెళ్లి అప్పు, పాపను చూస్తారు. ముచ్చటగా మూడో మహాలక్ష్మీ వచ్చిందే అని ఇందిరాదేవి అంటుంది. ఆ ట్రస్ట్ ప్రపోజల్ పెట్టకుండా ఉండాల్సింది. సారీ అని రాజ్ చెబుతాడు. కిడ్నాపర్స్ గురించి కల్యాణ్‌ను రాజ్ అడుగుతాడు. ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. అది కవర్ చేయడానికి మీ పేర్లు వాడారని కల్యాణ్ చెబుతాడు.
అత్తింటికి పాపతో అప్పు వెళ్తుంది. హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకెళ్తారు. పాపకు కవిత జ్ఞానం ఉండాలని కవిత్వం చెబుతాడు కల్యాణ్. నీలా కవి కాదు నాలా పోలీస్ కావాలి అని అప్పు ఉంటుంది. కవి, పోలీస్ రెండు అవుతుందని కల్యాణ్ అంటాడు. అటు సుభాష్ అపర్ణ, ఇటు ధాన్యలక్ష్మీ ప్రకాశం తమ మనవరాళ్లను ఆడిస్తూ మురిసిపోతారు.
కూతుళ్లతో ముగ్గురు అక్కా చెళ్లెల్లు
దుగ్గిరాల ఇంట్లో ముగ్గురు అక్కలు ముగ్గురు కూతుళ్లతో సందడి చేస్తారు. కావ్య, అప్పు పాపలను ఇందిరాదేవి ఆడిస్తుంటే యూరిన్ పోస్తారు. అదే ఇందిరాదేవి చెబితే బాహుబలిలో శివగామిలా ఆడిస్తానన్నావుగా, అనుభవించు అని ప్రకాశం అంటాడు. ఇద్దరు పాపలకు బారసాల ఒకేసారి చేద్దామని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో మినిస్టర్ ధర్మేంద్ర వస్తాడు.
పాప గురించి అడిగితే బాగుందని చెబుతాడు రాజ్. మీతో ఆత్మీయంగా మెలగాలన్న గతం వల్ల కొంత భయంగానే ఉంది. కళ్లలోకి చూసి మాట్లాడలేకపోతున్నాను. రేపు నా కూతురుకు బారసాల. మీరు కచ్చితంగా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు ధర్మేంద్ర. మీరంతా నా ఆప్తులే అంతా రావాలని ధర్మేంద్ర కావ్య సరేనంటుంది. దాంతో మినిస్టర్ వెళ్లిపోతాడు.
దూరంగా ఉంటేనే మంచిది
అందరం వెళ్దామా అని రాజ్ అంటే ఇందిరాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మీ వద్దంటారు. అలాంటి వాళ్లకు దూరంగా ఉంటేనే మంచిదని ఇందిరాదేవి చెబుతుంది. తర్వాత రుద్రాణి ప్లాన్స్ ఫెయిల్ అవడంపై రేఖ తిడుతుంది. మళ్లీ ట్రస్ట్ పెడదామంటేనే సమస్య అని రాహుల్ అంటాడు. అలా జరగనివ్వను. నేను ఇంట్లోకి వచ్చేలా ప్లాన్ చేస్తాను. మినిస్టర్ బారసాల ఇంటికి నేను కూడా వస్తాను అని రుద్రాణి అంటుంది.
అంతా నన్ను తిడతారు. మీరు కూడా అలాగే చేయండి. ఎవరు లేని అనాథలా ఉన్నానని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తాను. దాంతో కరిగిపోతారని రుద్రాణి అంటుంది. ప్లాన్ బాగుందని రాహుల్, రేఖ అంటారు. కానీ, హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలు ఇంకా అప్పు అండర్‌లోనే ఉన్నారు. మళ్లీ తాను ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరికిపోతావని రేఖ అంటుంది.
రుద్రాణి కొత్త ప్లాన్
అప్పు ఏం చేస్తుందో కనిపెట్టు. మినిస్టర్ ఇంట్లో ఎలా జరగాలో రాహుల్ నువ్వు ప్లాన్ చేయు అని చెప్పి కొడుకు కూతురుని పంపిస్తుంది రుద్రాణి. అప్పుకు పొరపాటున నిజం తెలిస్తే అదే దానికి ఆఖరి రోజు అయ్యేలా చేస్తాను అని రుద్రాణి అనుకుంటుంది. మరోవైపు కావ్య టిఫిన్ చేస్తుంటుంది. అపర్ణ వచ్చి పాప సంగతి చూసుకోమని చెబుతుంది.
పాపను ఆయనే రెడీ చేస్తారట, నేను కలుగజేసుకోవద్దట అని కావ్య చెబుతుంది. దాంతో అపర్ణ, ఇందిరాదేవి వెళ్లి చూస్తారు. పాపను రెడీ చేస్తాడు రాజ్. నా కూతురును నాకు నచ్చినట్లు రెడీ చేస్తానని, ఎవరు కలుగజేసుకోవద్దని రాజ్ అంటాడు. అది చూసిన కావ్య మొహం వెలిగిపోతుంది. ఈ ఆనందం, సంతోషం అంతా నీవల్లే అని ఇందిరాదేవి అంటుంది.
ట్రస్ట్‌కు ఒప్పుకున్న ధాన్యం
మీరు చేయబోయే ట్రస్ట్ పనికి ధాన్యలక్ష్మీ ఒప్పుకుంది. ఇక ఏ సమస్య లేదని అపర్ణ అంటుంది. మరోవైపు అప్పుకు ఎస్సై ధనుంజయ్ కాల్ చేసి హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలు ఇంకా మన దగ్గరే ఉన్నారు. ఏం చేయమంటారు అని అడుగుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


