బ్రహ్మముడి మే 19 ఎపిసోడ్: రాజుకు పెరిగిన 2500 పేమెంట్.. ఆఫీస్‌కు రాజ్-కావ్యలా రాజు-ఇందు.. రేఖపై ఉద్యోగుల తిరుగుబాటు

Brahmamudi Serial May 19th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 19వ ఎపిసోడ్‌‌లో రాకేష్ డబ్బులు అడగడం, అపర్ణ మాటలు, రేఖ సరిగా చూసుకోకపోడంతో ఇందు కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంది. తన తండ్రి రాజ్ సూట్‌ను వేసుకుని ఆఫీస్‌కు రమ్మని రాజుతో చెబుతుంది ఇందు. దానికి సెపరేట్‌గా 2500 పేమెంట్ ఇస్తానంటుంది ఇందు.

Published on: May 19, 2026, 09:03:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య తన దగ్గర 10 లక్షలు అప్పు చేసిందని ఇందుకు రాకేష్ చెబుతాడు. అంత డబ్బు ఏం చేశావని, ఈ విషయం రేఖ ఆంటీకి తెలిస్తే సమస్య అవుతుంది అని ఇందు అంటుంది. ఛాన్స్ దొరికింది కదా అని అనకు అని ఐశ్వర్య అంటుంది. రాకేష్ నీకు డబ్బులు ఇచ్చేంతవరకు ఆగు అని చెప్పేసి వెళ్లిపోతుంది ఐశ్వర్య.

బ్రహ్మముడి సీరియల్ మే 19 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ మే 19 ఎపిసోడ్

మీ మీద కూడా సీరియస్ అవుతుంది

డబ్బులిచ్చే వరకు అడుగు కూడా కదలను. న్యూసెన్స్ చేస్తానని రాకేష్ అంటే.. అలా చేస్తే ఇబ్బంది అవుతుంది. మా రేఖ ఆంటీకి ఇది తెలిస్తే తన మీద ఎంత సీరియస్ అవుతుందో, మీ మీద కూడా అంతే అవుతుంది. ఎలాగోలా మీకు డబ్బు వచ్చేలా చేస్తానని రాకేష్‌కు ఇందు హామీ ఇస్తుంది. సరే మీరు చెప్పారని వెళ్తున్నా. లేకుంటే ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని రాకేష్ వెళ్లిపోతాడు.

తర్వాత రాకేష్ చెప్పింది, కంపెనీ ఉద్యోగులకు శాలరీ ఇవ్వకపోవడం, అపర్ణ చెప్పిన మాటలు అన్ని గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఇందు. బీరువాలోని తండ్రి రాజ్ డ్రెస్ తీసి చూస్తుంది. నాన్న అంటూ ఏడుస్తుంది. మరుసటి రోజు ఉదయం రాజు నిద్రవలేవగానే తండ్రి సూట్‌తో గుడ్ మార్నింగ్ చెబుతుంది. రాజుకు అది తన తండ్రి సూట్ అని చెప్పి వేసుకోమంటుంది ఇందు. సూట్ చూసి రాజు టెంప్ట్ అవుతాడు.

ఈ సూట్‌కు ఓ చరిత్ర ఉంది. ఇది వేసుకుని మా నాన్న సైన్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సక్సెస్ అయిందట అని చెప్పుతుంది ఇందు. మీ నాన్న అంటే బిజినెస్ చేసేవాడు కాబట్టి వేసుకునేవాడు. నేను ఏం చేస్తున్నాని ఇది అని రాజు అంటాడు. ఇది వేసుకుని నాతోపాటు ఆఫీస్‌కు రావాలి. మా రేఖ ఆంటీ వల్ల అందరూ నష్టపోతున్నారు. మధ్య తరగతి వాళ్ల కష్టాలు నీకు కూడా తెలుసు కదా. నేను కంపెనీ బాధ్యతలు చేపట్టాలని నిర్ణయించుకున్నా. ఈ సూట్ వేసుకుని నా పక్కన నిలబడు చాలు అని ఇందు అంటుంది.

రాజుకు పెరిగిన పేమెంట్

కానీ, రాజు ఒప్పుకోడు. నువ్వు బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకున్నావుగా. ఇలా చేస్తే ప్రాక్టీస్ అవుతుందని ఇందు అవుతుంది. నేను నిజంగా పెద్ద బిజినెస్ మ్యాన్ అవుతా, కానీ నటించను అని రాజు అంటాడు. దీనికి సెపరేట్ పేమెంట్ 2 వేలు ఇస్తానని ఇందు అంటుంది. రాజు బేరాలు ఆడితే.. ఇంకో ఐదు వందలు కలిపి 2,500 ఇస్తానని ఇందు అంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాగా. సూట్ కూడా వేసుకోవచ్చు అని రాజు ఒప్పుకుంటాడు.

