Brahmamudi July 7th Episode: బ్రహ్మముడి.. రాజును మోసం చేసిన రేఖ.. దెబ్బకు దెబ్బతో విలవిల.. కథ మొత్తం మార్చేసిన నందు

Brahmamudi Serial July 7th Episode: బ్రహ్మముడి సీరియల్ జులై 7 ఎపిసోడ్ లో రాజును మోసం చేశానని సంబరపడిపోయిన రేఖకు అతడు దిమ్మదిరిగే షాకిస్తాడు. ఆస్తి మొత్తం తనదే అనుకుంటున్న ఆమెకు నందు రూపంలో పెద్ద అడ్డంకే ఎదురవుతుంది.

Published on: Jul 7, 2026, 07:57:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో కథ మొత్తం మలుపు తిప్పే మరో ట్విస్ట్ ఎదురైంది. రాజు వెళ్లిపోవడంతో ఒంటరైన ఇందుని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చేసిన రేఖకు అదే రాజు ప్లాన్ తో ఎంట్రీ ఇచ్చిన నందు షాకిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

Brahmamudi July 7th Episode: బ్రహ్మముడి.. రాజును మోసం చేసిన రేఖ.. దెబ్బకు దెబ్బతో విలవిల.. కథ మొత్తం మార్చేసిన నందు
Brahmamudi July 7th Episode: బ్రహ్మముడి.. రాజును మోసం చేసిన రేఖ.. దెబ్బకు దెబ్బతో విలవిల.. కథ మొత్తం మార్చేసిన నందు

అక్కను మోసం చేశావంటూ రాజుని నిందించిన నందు

బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ రాజు దగ్గరికి వచ్చిన నందు అతన్ని తిట్టే సీన్ తో మొదలవుతుంది. మా అక్క నిన్ను నమ్ముకుంటే నిండా ముంచేసి వచ్చేశావ్.. నువ్వు డబ్బు మనిషివి.. నువ్వేదో అందగాడివని మా అక్క నిన్ను పెళ్లి చేసుకోలేదు.. అండగా ఉంటానని చేసుకుంటే నువ్విలా మధ్యలోనే వచ్చేసి మోసం చేస్తావనుకోలేదు అని రాజుని నందు నానా మాటలు అంటుంది.

తాను నిజంగానే ఇందు చెల్లినని చెప్పిన నందు

దీంతో రాజు కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. తాను మీ అక్కను వదిలేసి రాలేదని, ఆమె వెళ్లిపోమంటేనే వచ్చానని, రోజు కూలీనైన తాను అంతకంటే ఏం చేస్తానని అంటాడు. అయినా ఇందుకి లేని బాధ నీకెందు.. అక్క అని పిలిస్తే నువ్వూ ఆ ఇంటి మనిషివి అయిపోతావా అని రాజు అడుగుతాడు.

దీంతో నందు అసలు విషయం చెబుతుంది. తాను నిజంగానే ఇందు చెల్లినని, ఆమె బాబాయి కూతురినని నిజం చెబుతుంది. ఈ విషయం కేవలం ఇందుకి మాత్రమే తెలుసని అంటుంది. ఇది తెలుసుకొని పెద్దగా రియాక్ట్ కాని రాజు.. తన తండ్రి, ఇందు ఒప్పుకుంటేనే మళ్లీ ఆ ఇంటికి వెళ్తానని తేల్చి చెప్పడంతో నందు వెళ్లిపోతుంది.

ఇందు ఆస్తిని ట్రాన్స్‌ఫర్ చేయమని రేఖ ఒత్తిడి

ఇటు దుగ్గిరాల ఇంట్లో సీన్ రివర్సవుతుంది. రాజు వెళ్లిపోవడంతో ఇందు పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. ఆస్తి పేపర్లపై సంతకం పెట్టాలని రేఖ ఒత్తిడి చేస్తుంది. దీంతో అపర్ణ అడ్డుకుంటుంది. రేఖతో గట్టిగా మాట్లాడుతుంది. అయినా ఇందు సంతకం పెడితే ఏం జరుగుతుంది.. నా మనవడు కూడా సంతకం పెట్టాలి కదా అంటూ రాజు గురించి చెబుతుంది.

