Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుని తన ఇంటికి తీసుకెళ్లే వరకు కదలనని ఇందు స్పష్టం చేస్తుంది. ఇంటికి వచ్చిన రేఖను కూడా ఆమె ఏమార్చి పెద్ద షాకే ఇచ్చి పంపిస్తుంది. ఇటు రాజుకి మెల్లగా తాను దుగ్గిరాల వారసుడిని అనే నిజం తెలిసేలా బావ అంటూ పిలుస్తుంది ఇందు.
రాజు ఇంటికి రేఖ.. రాజు, ఇందుని చూసి షాక్

బ్రహ్మముడి సీరియల్ గురువారం (జులై 16) ఎపిసోడ్ రాజు ఇంటికి రేఖ వచ్చే సీన్ తో మొదలవుతుంది. అప్పుడే రాజు పడిపోతుంటే ఇందు పట్టుకుంటుంది. వాళ్లను చూసి రేఖ షాక్ తింటుంది. తన మనిషి అబద్ధం చెప్పాడని తెలిసి తనలో తాను మండిపడుతుంది. దూరంగా ఆగిపోయిన రేఖను చూసి ఇంట్లోకి రావాలని రాజు పిలుస్తాడు. ఇంటికి వచ్చిన అతిథికి మర్యాద చేయాలని, కాఫీ తీసుకురమ్మని ఇందుకి చెప్పి పంపిస్తాడు రాజు.
చంపాలనుకున్నది నువ్వే అని రేఖను నిలదీసిన రాజు
పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావ్.. అదృష్టవంతుడివి.. ఎలా ఉన్నావ్ అని రేఖ అడుగుతుంది. అదృష్టవంతుడిని నేను కాను.. నువ్వే పిన్నీ అని రాజు అంటాడు. ఎందుకంటే నన్ను చంపాలనుకున్నది నువ్వే అని నాకు తెలుసు.. ఆ అవసరం నీకు తప్ప మరెవరికి ఉంటుంది.. లక్కీ తల్లి నువ్వే అన్న నిజం నాకు తెలిసిపోయింది కాబట్టి.. ఆ నిజం ఒప్పుకోవాలని నిన్ను అడిగాను కాబట్టి నా అడ్డు తొలగించుకోవాలని అనుకున్నావ్ కదా అని రేఖను నిలదీస్తాడు రాజు.
లక్కీకి తల్లి నువ్వే అని మరొకరికి చెప్పానన్న రాజు
నీ యాక్సిడెంట్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని రేఖ బుకాయిస్తుంది. కానీ రాజు మాత్రం ఇది ముందే ఊహించానని, అందుకే లక్కీకి తల్లి నువ్వే అన్న విషయం మరొకరికి కూడా చెప్పి ఉంచానని అంటాడు. తనకు ఏమైనా జరిగితే వాళ్లు వెళ్లి లక్కీకి అసలు విషయం చెప్పేలా ముందే ప్లాన్ చేసి ఉంచినట్లు కూడా రాజు చెప్పడంతో రేఖ షాక్ తింటుంది.
{{/usCountry}}నీ యాక్సిడెంట్ కు, తనకు ఎలాంటి సంబంధం లేదని రేఖ బుకాయిస్తుంది. కానీ రాజు మాత్రం ఇది ముందే ఊహించానని, అందుకే లక్కీకి తల్లి నువ్వే అన్న విషయం మరొకరికి కూడా చెప్పి ఉంచానని అంటాడు. తనకు ఏమైనా జరిగితే వాళ్లు వెళ్లి లక్కీకి అసలు విషయం చెప్పేలా ముందే ప్లాన్ చేసి ఉంచినట్లు కూడా రాజు చెప్పడంతో రేఖ షాక్ తింటుంది.
{{/usCountry}}ఇప్పుడు నేను బతికే ఉన్నాను కాబట్టి.. ఆ నిజం నీతోనే చెప్పిస్తాను.. అంతేకాదు నన్ను ఇంట్లో నుంచి వెళ్లగొట్టేలా ప్లాన్ చేసింది కూడా నువ్వే అని తెలుసు.. కానీ ఆ ఇంటికి నేను తిరిగి వస్తున్నాను.. వచ్చి నీతోనే ఎలా నిజం చెప్పిస్తానో చూస్తూ ఉండు అని వార్నింగ్ ఇస్తాడు.
