బ్రహ్మముడి జూలై 6 ఎపిసోడ్: ఆస్తి పేపర్లపై ఇందు సంతకం- నందు ఎంట్రీ, వారసురాలినంటూ నిజం- రేఖకు రాజు దిమ్మతిరిగే ట్విస్ట్

Brahmamudi Serial July 6 Episode: బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ ఎపిసోడ్‌‌లో తన ప్లాన్ సక్సెస్ అయిందని రేఖ బ్యాచ్ సంతోషిస్తారు. ఇందుతో ఆస్తి రాయించుకునేందుకు స్కెచ్ వేసినట్లు రేఖ చెబుతుంది. ఆ మాటలు విన్న స్వాతి వెళ్లి ఇందుకు చెబుతుంది. ఇందుతో ఆస్తి రాయించుకుంటుంది రేఖ. అప్పుడే నందు ఎంట్రీ ఇస్తుంది.

Published on: Jul 6, 2026, 08:44:19 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజును ఎందుకు పంపించావని ఇందును నిలదీస్తుంది అపర్ణ. రాజుకు అపర్ణ కాల్ చేస్తే కలవదు. అపర్ణ ఫోన్ లాక్కుని రాజు తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారుగా. ఇక ఈ విషయం గురించి ఎవరు మాట్లాడకూడదు అని ఇందు వెళ్లిపోతుంది.

బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూలై 6వ ఎపిసోడ్

చక్రం తిప్పాలన్న ఐశ్వర్య

ఇప్పుడు ఏం జరిగిందో చూడు అని రేఖ తన ప్లాన్ సక్సెస్ అయినందు మురిసిపోతుంది. రాజు వెళ్లడం కాదు. మళ్లీ మనం చక్రం తిప్పాలి. వీళ్లు బానిసల్లా ఉండాలని ఐశ్వర్య అంటుంది. అలాగే జరుగుతుందని రేఖ అంటుంది. శేషు, స్వాతి ఫీల్ అవుతారు. మరోవైపు రాజు బాధపడుతుంటే వెంకీ వెళ్లి పలకరిస్తాడు. ఇందుతో సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవడం ఏంటని అడుగుతాడు.

అలా అయిపోయిందని రాజు అంటాడు. వదిన చాలా మంచిది. కానీ, అమ్మనాన్న ఎందుకో వదిలేయమంటున్నారు అని వెంకీ అంటాడు. ఆస్తులు ఉన్నవాళ్లకు శత్రువులు ఉంటారని ఆయన భయం. పోవాలని రాసి పెట్టి ఉంటే ఇలా కూడా పోతానుగా అని రాజు అంటాడు. నువ్వు ఏం చేసిన అమ్మ నాన్న పట్టించుకోలేదు. కానీ, ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా పట్టించుకుంటున్నారు. ఏం చేసిన వాళ్లు బాధకుండా చేయన్నా అని వెంకీ సలహా ఇచ్చి వెళ్లిపోతాడు.

రాజుకు అపర్ణ కాల్ చేస్తుంది. సొంత అమ్మమ్మ అయితే ఇలా వెళ్లిపోయేవాడివా. పరాయిదానిలా చూశావు. మీరే నిర్ణయం తీసుకుని వెళ్లిపోయావని అపర్ణ అంటుంది. నీ మనవరాలే వెళ్లిపోమ్మందని రాజు అంటాడు. నీవల్లే ఇందు జీవితం బాగుపడింది. ఇప్పుడు నువ్వు వెళ్లి ఇందు జీవితాన్ని చీకటిమయం చేస్తావో లేదా తిరిగి వచ్చి వెలుగులు నింపుతావో నీ ఇష్టం అని అపర్ణ కాల్ కట్ చేస్తుంది.

తప్పు చేశావన్న అపర్ణ

సుభాష్‌కి ఇందు సూప్ తాగిస్తుంది. మళ్లీ రాజు విషయంలో చేసినదానికి తిడుతుంది అపర్ణ. తన నిర్ణయం కరెక్టే అని ఇందు అంటుంది. తప్పు చేశావని అపర్ణ అంటుంది. పెళ్లంటే అది కాదు కదా. ఇద్దరు తోడుగా నిలబడటం అని పెళ్లి గురించి గొప్పగా చెబుతుంది అపర్ణ. సీతారాముల గురించి చెప్పి భర్తతోనే భార్య ఉండాలని సుభాష్ అంటాడు.

మీ అమ్మను మీ నాన్న ఇంట్లోంచి వెళ్లిపోమ్మనప్పుడు అదరలేదు బెదరలేదు. వాకిట్లో ఉండి పోరాటం చేసింది. మీ తాతయ్య వల్ల మళ్లీ ఇంట్లోకి వచ్చిందని తల్లి కావ్య గురించి చెబుతుంది అపర్ణ. ఇప్పుడు తల్లిదండ్రులు అన్నారని రాజును పంపించావ్. రేఖ అంటుందని మమ్మల్ని పంపించేస్తావా. ఇదేనా నువ్వు బంధానికి ఇచ్చే విలువ అని అపర్ణ అడుగుతుంది.

