...
...
Next Story

Brahmamudi July 20th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన లక్కీ.. తల్లిని చూసి ఎమోషనల్.. రేఖకు షాక్

Brahmamudi Serial July 20th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 20 ఎపిసోడ్ లో రాజును ఎలాగోలా ఒప్పించి దుగ్గిరాల ఇంటికి తీసుకెళ్తుంది ఇందు. అయితే ఆ వెంటే లక్కీ కూడా వాళ్ల ఇంట్లో అడుగుపెట్టడంతో అతన్ని చూసి రేఖ షాక్ తింటుంది.

Published on: Jul 20, 2026, 07:55:27 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో ఒకేసారి రేఖకు రెండు షాకులు తగులుతాయి. ఇప్పటికే నందు రూపంలో ఓ ప్రమాదం ఆమె నెత్తి మీదే ఉండగా.. రాజు, లక్కీ కూడా దుగ్గిరాల ఇంట్లో చేరడంతో ఆమె ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

ధర్నాలో ఇందుకి చలపతి, లక్ష్మీ సపోర్ట్

Brahmamudi July 20th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన లక్కీ.. తల్లిని చూసి ఎమోషనల్.. రేఖకు షాక్
Brahmamudi July 20th Episode: బ్రహ్మముడి.. దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టిన లక్కీ.. తల్లిని చూసి ఎమోషనల్.. రేఖకు షాక్

రాజుని తన ఇంటికి తీసుకెళ్లడానికి అతని ఇంటి ముందే అత్తమామలతో కలిసి ఇందు చేసే ధర్నాతో సీరియల్ సోమవారం (జులై 20) ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ ధర్నాలో ఇందుకి చలపతి, లక్ష్మీ పూర్తిగా సపోర్ట్ చేస్తారు. తనకు సపోర్ట్ చేయాల్సిన మీరు.. దానికి చేస్తారేంటని రాజు అడిగినా వాళ్లు వినరు.

మొగుడి మొండితనం నశించాలంటూ నినాదాలు చేస్తారు. ఇలా చేస్తే తనకు ఎవరు పిల్లనిస్తారని రాజు నోరు జారతాడు. అంటే మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావా అని చలపతి అడుగుతాడు. అప్పుడే కవర్ చేసుకుంటూ వెంకీగాడికి పిల్లనెవరు ఇస్తారని రాజు అంటాడు. అయినా కూడా వాళ్లు వెనక్కి తగ్గకుండా నినాదాలు చేస్తూనే ఉంటారు.

ఇందుకి సపోర్ట్‌గా వచ్చిన బస్తీ వాళ్లు..

అది విని బస్తీలోని ఆడవాళ్లందరూ కట్టకట్టుకొని వస్తారు. ఏం జరిగిందని ఇందుని అడుగుతారు. రాజు గురించి ఆమె ఫిర్యాదు చేస్తుంది. దీంతో రాజు దగ్గరికి వెళ్లిన ఓ మహిళ అతన్ని బెదిరిస్తుంది. తనకు కోర్టులు, కేసులు తెలుసు అని అంటుంది. సెక్షన్ల పేర్లు కూడా చెబుతుంది. అయినా రాజు వెనక్కి తగ్గడు. నీతో ఆ అమ్మాయికి విడాకులు ఇప్పించి తీరతామని ఆమె అంటుంది.

వాళ్లు వెళ్లగానే బస్తీలోని మగవాళ్లు కూడా వస్తారు. ఏం జరిగిందని అడుగుతాడు. తన భర్తని తన వెంట తీసుకెళ్దామనుకుంటే రావడం లేదని ఇందు అంటుంది. అతన్ని టార్చర్ పెడుతున్నావా.. ఇంట్లో పనులు చేయిస్తున్నావా అని అడుగుతారు. అలాంటిదేమీ లేదని, తాను బాగా చూసుకుంటానని అనడంతో వాళ్లందరూ వెళ్లి రాజు బయటకు తీసుకొస్తారు.

అతనికి క్లాస్ పీకుతారు. అయినా సరే రాజు వెనక్కి తగ్గకుండా వాళ్లతోనూ గొడవకు దిగుతాడు. తాను వెళ్లనంటే వెళ్లనని మొండికేస్తాడు. దీంతో భర్తల వాట్సాప్ గ్రూపులో ఓ మెసేజ్ చేయడానికి ఓ వ్యక్తి సిద్ధమవుతాడు. అది చూస్తే అన్ని కాలనీల్లోని వేల మంది వస్తారని అంటాడు. అతడు రాజు గురించి ఏదేదో చెబుతూ నోటికొచ్చినట్లు వాయిస్ మెసేజ్ పెడుతుండటంతో రాజు కంగారు పడతాడు.

దిగి వచ్చిన రాజు.. ఇందు వెంట వెళ్లడానికి సిద్ధం

ఇక చాలు అని, తాను వెళ్తానని రాజు అంటాడు. దీంతో ఇందు సంతోషిస్తుంది. అయితే ముందు నువ్వు వెళ్లు.. ఆ వెంటే వస్తానని రాజు అంటాడు. కుదరదు.. నా వెంటే రావాలని ఇందు తేల్చి చెబుతుంది. చివరికి వెంకీ కూడా ఆమెకే సపోర్ట్ చేస్తాడు. బట్టలు సర్దుకోవాలి కదా అని రాజు అంటే.. అప్పటికే తాను సర్ది తీసుకొచ్చిన బ్యాగును రాజుకి ఇస్తాడు వెంకీ.

నువ్వు కూడానారా అని రాజు అడుగుతాడు. తాను వెళ్లడం అమ్మానాన్నలకు ఇష్టం లేదని నువ్వే అన్నావు కదరా అని రాజు అడిగితే.. ఇప్పుడు వాళ్లే వెళ్లమంటున్నారు కదా అని వెంకీ బలవంతంగా రాజుని పంపిస్తాడు. దీంతో ఇందుతో కలిసి ఆటోలో కూర్చుంటాడు రాజు. ఇద్దరూ కలిసి దుగ్గిరాల ఇంటికి వెళ్తారు.

దుగ్గిరాల ఇంటికి లక్కీ.. రేఖ షాక్

అయితే ఎపిసోడ్ చివర్లో దిమ్మదిరిగే ట్విస్ట్ ఎదురవుతుంది. రాజు, ఇందు తర్వాత లక్కీ కూడా దుగ్గిరాల ఇంటికి వస్తాడు. బ్యాగు పట్టుకొని అతడు రావడంతో భ్రమరాంబ షాక్ తింటుంది. ఎందుకు వచ్చావని అడిగితే.. నేనే రమ్మన్నానని రాజు ఎంట్రీ ఇస్తాడు. ఇక నుంచి వాడు కూడా ఇక్కడే ఉంటాడని అంటాడు.

నేను ఒప్పుకోనని భ్రమరాంబ అంటే.. నువ్వేంటి ఒప్పుకునేది.. పిన్ని ఎక్కడ అని రాజు అంటాడు. అప్పుడే కిందికి దిగి వస్తున్న రేఖకు మన లక్కీ వచ్చాడు.. గుర్తు పట్టావా అని రాజు అడగడంతో ఆమె షాక్ తింటుంది. రేఖ తన తల్లి అని తెలియకపోయినా లక్కీ ఎమోషనల్ గా కనిపిస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe