బ్రహ్మముడి మే 15 ఎపిసోడ్: మైండ్ బ్లాక్ ట్విస్ట్, లక్కీ కూడా రేఖ కొడుకే- తండ్రి మాత్రం భూషణ్ కాదు- లాయర్ 3 కండిషన్స్!
Brahmamudi Serial May 15th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 15వ ఎపిసోడ్‌లో మైండ్ బ్లాక్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. లక్కీ కూడా రేఖ కొడుకు అని జైలు నుంచి వచ్చిన ఆంటోనీ ద్వారా తెలుస్తుంది. భూషణ్‌తో పెళ్లి కంటే ముందే లక్కీని కన్న రేఖ ఆంటోనీ ద్వారా వదిలించుకుంటుంది. ఇందు ఆస్తికి లాయర్ 3 కండిషన్స్ చెబుతాడు.
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందు తన సొంత చెల్లెలు అని ఇందుకు చెబుతుంది. ఎందుకు ఇంట్లోంచి పారిపోయావే అని ఇందు అడిగితే.. రేఖ పెట్టే టార్చర్ తట్టుకోలేక వెళ్లిపోయాను. పోలీస్ అయి వచ్చి ఆ రేఖ అంతు చూద్దామని వెళ్లాను అని నందు చెబుతుంది. దాంతో ఇందు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది.

ఇందుకు మాటిచ్చిన నందు
తర్వాత అసలు ఈ తాళి ఏంటని నందు అడుగుతుంది. నేను నీకు చెప్పే నిజాన్ని ఎవరికి చెప్పను అని మాటివ్వమని అడుగుతుంది ఇందు. ఎవరికి చెప్పను మాటిస్తుంది నందు. నిజానికి ఇది పెళ్లి కాదు. నువ్వు ఊహించినట్లే ఇది నాటకం. రాజు నాకు అద్దె మొగుడుగా వచ్చాడని వాళ్లిద్దరి మధ్య జరిగిన డీల్ గురించి చెబుతుంది ఇందు.
ముందు ఐశ్వర్యను మన దారిలోకి తెచ్చుకోవాలి. ఇంట్లో ఒక్కొక్కరిగా అందరిని మార్చాలి అని ఇందు అంటుంది. నీ ఆలోచన చాలా బాగుంది. నేను పోలీస్ అయి నీకు ఏది చేయాలో అది చేస్తాను అని నందు అంటుంది. నానమ్మను కలుద్దాం రా అని ఇందు అంటే.. వద్దక్కా. నా చదువు ఇంకో సంవత్సరంలో అయిపోతుంది. అప్పుడు పోలీస్ జాబ్ కొడతాను. పోలీస్‌లా ఇంటికి వస్తాను. ఆ రేఖ ఆంటీకి చుక్కలు చూపిస్తా. అప్పుడు కలుస్తా నానమ్మను. అప్పటివరకు నువ్వు ఎవరికి చెప్పకని నందు అంటుంది.
మరోవైపు ఐదేళ్ల తర్వాత జైలు నుంచి వచ్చిన ఆంటోనీకి బీరు, బిర్యాను ఇస్తాడు లక్కీ. అది తింటూ తాగుతున్న ఆంటోనీతో తన తల్లి గురించి అడుగుతాడు లక్కీ. మా అమ్మ చనిపోయి నీ చేతుల్లో పెట్టిందని, నువ్వు నన్ను అనాథశరణాలయాంలో వదిలేశావని చెప్పావుగా. రేయ్ మా అమ్మ ఎవరో తెలియాలిరా. నా కన్నతల్లి ఎవరో చూడాలిరా. 15 ఏళ్లుగా మా అమ్మ గురించి అడుగుతూనే ఉన్నాను అని వేడుకుంటాడు లక్కీ.
రేఖ కొడుకే లక్కీ
అరేయ్ నేను జైల్లో ఉండటం వల్ల వెతకలేకపోయాను. కానీ, ఇప్పుడు ఎక్కడ ఉన్నా వెతుకుతాను. జల్లెడ వేసి వెతికి మరి మీ అమ్మను పట్టుకుంటాను అని ఆంటోనీ అంటాడు. లక్కీ జేబులో ఉన్న డబ్బు తీసుకుంటాడు ఆంటోనీ. ముందు నేను ఎక్కడ ఉండాలో అది చూడు వెళ్లు అని ఆంటోనీ అంటే లక్కీ వెళ్లిపోతాడు. నేను మీ అమ్మను తీసుకొస్తే నాకేం దొరుకుతుందిరా అని లక్కీ తల్లి ఫొటో చూసి నవ్వుతాడు ఆంటోనీ.