ఇందుని నిలదీసిన రేఖ.. తెలివిగా ఇరికించిన ఇందు
అప్పుడే ఇందు కాఫీ తీసుకొని వస్తుంది. రేఖ మాత్రం తనకు వద్దంటూ ఇందుని పక్కకు పిలిచి మాట్లాడుతుంది. అప్పటికే రేఖ అడిగితే ఏం చెప్పాలా అని ప్లాన్ చేసుకున్న ఆమె.. ఊహించినట్లే రేఖ నిలదీయగానే తెలివిగా మాట్లాడుతుంది. ఎందుకు వచ్చావ్.. రాజుగాడు అంటే నీకు ఇష్టం లేదు కదా అని అడుగుతుంది. మీరెందుకు వచ్చారు.. చనిపోయాడనుకొనా అని ఇందు అడగడంతో రేఖ షాక్ తింటుంది.
రాజుకు ఏం జరిగినా అతని ఫ్యామిలీకి మనపైనే అనుమానం వస్తుందని, అందుకే తాను ముందే వచ్చినట్లు ఇందు చెప్పడంతో రేఖ కూల్ అవుతుంది. తాను కూడా అందుకే వచ్చానని రేఖ అంటుంది. ఇక ఇంటికి వెళ్దామని రేఖ అంటే.. తాను ఇక్కడే ఉంటానని, వాళ్లలో ఆ అనుమానం పూర్తిగా తొలగిపోయే వరకు రానని ఇందు చెబుతుంది. రేఖను కూడా కన్విన్స్ చేస్తుంది. దీంతో ఆమె సరే అంటుంది. రాజు దుగ్గిరాల వారసుడు అని తెలిస్తే నీ పరిస్థితి ఏంటో అని ఇందు మనసులో అనుకుంటుంది.
వెళ్లేదే లేదని మొండికేసిన ఇందు
రేఖ వెళ్లిపోయిన తర్వాత మరోసారి ఇందుని వెళ్లిపోవాలని రాజు అడుగుతాడు. తాను వెళ్లబోనని, నిన్ను తీసుకునే ఇక్కడి నుంచి వెళ్తానని ఇందు స్పష్టం చేస్తుంది. ఎలా వెళ్లవో నేనూ చూస్తాను.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటికి నేను రాను అని రాజు కూడా మొండికేస్తాడు.
ఐశ్వర్యకు క్లాస్ పీకిన అపర్ణ
అటు ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గర అపర్ణపై ఐశ్వర్య మండిపడుతుంది. ఉప్మా తాను తినను అని చెప్పాను కదా.. అదే ఎందుకు చేశారని నిలదీస్తుంది. ఆ ఉప్మా తిని ప్లేట్లోనే ఉమ్మేస్తుంది. దీంతో అపర్ణ ఆమెకు క్లాస్ పీకుతుంది. ఇంత చదువు చదివావు.. ఇలా పార్టీలంటూ చెడు తిరుగుడు ఎందుకు తిరుగుతావని అడుగుతుంది. నా జీవితం నా ఇష్టం అంటూ ఆమె చెబుతుంది.
అటు భ్రమరాంబ కూడా రాజు, నందు వచ్చిన తర్వాత వీళ్లకు కొమ్ములు వచ్చాయి.. తమకు ఇష్టం వచ్చినట్లు ఉంటున్నారు అని అంటుంది. అప్పుడే నందు వస్తుంది. ఉప్మా తిని అవును నాన్నమ్మా అస్సలు బాలేదు అనడంతో అపర్ణ షాక్ తింటుంది. అయితే ఆ ఉప్మాను వాళ్లతోనే చేయించే ప్లాన్ నందు చేస్తుంది.
రాజుని బావ అన్న ఇందు
ఇటు రాజుకు ఇందు సేవలు చేస్తూ ఉంటుంది. నువ్వు తన దగ్గరే ఉంటే బాగా చూసుకుంటానని, ఇంటికి రావాలని అడుగుతుంది. రాజు మొండికేయడంతో నీకేమైనా అయితే తాను తట్టుకోలేని కంటతడి పెడుతుంది. మన మధ్య ఏ సంబంధం లేదని రాజు అంటాడు.
నన్ను వదిలెయ్ అనడంతో సంబంధం ఉంది.. నిన్ను వదలను బావా అని ఇందు అనడంతో రాజు షాక్ తింటాడు. ఇందు తనను పదే పదే బావ అని పిలవడంతో అతనిలోనూ అనుమానం మొదలవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.