Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రాజుపై సామదానభేదదండోపాయాలు ప్రయోగించిన ఇందు.. మొత్తానికి అతన్ని తిరిగి ఇంటికి వచ్చేలా చేస్తుంది. దీంతో ఓవైపు నందు, మరోవైపు రాజు ధాటిని రేఖ ఎలా ఎదుర్కోబోతోందన్న ఆసక్తి నెలకొంది.
నందుపై రేఖకు భ్రమరాంబ ఫిర్యాదు.. ఆడుకున్న శేషు

నందు చేసిన పనితో నోరు తెరవలేక భ్రమరాంబ ఇబ్బంది పడే సీన్ తో సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ మొదలైంది. రేఖ ఎప్పుడు వస్తుందా, ఆమెకు నందుపై ఎప్పుడు ఫిర్యాదు చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో చిరాకు పడుతూ రాజు ఇంటి నుంచి రేఖ వస్తుంది. వచ్చీ రాగానే మనం అనుకున్నది ఒకటి.. జరిగింది మరొకటి.. ఆ రాజు గాడికి ఏమీ కాలేదని రేఖ అంటుంది.
కానీ భ్రమరాంబ మాత్రం నోరు తెరవకపోవడంతో ఏమైందని రేఖ అడుగుతుంది. ఆమె చెప్పలేకపోతుంది. దీంతో శేషు సీన్ లోకి ఎంటరై ఆమెతో ఆడుకుంటాడు. పెళ్లయిన తర్వాత తొలిసారి ఆమె నోరు మూతపడిందనుకొని రేఖకు అసలు విషయం తప్ప మిగిలినవన్నీ చెబుతాడు. దీంతో ఆమె చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రాజుని కలిసిన లక్కీ.. తెలియదని అబద్ధం చెప్పిన రాజు
ఇటు రాజుకి యాక్సిడెంట్ విషయం తెలిసి లక్కీ ఇంటికి వస్తాడు. ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు మామా అని అడుగుతాడు. మా అమ్మ గురించి తెలుసుకొని వస్తానని చెప్పి వెళ్లి ఇలా దెబ్బలు తగిలించుకున్నావేంటని అంటాడు. అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారని నిలదీస్తాడు. కానీ రాజు మాత్రం నిజం చెప్పడు.
జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.. ఇలా జరుగుతూ ఉంటాయంటాడు. తల్లి గురించి లక్కీ మరోసారి ఎమోషనల్ అవుతాడు. నువ్వేమీ బాధపడకు.. మీ అమ్మ ఎవరో నేను తెలుసుకొని తీరతాను అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పకుండా రాజు దాచి పెడతాడు. దీంతో లక్కీ బాధతో తిరిగి వెళ్లిపోతాడు.
రాజుని లొంగదీసుకునే ప్రయత్నంలో ఇందు
{{/usCountry}}జీవితంలో అన్నీ మనం అనుకున్నట్లు జరగవు.. ఇలా జరుగుతూ ఉంటాయంటాడు. తల్లి గురించి లక్కీ మరోసారి ఎమోషనల్ అవుతాడు. నువ్వేమీ బాధపడకు.. మీ అమ్మ ఎవరో నేను తెలుసుకొని తీరతాను అని తనకు తెలిసిన నిజాన్ని చెప్పకుండా రాజు దాచి పెడతాడు. దీంతో లక్కీ బాధతో తిరిగి వెళ్లిపోతాడు.
రాజుని లొంగదీసుకునే ప్రయత్నంలో ఇందు
{{/usCountry}}ఇటు రాజుని లొంగదీసుకునే ప్రయత్నం చేస్తుంటుంది ఇందు. అతనికి సేవలు చేస్తున్నా రాజు పట్టించుకోడు. నీ అవసరం లేదని అంటాడు. దీంతో కోపమా నా పైనా అని పాడుతూ.. రాజు వెంట పడుతుంది. ఆమెకు రాజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేస్తారు. అందరూ కలిసి రాజుని ఆట పట్టిస్తారు. అయినా రాజు మనసు కరగదు.