లక్కీ తల్లి ఫొటో చూసి నీ వల్ల నాకు బీరు, బిర్యానీ, డబ్బులు వస్తున్నాయమ్మా అని గతం గుర్తు చేసుకుంటాడు ఆంటోనీ. లక్కీ తల్లి ఎవరో కాదు రేఖ అని మైండ్ బ్లాక్ ట్విస్ట్ తెలుస్తుంది. తనకు ఈ బిడ్డ పుట్టినట్లు ఎవరికి తెలియకూడదని, నేను ప్రేమించినవాడు తనకు నచ్చకపోవడంతో వాడిని వదిలేసినట్లు, వాడికి పుట్టినోడు నాకెందుకు, అందుకే వీడి పీడ వదిలించుకుంటున్నాను అని ఆంటోనీతో రేఖ చెబుతుంది.
వీడిని అమ్ముకుంటావో, పెంచుకుంటావో నీ ఇష్టం అని ఆంటోనీకి రేఖ డబ్బు ఇస్తుంది. ఇక వీడు నాకు పుట్టినట్లు తెలియకూడదు, నువ్వు నాకు కనిపించకూడదు అని రేఖ చెప్పి వెళ్లిపోతుంది. రేఖ ప్రేమించి మోసం చేసిన వాడితో రేఖ లక్కీని కన్న విషయం మాములు ట్విస్ట్ కాదు. కాబట్టి లక్కీ కూడా దుగ్గిరాల ఇంటి బిడ్డే. కానీ, ఆంటోనికి రివర్స్‌లో డబ్బిచ్చి లక్కీని అమ్మేస్తుంది తల్లి రేఖ. అయితే, రేఖకు భూషణ్‌తో పుట్టిన కొడుకు మదన్ ఉంటాడు. రేఖకు పెళ్లి కాకముందే మరొకరితో లక్కీ పుట్టినట్లు తెలుస్తోంది.
లాయర్ 3 కండిషన్స్
మరోవైపు ఇందుకు పెళ్లి జరిగింది కాబట్టి తన పేరు మీద ఉన్న ఆస్తిని ఎవరి పేరు మీదకైనా ట్రాన్స్‌ఫర్ చేయొచ్చు అని లాయర్ చెబితే రేఖ సంతోషిస్తుంది. ఇందుకు పెళ్లి అయినట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ ప్రూఫ్స్ కావాలని, లేకుంటే కోర్టు ఒప్పుకోదని లాయర్ అడుగుతాడు. మ్యారేజ్ సర్టిఫికేట్‌తోపాటు ఇందు భర్త సంతకం కావాలని లాయర్ అంటాడు.
ఒకటి.. ఇందు మ్యారేజ్ సర్టిఫికేట్, రెండు.. ఇందు డాక్యుమెంట్స్ మీద ఆమె వేలిముద్రలు కావాలి, మూడు ఇందు భర్త ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టాలి అని ఆస్తి రావడానికి కండిషన్స్ చెబుతాడు లాయర్. పెళ్లి అయితే భర్తకు కూడా ఆస్తి మీద హక్కు ఉన్నట్లే కదా అని వీలునామా గురించి వివరిస్తాడు లాయర్. అలా లాయర్ ఇచ్చిన షాక్‌తో రేఖ, భ్రమరాంబ, భూషణ్ షాక్ అయిపోతారు.
తర్వాత అంతా దీనిపై డిస్కషన్ పెట్టుకుంటారు. ఆ రాజుగాడిని గుప్పిట్లో ఎలా పెట్టుకుంటాం. వాడు మన మీట వెంటాడా అని భూషణ్ అంటాడు. రాజును మాయ చేద్దామని, వాడికి డబ్బంటే ఆశ ఉందో లేదో చూద్దామని, వాడితో మాట్లాడి అంతరగం తెలుసుకుందామని, వాడు కచ్చితంగా డబ్బు కోసమే వచ్చి ఉంటాడు. అది మనం తెలుసుకోవాలి రేఖ అంటుంది. వాడు డబ్బు కోసం వచ్చి ఉంటే వాడిని డబ్బును ఎరగా వేసి మన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని రేఖ అంటుంది.
రాజును తిట్టిన లక్కీ
మరోవైపు రాజును లక్కీ కలిసి పెళ్లి గురించి తిడతాడు. అసలు ఆ పెళ్లి అని రాజు అంటే.. కాదంటావా.. ఫ్రెండ్‌నే మోసం చేసినోడికి అబద్ధాలు లెక్కనా అని లక్కీ తిడతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