రాజుతో ఆస్తి పేపర్లపై సంతకం పెట్టించానన్న రేఖ

అతడు ఎప్పుడో ఆ పని చేశాని రేఖ చెప్పడంతో అపర్ణ, ఇందు షాకవుతారు. అతడు తనకు తానుగా పెట్టలేదని, ఆఫీసులో ఏవో పేపర్లపై సంతకాలు చేయిస్తూ.. పనిలో పనిగా వీటిపైనా సంతకం పెట్టించినట్లు చెబుతుంది.

ఆ పేపర్లు చూసి అపర్ణ, ఇందుకి ఏం చేయాలో అర్థం కాదు. మా ప్రాణాలు తీసినా నువ్వు సంతకం పెట్టొద్దని ఇందుతో అపర్ణ అంటుంది. నోరు లేస్తోందేంటి అని రేఖ మళ్లీ బెదిరింపులకు దిగడంతో ఇందు జోక్యం చేసుకొని సంతకం పెడతానని అంటుంది. రేపే రిజిస్ట్రార్ ను పిలిపిస్తానని రేఖ చెబుతుంది.

రాజు కోసం లక్కీని పిలిపించిన చలపతి

మరోవైపు రాజు బాధ చూసి తట్టుకోలేక లక్కీని పిలిపిస్తాడు చలపతి. రాజు వచ్చాడు రా.. కానీ వచ్చినప్పటి నుంచీ బాధలోనే ఉన్నాడు.. ఇన్నాళ్లుగా ఎన్ని తిట్టినా వాడిని ఇలా ఎప్పుడూ చూడలేదు.. అసలు ఏం జరిగింది.. ఎందుకలా ఉంటున్నాడో తెలుసుకో.. మాకంటే నీతోనే వాడు ఓపెన్ గా ఉంటాడు అని చలపతి చెబుతాడు. లక్కీ చేతుల్లో డబ్బు కూడా పెడతాడు.

ఇందుని ప్రేమించడం లేదని చెప్పిన రాజు

దీంతో లక్కీ మందు తీసుకొని రాజు దగ్గరికి వెళ్తాడు. తనకు మూడ్ లేదని రాజు అంటాడు. అసలు జరగని పెళ్లికి ఎందుకు అంత బాధపడతావ్.. డబ్బు కోసమే కదా నువ్వు వెళ్లింది అని లక్కీ అంటాడు. కొంపదీసి ఇందుని ప్రేమిస్తున్నావా అని అడిగితే.. అలాంటిదేమీ లేదని, ఇప్పటికీ తాను కమర్షియలే అని రాజు చెబుతాడు.

కానీ ఇందుని వదిలేసి వస్తుంటే ఏదో తెలియని బాధ కలిగిందని, మనిషిని వచ్చినా మనసు అక్కడే ఉందని అంటాడు. ఆరోజు కిడ్నాప్ చేసినప్పుడు కూడా రేఖ తీసుకెళ్లేటప్పుడు ఇందు చూసిన చూపుకు కూడా తాను ఇంతలా బాధపడలేదని, కానీ ఇప్పుడు ఎందుకో ఆమెను మరచిపోలేకపోతున్నానని చెప్పి రాజు వెళ్లిపోతాడు.

రాజుకు అపర్ణ ఫోన్

అప్పుడే రాజుకు అపర్ణ ఫోన్ చేస్తుంది. ఇక్కడ కొంప మునిగిపోతోందని, ఆస్తి పత్రాలపై ఇందుతో రేఖ సంతకం చేయిస్తోందని చెబుతుంది. రేపే రిజిస్ట్రార్ ను పిలిపిస్తానంటోందని అంటుంది. తాను సంతకం చేయకుండా ఎలా సాధ్యమని రాజు అడుగుతాడు. దీంతో నీతోనే ఆఫీసులోనే సంతకం చేయించిందట అని చెప్పడంతో రాజు షాక్ తింటాడు.

ఇటు ఇందు ఆస్తి పేపర్లపై సంతకం పెట్టడానికి సిద్ధమవుతుంది. సరిగ్గా అదే సమయానికి రాజు ప్లాన్ తో నందు ఎంట్రీ ఇస్తుంది. ఎవరి ఆస్తి ఎవరు సంతకం పెడతారంటూ వచ్చి తాను చిన్నప్పుడు ఇల్లు వదిలి వెళ్లిపోయిన నందనని చెబుతుంది. దీంతో రేఖ షాక్ తింటుంది. ఆ తర్వాత రేఖకు రాజు ఫోన్ చేసి తన దెబ్బ ఎలా ఉందని అడుగుతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More