మీ మావయ్య కోపంలో నాలుగు మాటలు అంటే పంపుతావా. చేయాల్సింది అది కాదు. నీ భర్తతో నిలబడి మీ అత్తయ్య, మావయ్య మనసు మారేలా చేయాలి. నీ మీద నమ్మకం కలిగేలా చేయాలని అపర్ణ అంటుంది. నిజంగా పెళ్లి చేసుకుంటే అలాగే చేసేదాన్ని. కానీ, తను అద్దె మొగుడు అని ఇందు మనసులో అనుకుంటుంది. నా స్వార్థం కోసం రాజును వాళ్లకు దూరం చేయలేను. నేనే ఒంటరిగా పోరాడుతాను అని ఇందు అనేసి వెళ్లిపోతుంది.

ఆస్తి రాయించుకునే ప్లాన్

మళ్లీ మొదటికి వచ్చింది కదండి. రేఖతో ఒంటరిగా ఎలా పోరాడుతుందని అపర్ణ అంటుంది. మరోవైపు రేఖను తెగ పొగుడుతారు భ్రమరాంబ, భూషణ్. మళ్లీ వాడు వచ్చే అవకాశం ఉందని భయంగా ఉందని భ్రమరాంబ అంటుంది. అల్లుడు యమ స్పీడ్ కదా వచ్చిన వస్తాడని శేషు అంటాడు. వాడు వచ్చే అవకాశమే లేడు. వచ్చిన పుణ్యకాలం పోతుంది. గేమ్ అయిపోతుందని రేఖ అంటుంది.

అసలు నువ్వు అంటున్న గేమ్ ఏంటీ అని భ్రమరాంబ అంటుంది. రేఖ మీద ఉన్న పవర్ అంతా మనమీదకు తీసేసుకుంటాం. ఆస్తి మొత్తం ఇందుతో రాయించుకుంటాం అని రేఖ చెబుతుంది. ఆ మాటలు స్వాతి వింటుంది. ఎలా కుదురుతుందని, ఇందు భర్త సంతకం కూడా కావాలని లాయర్ అన్నారుగా అని భ్రమరాంబ అంటుంది.

అది తెలియకుండానే ప్లాన్ వేశాను అనుకున్నావా. ఆస్తి మొత్తం నా సొంతం చేసుకుని మన సమస్యలకు స్వస్తి పలుకుతానని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న స్వాతి వెళ్లి ఇందుతో కంగారుగా చెబుతుంది. ఆస్తి లాగేసుకునేందుకు రేఖ ఆంటీ ఏదో ప్లాన్ చేస్తుంది. ఇన్నిరోజులు రాజు ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు. రాజు బావ నీ బలం, ధైర్యం. నీకోసం ఏదైనా చేసే మంచి మనిషి. రాజు బావను పంపించి తప్పు చేశావ్. బావకు కాల్ చేసి రప్పించు అని స్వాతి అంటుంది.

భర్త సంతకం కావాలిగా

నా ఆస్తి దక్కించుకోవాలంటే భర్త సంతకం కావాలిగా అది చేయలేరని ఇందు అంటుంది. ఆ విషయం కూడా మాట్లాడుకుంటున్నారు. రేఖ ఆంటీ చాలా పెద్ద ప్లాన్ చేసింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఆస్తి రాయించుకుంటానని చెబుతోంది. తన కాన్ఫిడెంట్ చూస్తే కచ్చితంగా జరుగుతుందనిపిస్తుంది. రాజు బావ ఉంటేనే ప్లాన్ తిప్పికొట్టగలడు అని స్వాతి చెబుతుంది.

నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే బావ అర్థం చేసుకుంటాడు. వెంటనే వస్తాడని స్వాతి అంటుంది. నేను ఫోన్ చేయలేనని. నాకోసం ఇబ్బంది పెట్టలేనని ఇందు చెబుతుంది. మరుసటి రోజు ఇందుతో ఆస్తి రాయించుకునేందుకు పేపర్స్‌పై సంతకం పెట్టమని పెన్ ఇస్తుంది రేఖ. ఇంతలో నందు ఎంట్రీ ఇస్తుంది.

ఎవరి ఆస్తి ఎవరు ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటున్నారు అని నందు అంటుంది. ఇందు ఇష్టంగానే పెడుతుంది. తను పెడితే సరిపోతుంది. నువ్వు కూడా పెట్టాలా ఏంటీ అని భ్రమరాంబ అంటుంది. అవును, చిన్నప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోయిన నందును నేనే. వారసురాలిగా నా సంతకం కూడా కావాలని నందు అంటుంది.

రేఖకు రాజు లేకుండానే ట్విస్ట్

దాంతో రేఖ షాక్ అయిపోతుంది. తర్వాత రాజు రేఖకు కాల్ చేసి ఎలా ఉంది పిన్ని మన సర్‌ప్రైజ్ అంటాడు. రాజు లేకుండా కూడా నందుతో ఇందు ఆస్తిని కాపాడే ట్విస్టుతో అదిరిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ నేటి (జూలై 6) ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More