అంటే ఇప్పుడు నాకు రోజుకు 12,500 పేమెంట్ అన్నమాట. కానీ, కటింగ్స్ చేయకుంటే చాలని రాజు అంటాడు. సూట్ వేసుకుని రమ్మని ఇందు వెళ్లిపోతుంది. మరోవైపు మదన్ చాలా ఎగ్స్ తింటుంటాడు. స్వాతి వచ్చి మాట్లాడుతుంది. ఈరోజు నైట్ ఫేమస్ సింగర్ పార్టీ ఉంది. నువ్వుంటే బాగుంటుంది. నువ్వు నా పక్కన ఉంటే చాలా బాగుంటుంది బావ. అదే తోడుగా ఉంటే అని స్వాతి అంటుంది. నీకోసం కూడా టికెట్స్ తీసుకున్నా. వస్తావుగా అని స్వాతి అడుగుతుంది.

ఇది నైట్ తప్పా డే టైమ్‌లో పెట్టుకోదని మదన్ మనుసులో అనుకుని బయటకు నాకు రావడం కుదరదని అంటాడు. కారణం చెప్పకుంటే ఏడుస్తానని స్వాతి ఏడుస్తుంది. దాంతో మదన్ చెబుతాడు. నైట్ టైమ్‌లో రౌడీలు ఉంటారుగా అందుకే అని మదన్ అంటాడు. ఇన్ని ఎగ్స్ తింటున్నావ్. రౌడీలకు భయపడుతున్నావా అని ఆ ఎగ్స్ పట్టుకుని పరిగెత్తుతుంది స్వాతి. మదన్ వెంట పడతాడు. పార్టీకి వస్తానంటేనే ఎగ్స్ ఇస్తానని స్వాతి అంటుంది.

రాజు కొత్త అవతారం

అది చూసి భ్రమరాంబ మురిసిపోతుంది. వాడే నా కూతురుకి భర్త, ఇంటికి యువరాజు అని భ్రమరాంబ అంటుంది. ఈ ఇంటి అసలైన యువరాజు వస్తున్నాడని రాజును చూపిస్తాడు శేషు. రాజును సూట్‌లో చూసి అంతా షాక్ అవుతారు. రాజు, ఇందు మెట్లపై నుంచి రాజ్, కావ్యలాగే వస్తారు. మామ రాజ్ సూట్ వేసుకున్న రాజును, ఇందును చూసి అపర్ణ, సుభాష్ చాలా సంతోషిస్తారు. వాళ్ల కొడుకే దిగొచ్చాడని ఎమోషనల్ డ్రామా చేస్తారేమో అని రాజు అనుకుంటాడు.

ఏంటీ కొత్త అవతారం అని భ్రమరాంబ అంటే.. అవతారం కాదు ఒరిజినల్. నా భార్య బాధ్యతలన్ని నేనే తీసుకుంటానని చెప్పానుగా. నా భార్య ఇందును ఆఫీస్‌కు తీసుకెళ్తున్నాను అని రాజు అంటాడు. ఇందుకు అక్షరం ముక్క రాదుగా అని భ్రమరాంబ అంటే.. నాకు వచ్చు కదా అని రాజు అంటాడు. నానమ్మ నేను కంపెనీ బాధ్యతలు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని ఇందు అంటుంది.

అపర్ణ, సుభాష్ దగ్గర ఇందు, రాజు ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ కారులో వెళ్తున్నామా అని రాజు అంటే.. కాదు. ఆటోలో అని ఇందు అంటుంది. దాంతో రాజు సెటైర్లు వేస్తాడు. నాకు ఈ కారే కావాలని రాజు గోల చేస్తాడు. భ్రమరాంబను పిలిచి ఈ కారు నీదే కదా. ఇలాంటి అందమైనవాళ్లకే అందమైన కారు ఉంటుంది. అది నాకు ఈసారి కావాలి అని రాజు అంటాడు. నేను అది ఇవ్వను. చాలా కష్టంగా ఈఎమ్ఐ కడుతున్నా అని భ్రమరాంబ ఏడుస్తుంది.

ఆఫీస్‌కు రాజు, ఇందు

భ్రమరాంబ దగ్గరి నుంచి కారు కీస్ తీసుకుంటాడు రాజు. కారులో రాజు, ఇందు ఆఫీస్‌కు వెళ్తారు. జీతం ఇవ్వనందుకు ఉద్యోగులందరూ రేఖపై ఎదురు తిరిగి తిరుగుబాటు చేస్తారు. మీకు ఇక్కడ ఎవ్వరూ సపోర్ట్‌గా ఉండరని రేఖ అంటుంటే.. నేనున్నాని రాజు, ఇందు ఎంట్రీ ఇస్తారు. రాజు, ఇందు ఆఫీస్‌లోకి అడుగుపెట్టగానే అంతా రాజ్, కావ్య వచ్చారనుకుంటారు. రేఖ షాక్ అయిపోతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More