బ్రహ్మముడి మే 26 ఎపిసోడ్: ఒకరికి మంచి మరొకరి ప్లాన్- స్వాతి ప్రేమను రెజెక్ట్ చేసిన మదన్, అది చూసిన రేఖ- రాజు, ఇందు శోభనం
Brahmamudi Serial May 26th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 26వ ఎపిసోడ్‌లో కంపెనీని కోసం రేఖ, ఇందులు ఒకరికి మించి మరొకరు ప్లాన్స్ వేస్తారు. మదన్‌కు లవ్ ప్రపోజ్ చేస్తుంది స్వాతి. కానీ, మదన్ రెజెక్ట్ చేస్తాడు. స్వాతిని ఇందు ఓదారుస్తుంది. అదంతా రేఖ చూస్తుంది. పరంధామయ్యను రాజు ఇందు కలుస్తారు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు బెడ్ మీద కూర్చుని తింటుంటే రాజ్ అలాగే చూస్తాడు. ఏం క్యారెక్టరే నీది, ఇంత పగేంటే నీకు. నిన్ను కిడ్నాప్ చేసి టార్చర్ నేను అనుభవించాను. అసలు నన్ను ఏం చేద్దామనుకున్నావ్ అని రాజు అంటాడు. ఏంటీ ఈ ఓవరాక్షన్ అని ఇందు అంటుంది.

ఇందు స్కామ్‌లు
డబ్బు చూపించి నా పీక పిసికేస్తున్నావ్. దగ, మోసం, స్కామ్‌ల మీద స్కామ్‌లు చేసి మీ రేఖ ఆంటీ ముందు నన్ను బలి చేసేందుకు సిద్ధపడ్డావ్ అని రాజు అంటాడు.సోది ఆపి అసలు విషయం చెప్పమని ఇందు అంటుంది. ప్లాన్ ఇచ్చి సీఈఓ అవ్వమని చెప్పి, ఇప్పుడు రేఖ ఆంటీకి చెప్పేశావ్ అని అంటాడు రాజు. నేను సీఈఓగా పోటీ చేస్తే రేఖ ఆంటీ అడ్డుకుంటుంది. అదే నువ్వు పోటీలో ఉంటే నన్ను సీఈఓను చేస్తుంది అని ఇందు చెబుతుంది.
దాంతో రాజు షాక్ అవుతాడు. రాజుగా సీఈఓ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావు కదరా. ఆశల మీద ఒక్కసారిగా నీళ్లు చల్లేసింది కదరా అని రాజు మనసులో అనుకుంటాడు. అంటే నన్ను సీఈఓ చేయవా అని రాజు అంటే.. ఛాన్సే లేదు అని ఇందు అంటుంది. ఆ రేఖ ఏం చేయదా అని రాజు అంటే.. ఏం చేయరు. నీ గురించే ఆలోచిస్తుంటారు అని ఇందు అంటుంది. అన్నట్లుగానే మరోవైపు రాజు అంత ఓవర్ చేస్తుంటే ఊరుకుంటావేంటీ అని రేఖతో అంటుంది భ్రమరాంబ.
వాడితో మంచివాళ్లల నటించి ఆస్తి పేపర్స్‌పై సంతకం చేయించుకుని ఎంతో కొంత డబ్బు పారేద్దామనుకున్నాం. కానీ, వాడు ఇప్పుడు ఏకంగా నా చైర్‌లోనే కూర్చుందామని చూశాడు. నేను ఊరుకుంటానా. నా ప్లాన్స్ నాకున్నాయి. వాడిని అడ్డుకునేందుకు నా దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని రేఖ అంటుంది. ఆ బ్రహ్మాస్త్రం నేనే అని ఇందు అంటుంది. ఆ బ్రహ్మాస్త్రాన్ని వాడుకుని నేను మళ్లీ సీఈఓ అవుతాను, కంపెనీ పగ్గాలు నేనే పట్టుకుంటాను అని రేఖ అంటుంది.
ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావ్
నన్ను అడ్డుపెట్టుకుని తను సీఈఓ అవ్వాలనుకుంటుంది. అది జరగకూడదు. అలా జరగకూడదంటే మన బోర్డ్ మెంబర్లో సీనియర్ మెంబర్ అయిన పరంధామయ్య గారిని కలవాలి అని ఇందు అంటుంది. అతనెందుకు మనకు సపోర్ట్ చేస్తారు అని రాజు అడిగితే.. చేస్తారు. మా నాన్న అమ్మ అంటే ఆయనకు చాలా గౌరవం. కచ్చితంగా హెల్ప్ చేస్తారని ఇందు అంటుంది.
నువ్వు ఉన్నది ఇంత. చూస్తే అమాయకురాలిలా కనిపిస్తావ్. ఇంటి పని వంట పని తప్పా బిజినెస్ వ్యవహారాలు తెలియదని అంటున్నారు. ఇంత క్రూరంగా ఎలా ఆలోచిస్తున్నావ్ అని రాజు అడుగుతాడు. ఇది క్రూరం కాదు. నా కంపెనీనిని కాపాడుకునేందుకు ఎత్తుకు పయ్యెత్తు వేస్తున్నాను అంతే అని ఇందు చెబుతుంది. నువ్వు మహా తెలివైనదానివే. నిన్ను అమాయకురాలు అనుకున్న నేను పిచ్చోన్ని. ఇప్పుడు మీ రేఖ ఆంటీని కూడా పిచ్చిదాన్ని చేస్తున్నావ్ కదా అని రాజు అంటాడు.
ఆ రాజుగాడు నా సీఈఓ పోస్ట్ లాక్కుని నన్ను పిచ్చిదాన్ని చేయాలనుకున్నాడు. కానీ, వాడి పెళ్లాంతోనే వాడిని పిచ్చోన్ని ఎలా చేస్తానో చూడు అని రేఖ అంటుంది. ఇలా రేఖ, ఇందులు ఒకరికి మించి మరొకరు ప్లాన్స్ వేసుకుంటారు. తను చేసిన ఓవరాక్షన్‌కు పేమెంట్‌లో కోత పెట్టకని రాజు వినయంగా అడుగుతాడు. సరే అన్న ఇందు పరంధామయ్యను కలుద్దామంటుంది.
వెంకీకి నందు మోటివేషన్
మరోవైపు ఉద్యోగం పోయింది నందుకు చెబుతాడు వెంకీ. నందు మోటివేట్ చేస్తుంది. బాధపడకని, ఇంకో జాబ్ ట్రై చేయమని, కంపెనీ వాళ్లే బాధపడేలా చేయాలని ధైర్యం చెబుతుంది. తర్వాత వెంకీకి సర్‌ప్రైజ్ ఉందని, బ్రహ్మముడి యాప్‌లో సంగీత అనే అమ్మాయితో నీలాగే చాటింగ్ చేశానని నందు అంటుంది. తనకు మాట్లాడే మూడ్ లేదని, పంపించేయమని వెంకీ అంటాడు. నీ మూడ్ సెట్ చేసేందుకే అమ్మాయి వస్తుందని నందు చెబుతుంది.
అంతలోనే సంగీత వస్తుంది. వెంకీతో పర్సనల్‌గా మాట్లాడాలి పక్కకు వెళ్తారా అని నందును సంగీత అడుగుతుంది. వెంకీ మాత్రం అవసరం లేదు. ఇక్కడే ఉంటుందని అంటాడు. సంగీత ప్రశ్నలు అడిగితే అడ్డదిడ్డంగా సమాధానం ఇస్తాడు వెంకీ. తన మూడ్ బాగా లేదని నందు చెబుతుంది. మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని వెంకీ అడిగితే.. అవును అని సంగీత చెబుతుంది. ఎందుకు అని వెంకీ అడుగుతాడు.
మీరు చూడటానికి యావరేజ్‌గా ఉన్నా మంచి కంపెనీలో జాబ్ ఉంది. నెలకు లక్ష జీతం వస్తుంది. అది నాకు సెక్యూరిటీలా ఉంటుందని సంగీత చెబుతుంది. నాకు జాబ్ పోయిందని తెలిస్తే అని వెంకీ అంటాడు. జాబ్ లేదని తెలిస్తే లైక్ చేయను. బ్లాక్ చేసేదాన్ని. పెళ్లయ్యాకా జాబ్ పోతే రిలేషన్ బ్రేక్ చేస్తానని సంగీత అంటుంది. ఇప్పుడు అందరికి కావాల్సింది డబ్బు మాత్రమే లవ్ కాదు అని వెంకీ అంటాడు.
