Brahmamudi July 24 Episode: బ్రహ్మముడి- లక్కీ ఎవరని రేఖను నిలదీసిన భూషణ్- పూర్తిగా ఇరుక్కున్న రేఖ- రాజుతో ఇందు రొమాన్స్
Brahmamudi Serial July 24 Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 24 ఎపిసోడ్ లో రేఖను పూర్తిగా ఇరికించేస్తాడు రాజు. అతడు చెప్పినట్టల్లా రేఖ ఆడుతుండటంతో చివరికి భూషణ్ లోనూ అనుమానం వచ్చి లక్కీ ఎవరని నిలదీయడంతో రేఖ ఇరుక్కుపోతుంది.
Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో రేఖతో రాజు ఆడుకుంటాడు. తప్పని పరిస్థితుల్లో అతడు చెప్పినట్టు వినడం తప్ప రేఖకు మరో దారి ఉండదు. రాజు ముందు పూర్తిగా బెండవుతున్న రేఖను చూసి అందరూ షాకవుతారు. లక్కీ విషయంలో అందరిలోనూ అనుమానం కూడా మొదలవుతుంది.

ఇందు, నందుకు బుద్ధి చెప్పాలనుకున్న ఐశ్వర్య
ఇందు తనను అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఆవేశంతో ఐశ్వర్య రగిలిపోయే సీన్ తో సీరియల్ శుక్రవారం (జులై 24) ఎపిసోడ్ మొదలవుతుంది. నేను ఖాళీగా ఉంటూ ఫ్రీగా వచ్చే డబ్బు కోసం చూస్తానా.. పార్టీలు, పబ్బులంటా తిరుగుతానా.. ఇందు, నందు కలిసి నన్ను అన్ని మాటలు అంటారా.. వాళ్లకు నా సంగతేంటో చూపిస్తా అని అనుకుంటుంది.
ఐశ్వర్యతో లక్కీ సరసరాలు
అప్పుడే లక్కీ అక్కడికి వస్తాడు. ఐశ్వర్యను గదిలో చూసి ఆమెతో రొమాన్స్ కు ఇదే సరైన టైమ్ అనుకొని వెళ్తాడు. అతన్ని చూడగానే నువ్వేంటి ఇక్కడ అని ఐషూ అడిగితే.. తాను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నానని, రేఖ ఆంటీయే ఉండమని చెప్పిందని అనడంతో ఐశ్వర్య షాక్ తింటుంది. ఎవడు పడితే వాడు ఉండటానికి ఇదేమైనా సత్రమా, ఆమెతోనే ఈ విషయం తేల్చుకుంటానని ఐశ్వర్య వెళ్లబోతుంటే లక్కీని ఆమె చేతిని పట్టుకుంటాడు.
ఆమెతో రొమాన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. తనతో అవసరం ఉన్నప్పుడు ఇలా చేతిలో చేయి వేసి ప్రేమగా మాట్లాడతావ్.. ఇప్పుడేంటి ఇలా చేస్తున్నావ్.. నువ్వంటే నాకు చాలా ఇష్టం అని లక్కీ అంటాడు. దీంతో ఆమెకు మరింత చిర్రెత్తుకొస్తుంది. నాకే ఇక్కడ దిక్కు లేదంటే.. నీ గోలేంటి అంటూ ఐశ్వర్య వెళ్లిపోతుంది.
రేఖను నిలదీసిన భ్రమరాంబ.. భూషణ్‌లోనూ అనుమానం
ఆ తర్వాత రేఖను భ్రమరాంబ, భూషణ్ నిలదీస్తారు. అసలు ఆ రాజు గాడి విషయంలో ఎందుకలా ఉంటున్నావ్.. వాడు ఏం చెప్పినా ఎందుకు సరే అంటున్నావ్.. ఇంతకుముందు వాడికి మాటకు మాట సమాధానం ఇచ్చేదానివి.. కానీ ఇప్పుడేమీ అనడం లేదు.. పూర్తిగా బెండైపోయావు అని భ్రమరాంబ అంటుంది. అటు భూషణ్ కూడా రేఖను అనుమానిస్తాడు. అసలు లక్కీని ఇక్కడ ఎందుకు ఉండమన్నావ్.. అసలు వాడు ఎవడు అని నిలదీస్తాడు.