శోభనం పెళ్లి కూతురిలా ఇందు.. భయపడిన రాజు
దీంతో ఆ రాత్రికి శోభనం పెళ్లి కూతురిలా రెడీ అయి పాల గ్లాసుతో రాజు గదిలోకి వెళ్తుంది ఇందు. ఆమెను చూడగానే రాజు షాకవుతాడు. నువ్వేంటి ఇలా రెడీ అయ్యావని అడుగుతాడు. నీ భార్యను కదా బావా అని ఆమె అంటుంది. ప్రతి మాటకూ బావ బావ అంటూ రాజుని ఆటపట్టిస్తుంది.
దీంతో అతడు మరింత చిరాకు పడతాడు. నువ్వు ఏం చేసినా నేను కరగను అని అనడంతో ఇందు సవాలుగా తీసుకొని అతన్ని తన చేతి వేళ్లతో సుతిమెత్తగా నిమురుతూ బావా బావా అని పిలవడంతో రాజు మైమరచిపోతాడు. నాతోపాటు ఇంటికి రావచ్చు కదా బావా అని ఇందు అడుగుతుంది. దీంతో సడెన్ గా రాజు తేరుకొని దూరం జరుగు అంటూ కసురుకుంటాడు.
క్షమించమని అడిగిన ఇందు.. వెళ్లగొట్టిన రాజు
అయినా ఆ ఇంట్లో నుంచి నేనే వచ్చేశానా.. నువ్వు వెళ్లమన్నావా అని అడుగుతాడు. తానే వెళ్లగొట్టానని ఇందు అంటుంది. అలా అయితే తప్పయిపోయిందని లెంపలేసుకొని క్షమాపణ చెప్పమని రాజు డిమాండ్ చేస్తాడు. ఇందు అలాగే చేస్తుంది. కానీ రాజు మనసు మాత్రం కరగదు. చివరికి ఇందుని గదిలో నుంచి బయటకు వెళ్లగొట్టి తలుపు వేసుకుంటాడు.
రాజు ఇంటి ముందు ఇందు ధర్నా.. చలపతి, లక్ష్మీ సపోర్ట్
ఉదయం లేచి చూసే సరికి అసలు ఇందు సౌండ్ వినిపించకపోవడంతో ఆమె వెళ్లిపోయిందని రాజు అనుకుంటాడు. పిలిచినా పలకకపోవడంతో హమ్మయ్య అని అనుకుంటాడు. కానీ బయటకు వెళ్లి చూసే సరికి ఇంటి ముందు టెంట్ వేసుకొని ఇందు ధర్నా చేస్తుంటుంది. మొగుడి మొండితనం నశించాలి.. భార్య మాట ముద్దు అనే ప్లకార్డులతో ఆమె నినాదాలు చేస్తుంటుంది.
అది చూసి షాక్ తిన్న రాజు.. అమ్మా, నాన్న అంటూ పిలుస్తాడు. వాళ్ల కూడా ఇందు వెనుక నుంచి అవే ప్లకార్డులు పట్టుకొని వచ్చి ఆమెకు సపోర్ట్ చేస్తారు. ఆమెతోపాటు ధర్నాలో కూర్చొంటారు. దీంతో రాజుకి మరింత షాక్ తగులుతుంది.
తిరిగి ఇంటికి రాజు
ఇక చేసేది లేక రాజు తన సొంతింటికి వెళ్లడానికి రెడీ అవుతాడు. ఇందుతో కలిసి రాజు రావడం చూసి అపర్ణ మురిసిపోతుంది. ఈ దెబ్బలేంటి బాబు అని అపర్ణ అడుగుతుంది. ఎవరో కావాలని చేయించారని, వాళ్ల ఆశ నెరవేరలేదని రేఖను ఉద్దేశించి రాజు అంటాడు. దీంతో రేఖ ముఖంలో నెత్తుటి చుక్క కూడా కనిపించదు. ఆమెలో ఆందోళన మొదలవుతుంది. ఆ తర్వాత ఇందుని గదిలోకి తీసుకెళ్లిన నందు.. అసలు రాజు ఎవరు అని నిలదీస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.