వెంకీ టెస్ట్
హలో నేను అలా కాదు స్పెషల్ అని సంగీత అంటుంది. జాబ్ లేదని తెలిసిన కూడా ప్రేమించిన అబ్బాయితోనే ఉంటారా అని వెంకీ టెస్ట్ చేస్తాడు. అవును అని సంగీత అంటుంది. అయితే, నా జాబ్ పోయింది. నాకు పది లక్షల అప్పు కూడా ఉందని వెంకీ అంటాడు. దాంతో ఫోన్ వచ్చిందని సంగీత తప్పించుకుంటుంది. డబ్బు ఉంటేనే ప్రేమ, అమ్మాయి. అంతేగానీ ఎధవ కబుర్లు చెప్పకు వెళ్లు అని సంగీతను పంపించేస్తాడు వెంకీ.
పెళ్లి అనే బంధానికి విలువ లేదని నందుతో వెంకీ అంటాడు. నేనున్న పరిస్థితిల్లో అమ్మాయి అవసరం లేదని వెంకీ అంటాడు. నీకు కచ్చితంగా జాబ్ వస్తుందని నందు చెబుతుంది. మరోవైపు మదన్‌కు అడ్డంగా వెళ్లిన స్వాతి తన మనసులో ఉన్న ప్రేమ బయటపెడుతుంది. ఆ మాటలు ఇందు వింటుంది.
బావా నేను నిన్ను చిన్నప్పటి నుంచి ఇష్టపడుతున్నాను. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని స్వాతి చాలా ప్రేమగా చెబుతుంది. సారీ స్వాతి. నేను ఎవరిని ప్రేమించాలని అనుకోవట్లేదు. మా అమ్మ చెబితే అదే చేస్తాను. ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను అని స్వాతి లవ్ రెజెక్ట్ చేసి వెళ్లిపోతాడు మదన్. అదంతా ఇందు చూస్తుంది.
స్వాతి ప్రేమ తెలుసుకున్న రేఖ
స్వాతి బాధపడుతుంటే ఇందు వెళ్తుంది. ఇందును ఏడుస్తూ కౌగిలించుకుంటుంది స్వాతి. తను నా ప్రేమను రెజెక్ట్ చేశాడు. తను నాకు కావాలి అని స్వాతి అంటుంది. తను వాళ్ల అమ్మ చెప్పింది చేస్తానన్నాడు. ఒకవేళ వాళ్ల అమ్మ గురించి తన ఇష్టాన్ని పక్కన పెట్టి మనసులోనే దాచుకున్నాడేమో. వాళ్ల అమ్మ నిన్నే పెళ్లి చేసుకోమ్మని చెబుతుందేమో. నీకు మదన్‌తో పెళ్లి చేయించే బాధ్యత నాది అని స్వాతికి మాట ఇస్తుంది ఇందు.
అదంతా రేఖ వింటుంది. ఓహో నువ్వు నా కొడుకును ప్రేమిస్తున్నావా. మీ అమ్మ ఏమో నా కొడుకును అల్లుడిని చేసుకుందామనుకుంటుంది. బాగుంది. చెప్తా మీ సంగతి అని రేఖ అనుకుంటుంది. తర్వాత సీనియర్ బోర్డ్ మెంబర్ పరంధామయ్యను ఇందు, రాజు కలుస్తారు. కంపెనీకి పూర్వ వైభవం వస్తుందంటే మీకు సపోర్ట్ చేస్తానని, ఓటు వేస్తానని పరంధామయ్య అంటాడు.
మరోవైపు ఇందు గురించి బాధపడుతున్నట్లు నటించిన భ్రమరాంబ వాళ్లు ఫస్ట్ నైట్ గురించి ఎవరైనా ఆలోచించారా అని అంటుంది. అపర్ణ, సుభాష్ ఆ మాటలు వింటారు. ఇందు, రాజుల శోభనం ఏర్పాట్లు చేద్దామని అపర్ణతో సుభాష్ అంటాడు. పంతులుని పిలిపించి మంచి ముహుర్తం చూడమంటాను అని అపర్ణ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