అబద్ధం చెప్పిన రేఖ.. లక్కీ గాడిని పంపించేస్తానంటూ..
దీంతో రేఖ మరోసారి అబద్ధం చెప్పి తప్పించుకుంటుంది. రాజుకు యాక్సిడెంట్ అయినప్పుడు చూడటానికి వెళ్తే ఈ లక్కీ గాడి గురించి చెప్పాడు.. ఆ రాజును మచ్చిక చేసుకోవడానికి సరే సాయం చేస్తానని చెప్పాను.. కానీ వాడిలా నేరుగా ఇంట్లో తెచ్చి పెడతాడని అనుకోలేదు.. ఆ రాజు గాడి పని పడతాను.. ఈ లక్కీ గాడిని ఇంట్లో నుంచి పంపిస్తాను.. కాస్త టైమ్ ఇవ్వండి.. అంత వరకు నన్ను ఇలా విసిగించకండి అని చెప్పి వెళ్లిపోతుంది.
మదన్‌ను వాడుకుందామని ఇందుకు చెప్పిన రాజు..
ఇటు రాజుతో ఇందు అసలు లక్కీని రేఖ ఆంటీ తన కొడుకుగా ఎలా అంగీకరిస్తుంది అని మాట్లాడుతూ ఉంటుంది. దానికోసం మదన్ నే వాడుకోవాలని, ఆమె ఇప్పటి కొడుకుతోనే గతంలోని కొడుకు గురించి ప్రపంచానికి తెలిసేలా చేయాలని అంటాడు. అదెలా సాధ్యమవుతుంది అని ఇందు అడగ్గానే లక్కీ వచ్చి తాను ఏ గదిలో ఉండాలని రాజుని అడుగుతాడు.
కరెక్ట్ టైమ్ కి వచ్చావ్.. నువ్వు మా రేఖ పిన్ని కొడుకు మదన్ గదిలో ఉండు అని రాజు అంటాడు. వాడు రిచ్ కారులా ఉంటాడు.. నేనేమో ఇలా ఉంటాను.. వాడు ఊరుకుంటాడా అని భయపడతాడు. ఏమైనా అయితే నేను చూసుకుంటాను.. మీ అమ్మే రూమ్ లో ఉండమన్నదని చెప్పు అని రాజు అంటాడు. ఇది నా ఇల్లు ఎవరూ ఏమీ అనరు.. ఇంతకుముందు రేఖ పిన్నీ చూశావా నేను చెప్పిందే వింటోంది అని రాజు అభయమిస్తాడు. నిజమే ఇది రాజు ఇల్లే.. కానీ ఆ విషయం అతనికి తెలియదు.. నువ్వు రేఖ ఆంటీ కొడుకువే.. కానీ నీకు అది తెలియదు.. ఏంటో ఈ విచిత్రం అని ఇందు మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత లక్కీ వెళ్లిపోతాడు.
లక్కీ రావడంతో మదన్ గొడవ..
లక్కీ తన గదిలోకి రాగానే మదన్ సీరియస్ అవుతాడు. నువ్వేంటి ఇక్కడికొచ్చావ్.. బయటకు వెళ్లు అని అంటాడు. నేను నిన్నేం ఇబ్బంది పెట్టను తమ్ముడు అని లక్కీ అనడంతో అతడు మరింత రెచ్చిపోతాడు. దీంతో మీ అమ్మే ఇక్కడ ఉండమన్నదని లక్కీ అంటాడు. ఇక లాభం లేదనుకొని మమ్మీ అని పిలుస్తూ మదన్ ఆవేశంగా వెళ్తాడు. లక్కీ వద్దని బతిమాలుతున్నా వినడు. ఏం జరిగిందని భ్రమరాంబ అడిగితే.. ఈ లక్కీ గాడు నా గదిలో ఉంటాడట అని మదన్ అంటాడు. ఈ అనాథగాడు నా అల్లుడి గదిలో ఉండటమేంటని ఆమె నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది.
ఎంట్రీ ఇచ్చిన రాజు
అప్పుడే రేఖ వస్తుంది. మదన్ ఆమెను నిలదీస్తాడు. ఆమెను ఏమీ అనలేక చూస్తూ ఉండగా.. వాడిని ఆ గదిలో ఉండమని నేనే చెప్పానని రాజు ఎంట్రీ ఇస్తాడు. నువ్వెవరు చెప్పడానికి భ్రమరాంబ అడిగితే నా మాటే రేఖ పిన్ని మాట అని రాజు అంటాడు. లక్కీ అక్కడ ఉంటే ఇద్దరూ అన్నదమ్ముల్లా కలిసిపోతారు.. అయినా వాడు ఉండటానికి మరో గది లేదు కదా అని రాజు అంటాడు. దీనికి మేం ఒప్పుకోం అని భూషణ్ అంటాడు. మీరు కాదు ఒప్పుకోవాల్సింది రేఖ పిన్ని అని రాజు అంటాడు.
రేఖను మళ్లీ ఇరికించిన రాజు
అయినా లక్కీ, మదన్ అన్నదమ్ములే కదా అని రాజు అనడంతో అందరూ షాక్ తింటారు. వాళ్లు అన్నదమ్ములేంటి అని భ్రమరాంబ అడుగుతుంది. మరి లక్కీకి రేఖ తల్లి కదా అని రాజు అనడంతో రేఖ షాకవుతుంది. అంటే తల్లిలాంటిది కదా.. పెద్ద మనసుతో లక్కీగాడి తల్లిని వెతికి పెడతానని చెప్పింది కదా అంటూ రేఖను రాజు ఇరికిస్తాడు.
రేఖను నిలదీసిన భూషణ్..
రాజు అంత మాట్లాడుతున్నా.. రేఖ ఏమీ అనకపోవడంతో భూషణ్ లోనూ అనుమానం మొదలై ఆమెను నిలదీస్తాడు. వాడు ఇంత అంటున్నా ఏమీ అనడం లేదేంటి రేఖ అని అంటాడు. అయినా రేఖ ఏమీ మాట్లాడదు. రాజు మళ్లీ జోక్యం చేసుకుంటూ నువ్వే చెప్పు పిన్ని .. లక్కీ గాడు ఆ గదిలో ఉండాలా వద్దా.. నువ్వు వద్దంటే వద్దు.. కానీ బాగా ఆలోచించి నీ నిర్ణయం చెప్పు.. నీ నిర్ణయమే ఫైనల్.. కానీ బాగా ఆలోచించుకో అంటూ బ్లాక్‌మెయిల్ చేసినట్లు రాజు మాట్లాడటంతో రేఖకు మరో దారి లేక సరే అంటుంది.
రాజుతో ఇందు రొమాన్స్
అటు రాజుకి క్రమంగా దగ్గరవడానికి ప్రయత్నిస్తున్న ఇందు.. నీకు కాబోయే భార్య ఎలా ఉండాలి.. ఏం చేయాలి అని అడుగుతుంది. ఉదయాన్నే తల స్నానం చేసి.. ఆ జుట్టూ ఆరేసుకుంటూ.. వేడి వేడి కాఫీని తెచ్చి నన్ను నిద్ర లేపాలి అని రాజు అంటాడు. రాజు చెప్పినట్లే ఇందు కూడా మరుసటి రోజు ఉదయమే అతన్ని నిద్ర లేపుతుంది. అతనితో సరసాలాడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


